అన్వేషించండి

Karthika Deepam 6 Serial Today June 6th: కార్తీకదీపం 2 సీరియల్ : కార్తీక్, దీపలకు చెక్ పెట్టనున్న పారిజాతం.. భర్త, దశరథ్‌ల దగ్గర మాట తీసుకుందిగా!

Karthika Deepam 2 Serial Today Episode : దీప ఇచ్చిన వార్నింగ్‌కు నర్శింహ, శోభలు దీపని సిటీ నుంచి పంపించే వరకు వదిలేదు లేదు అని అనసూయతో చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode  : పాపకి ఏం తినపించలేదు అని దీప కార్తీక్ మీద సీరియస్ అవుతుంది. ఇంతలో శౌర్య తనకి బయటకు తీసుకెళ్లి తినిపించాడు అని చెప్తుంది. ఇక శౌర్యని దీప లోపలికి వెళ్లి ఫ్రెష్ అవ్వమని చెప్తుంది. ఇక దీప, కార్తీక్‌లు మాట్లాడుకుంటారు. ఇక దీప కార్తీక్‌తో శౌర్యకు కొత్త కొత్త రుచులు అలవాటు చేయొద్దని దానికి దగ్గర అవ్వొద్దని చెప్తుంది. పరిస్థితులు చక్కబడ్డాక ఇంకో ఇళ్లు చూసుకొని వెళ్లిపోతామని దీప చెప్తుంది. ఇక కార్తీక్ వెళ్తుంటాడు. శౌర్య వచ్చి కార్తీక్‌కు థ్యాంక్స్ చెప్పావా అంటుంది. దీప లేదు అంటే బుంగ మూతి పెట్టుకుంటుంది. దీంతో దీప కార్తీక్‌ దగ్గరకు వెళ్తుంది. కార్తీక్ దీపతో తిట్టాల్సినవి ఏమైనా మర్చిపోయారా అండీ అని అడుగుతాడు. దీప లేదు అని థ్యాంక్స్ చెప్తుంది. 

పారిజాతం: ఆహా చిలకా గోరింకల్లాగా ఎంత బాగా మాట్లాడుకుంటున్నారో.. సారీలు, థ్యాంక్స్‌లు కథ బాగా ముదిరింది. మనవడా నిన్ను ఇక దారిలో పెట్టాల్సిందే. పెడతాగా ఏం చేయాలో అదే చేస్తాను. 

నర్శింహ, అనసూయ, శోభలు దీప వార్నింగ్ తలచుకొని హడలెత్తిపోతారు. నర్శింహ తాగుతుంటే శోభ దీపని ఏం చేయలేపోయావ్ అని అంటుంది. అనసూయ కూడా శోభకే సపోర్ట్ చేస్తుంది. అసలు దీప ఎందుకు వచ్చింది ఏం చేశావ్ అని అడుగుతారు. దీప దాని కూతురు తప్పిపోయినట్లు తెగ టెన్షన్‌ పడుతుంటే ఇదంతా నేనే చేసినట్లు దానికి ఫోన్ చేసి బిల్డప్ ఇచ్చా అది ఇలా వచ్చేసింది. నువ్వు అని చెప్తేనే ఇలా చేస్తే నిజంగానే ముగ్గురిని చంపేస్తుందని అనసూయ అంటుంది. దానికి శోభ అలా వదిలేయకూడదు అత్తయ్య దానిని ఊరు వెళ్లే వరకు వదిలేది లేదు అని అంటుంది. నర్శింహ కూడా శోభ చెప్పిందే జరిగేలా చేస్తా అంటాడు.

మరోవైపు శివనారాయణ లెక్కలు వేసుకుంటూ ఉంటే పారిజాతం వచ్చి ఆయన్ను చూసి నవ్వుతూ మెలికలు తిరిగిపోతుంది. శివనారాయణ వెటకారంగా తన జేబు నుంచి వంద తీసి పారిజాతానికి ఇస్తాడు. 

పారిజాతం: ముందు నేను చెప్పేది వినండి. రేపు ఏంటో మీకు గుర్తుందా. రేపు నా పుట్టిన రోజు. నేను కోరిన కోరిక తీరుస్తాను అని నాకు మాట ఇవ్వండి.

శివనారాయణ: నేను చచ్చినా మాట ఇవ్వను. నువ్వు కోరే కోర్కెలు నేను తీర్చను.

పారిజాతం: నేను కోట్లు అడుగుతాను అనుకుంటున్నారేమో.. నేను కోరే కోరికతో నోటుతో పని లేదు అండీ నోటితోనే పని.

శివనారాయణ: ముందు కోరిక చెప్పు. అది నచ్చితే అప్పుడు చెప్తా.

పారిజాతం: నేను ఎవరినీ ఇబ్బంది పెట్టను అలాంటి కోరిక కోరను. మాటివ్వండి.

శివనారాయణ: సరే ఎవరినీ ఇబ్బంది పెట్టని కోరిక అంటున్నావ్ కదా అయితే ఇస్తా. పైగా రూపాయి కూడా ఖర్చు లేదు అన్నావ్ కదా. 

పారిజాతం: మనసులో.. నేను ఊరికే మాట తీసుకోలేదు శివనారాయణ. నేను చేసే పనికి నువ్వు అడ్డు రాకూడదు. రేపు ఏం జరుగుతుందో నువ్వే చూస్తావు కదా. చాలా సంతోషం అండీ.

దశరథ్: ఏంటి పిన్నీ చాలా సంతోషంగా ఉన్నావ్.

శివనారాయణ: రేపు మీ పిన్ని పుట్టినరోజురా తను ఓ కోరిక కోరుతుంది నేను కాదు అనకూడదు అంట.

దశరథ్: పిన్ని మీ కోరిక మేం ఎందుకు కాదు అంటామ్. పైగా రేపు నీ పుట్టిన రోజు వేడుకలా చేద్దాం. నాన్నే కాదు నేను మాటిస్తున్నా. నీ కోరిక మేం కాదు అనము పిన్ని. మా కోరిక కూడా నువ్వు కాదు అనకూడదు.  

దీప శౌర్యని పట్టుకొని ఏడుస్తుంది. శౌర్య దీప కన్నీరు తుడుస్తుంది. దీప శౌర్యకు చాలా జాగ్రత్తలు చెప్తుంది. నర్శింహని శౌర్య నీడ కూడా తాకనివ్వను అని అనుకుంటుంది. ఇక శౌర్యని పడుకోపెడుతుంది. తన బిడ్డ జోలికి ఎవరైనా వస్తే వాళ్ల చావు వాళ్లు కొని తెచ్చుకున్నట్లే అని అంటుంది. ఇక కాంచన, శ్రీధర్‌లు కార్తీక్ రాకకోసం ఎదురు చూస్తారు. ఇంతలో కార్తీక్ వస్తాడు. కాంచన కార్తీక్ ఇది వరకు టైం సరికి వచ్చేవాడివి అని ఇప్పుడు అవుట్ హౌస్‌లు అంటూ మాట్లాడుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: కృష్ణ ముకుంద మురారి సీరియల్: ముకుంద తండ్రి శ్రీనివాస్‌ని నిలదీసిన కృష్ణ.. కుమిలిపోతున్న మురారి!

టాప్ హెడ్ లైన్స్

Nindu Manasulu Serial Today July 24th: నిండు మనసులు: గణ నిజంగా మారిపోయాడా! ప్రేరణ, సిద్ధూలతో మాట్లాడింది నిజమేనా!
నిండు మనసులు: గణ నిజంగా మారిపోయాడా! ప్రేరణ, సిద్ధూలతో మాట్లాడింది నిజమేనా!
Karthika Deepam 2 Serial Today July 24th: కార్తీకదీపం 2 సీరియల్: మాలిని ఇంట్లో జ్యోత్స్న! ఆస్తిలో సగం వాటా.. కొడుకుతో పెళ్లి! జ్యోత్స్న ఆఫర్‌కి ఒకే చెప్పేస్తుందా!
కార్తీకదీపం 2 సీరియల్: మాలిని ఇంట్లో జ్యోత్స్న! ఆస్తిలో సగం వాటా.. కొడుకుతో పెళ్లి! జ్యోత్స్న ఆఫర్‌కి ఒకే చెప్పేస్తుందా!
Nuvvu leka Neanu Lenu Serial Today July 24th: ఇంటికి తిరిగి వచ్చిన తప్పిపోయిన చిట్టి....విక్కీకి మాత్రం వచ్చింది చిట్టి కాదని అనుమానం
నువ్వులేక నేను లేను: ఇంటికి తిరిగి వచ్చిన తప్పిపోయిన చిట్టి....విక్కీకి మాత్రం వచ్చింది చిట్టి కాదని అనుమానం
Gundeninda Gudigantalu July 24th Episode:కత్తితో మనోజ్‌ను చంపబోయిన బాలు...పెద్దకొడుకునే తిట్టిన ప్రభావతి
గుండెనిండా గుడిగంటలు: కత్తితో మనోజ్‌ను చంపబోయిన బాలు...పెద్దకొడుకునే తిట్టిన ప్రభావతి

వీడియోలు

Ravichandran Ashwin Criticizes Gambhir | గంభీర్‌పై రవిచంద్రన్ అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Varshini Gowda Biography & Remuneration | వర్షిణి గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Vaibhav Ready For Zimbabwe T20 Series | జింబాబ్వే సిరీస్‌కు ముందు వైభవ్ కామెంట్స్
Sachin Tendulkar’s Advice to Harbhajan Singh | తన సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన హర్భజన్
Gundenininda Gudigantalu Serial July 23 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh Rainfall: ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
Raja Singh : తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
CJP Protests: రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణామం.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణాలు.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
Viral Video: యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
Kumki Elephants: పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
జీవితంలో మొదటి కారు కొనేవారికి మహీంద్రా XUV 3XO ఎందుకు ఉత్తమ ఎంపిక?, రూ.10 లక్షల్లో వచ్చేస్తుంది
రూ.10 లక్షల బడ్జెట్‌లో ఫస్ట్‌ కార్‌ కొనాలనుకుంటున్నారా? డిజైర్‌, నెక్సాన్‌, పంచ్‌, XUV 3XOలో బెస్ట్ ఛాయిస్ ఇదే!
AP Local Body Direct Elections: ఏపీ స్థానిక సంస్థల్లో డైరెక్ట్ ఎలక్షన్స్? - క్యాంప్ రాజకీయాలకు చెక్ పెట్టేలా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్!
ఏపీ స్థానిక సంస్థల్లో డైరెక్ట్ ఎలక్షన్స్? - క్యాంప్ రాజకీయాలకు చెక్ పెట్టేలా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్!
Chittoor Crime News: రైలు కింద పడి ఎమ్మార్వో ఆత్మహత్య.. చిత్తూరు జిల్లాలో ఘటన- అంత కష్టం ఏమొచ్చిందో!
రైలు కింద పడి ఎమ్మార్వో ఆత్మహత్య.. చిత్తూరు జిల్లాలో ఘటన- అంత కష్టం ఏమొచ్చిందో!
Embed widget