అన్వేషించండి

Karthika Deepam 2 Serial Today April 27th: కార్తీకదీపం 2 సీరియల్: బావని పట్టుకొని వెక్కి వెక్కి ఏడ్చిన జ్యోత్స్న, తనవల్లే అంతా అని కుమిలిపోయిన దీప.. రోడ్లమీద అనసూయ పాట్లు!

Karthika Deepam 2 Serial Today Episode: జ్యోత్స్నను మీడియా కంటికి దొరకకుండా కార్తీక్ జైలు నుంచి ఇంటికి తీసుకురావడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode దీప చెప్పిన సాక్ష్యం వల్ల జ్యోత్స్నని అరెస్ట్ చేసి పోలీసులు తీసుకొని వెళ్తారు. దీప సుమతికి క్షమాపణ చెప్పడం చూసిన పారిజాతం దీపను తిడుతుంది. సుమిత్ర అడ్డుకోవడంతో దీపని వెనకేసుకు రావొద్దని అరుస్తుంది.

పారిజాతం: ప్రతీ దానికి నువ్వు దీపని వెనకేసుకురాకు సుమిత్ర. నీ ప్రాణం కాపాడింది అన్నావ్ కానీ నీ పరువు తీసేసింది. నీ కూతుర్ని తీసుకెళ్తే నీకు ఎలా ఉందో తెలీదు కానీ.. నాకు మాత్రం ఇంత పరపతి ఉండి కూడా మనవరాలిని కాపాడుకోలేని పెద్దరికం ఆ పోలీస్ కారులో అడుగుపెట్టడం వల్ల మంట కలిసిపోయింది. దీని అంతటికి కారణం ఇది చెప్పన సాక్ష్యమే.
దీప: పోలీసులు చెప్పే వరకు జరిగింది ఏంటో నాకు తెలీదమ్మా. 
పారిజాతం: మరి తెలీనప్పుడు ఎందుకు మాట్లాడావ్. నిన్న ఈ టైంకి ఇంట్లో సందడిగా కేక్ కట్ చేసిన నా మనవరాలు ఈరోజు పోలీస్ స్టేషన్‌లో ఉంది. దీనికి కారణం నువ్వు కాదా..
సుమిత్ర: ఆపండి అత్తయ్య.. నా కూతురి ఇలాంటి పని చేసిందేంటా అని నేను బాధ పడుతుంటే మీరు దీపని అంటారేంటి. కారు నెంబరు తెలుసుకున్న వారికి కారు నడిపింది ఎవరో తెలుసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు అత్తయ్య. 
పారిజాతం: శని మన ఇంట్లోనే ఉంది. దీన్ని ఇంట్లో నుంచి గెంటేస్తే గానీ..
సుమిత్ర: అత్తయ్య.. మీరు దీపని ఏం అనొద్దు.
పారిజాతం: నువ్వు ఎన్ని అయినా చెప్పు సుమిత్ర. ఈ రోజు దీనికారణంగా నా మనవరాలు పోలీస్‌ స్టేషన్‌కి వెళ్లింది. జరిగిన దానికి అది అక్కడ ఎంత బాధ పడుతుందో ఏంటో.

పోలీస్‌ స్టేషన్‌లో జ్యోత్స్న ఏడుస్తూ కూర్చొని ఉంటుంది. కార్తీక్‌ లోపలికి రావడంతో మీడియా అడ్డుకుంటుంది. వారిని తప్పించుకొని కార్తీక్ లోపలికి వస్తాడు. జ్యోత్స్నని పిలవడంతో జోత్న్న కార్తీక్‌ను చూసి గట్టిగా ఏడుస్తూ కార్తీక్‌నిహగ్ చేసుకుంటుంది. ఇక లాయర్ సంతకాలు పెట్టించి జ్యోత్స్నని ఇంటికి తీసుకెళ్లమంటారు. 

కార్తీక్ జ్యోత్స్నను బయట మీడియా ఉంది. ముఖం కవర్ చేసుకోమని చెప్తాడు. జ్యోత్స్న చున్నీతో ఫేస్ కవర్ చేసుకుంటుంది. కార్తీక్ జ్యోత్స్నని తీసుకెళ్తుండగా మీడియా రకరకాల ప్రశ్నలు వేస్తుంది. వారి నుంచి తప్పించి కార్తీక్ జ్యోత్స్నని ఇంటికి తీసుకెళ్తాడు. 

మరోవైపు అనసూయ సిటీలో అవస్థలు పడుతుంది. భోజనం చేయాలి అనుకొని రేట్లకు భయపడుతుంది. తిట్టుకుంటూ డబ్బులు ఇచ్చి భోజనం చేసుకొని రమ్మంటుంది. నడిచి నడిచి తెగ ఆయాస పడుతుంది. ఈ ఎండల్లో తిరగడం తన వల్ల కాదునుకుంటుంది. తన కొడుకు దీపకి కనిపించాడో లేదో అని అనుకుంటుంది. దీపకు వంటలు వచ్చు కాబట్టి ఎక్కడైనా వంటలు చేస్తుందేమో అని వంట గదిలో చెక్ చేస్తుంది. 

పారిజాతం: ఏడుస్తున్న జ్యోత్స్నతో.. ఏదో తప్పు చేసినట్లు ఎందుకు అలా ఏడుస్తావ్..
సుమిత్ర: అది తప్పు చేయలేదు అత్తయ్య పరువు తీసేసింది. నేను మొదటి నుంచి చెప్తున్నాను దీన్ని వెనకేసుకొని రావొద్దని. 
పారిజాతం: ఒక్కగానొక్క మనవరాలు అని కాస్త గారాభం చేశాను అది కూడా తప్పేనా.
సుమిత్ర: మీరు గారాభం చేయడం లేదు. తప్పుని కప్పిపుస్తున్నారు. మామయ్య గారు, మా ఆయన, నా ఆడపడుచు, మా మేనల్లుడు అందరూ గుట్టుగా కాపాడుకుంటూ వస్తున్న పరువుని మీడియాలో పెట్టింది. కారు రోడ్డు మీద వెళ్తుందో మనుషుల మీద వెళ్తుంది అంటే తెలీకుండా నడుపుతున్న దీన్ని ఏమనాలి.
పారిజాతం: అనాల్సింది దీన్ని కాదు. సాయం చేసింది కదా అని ఎంతో కొంత చేతిలో పెట్టి పంపక. ఇంట్లో పెట్టుకున్నావ్ చూడు దాన్ని. 
దీప: ఏం జరిగిందో నాకు తెలీదు కదామ్మా..
పారిజాతం: తెలియకపోతే నోరు మూసుకొని ఉండాలి.
శివనారాయణ: ఆ పని చేయాల్సింది నువ్వు. నీ నీడ కూడా నా మనవరాలి మీద పడొద్దని చెప్పాను కానీ నువ్వు వినలేదు.
పారిజాతం: తప్పు చేసిన దాన్ని వదిలేసి నన్ను అంటారేంటి.
కార్తీక్: పారు దీన్నిఇంకా పెంచడం అవసరమా..
పారిజాతం: ఏడుస్తూ.. లేకపోతే ఏంట్రా వీళ్లు అంతా నన్ను అంటున్నారు. అది యాక్సిడెంట్ చేసింది నేనేం కాదు అనలేదు. ఆడపిల్లని ఎందుకు రోడ్డున పడేయాలి అని బంటుగాడిని పంపించాలి అనుకున్నాను కానీ ఈ మహాతల్లి పిలవని పేరంటానికి వాయినం తీసుకోవడానికి వచ్చినట్లు మధ్యలో వచ్చి జ్యోత్స్న తప్పు చేసిందని చెప్పింది. నా మనవరాలికి ఈ పరిస్థితి వచ్చింది అంటే దానికి ఈ దీప కారణం కాదా.. మీ తాతయ్య నన్ను అంటున్నారు. 
దశరథ్: ఇక ఎవరూ దీని గురించి మాట్లాడొద్దు వదిలేయండి..
దీప: జ్యోత్స్న చేయి పట్టుకొని.. నేను నిజం చెప్పి తప్పు చేశానని నాకు అర్థమైంది. నన్ను క్షమించు జ్యోత్స్న. మీడియా వాళ్లు చేసిన అవమానం తలచుకున్న జ్యోత్స్న కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. 

మరోవైపు కనకం రాత్రి వేళ రోడ్లమీద తిరుగుతూ తెగ ఇబ్బంది పడుతుంది. దీప జాడ తెలియక కుమిలిపోతుంది. దీపకు ఫోన్ చేస్తుంటే కలవడం లేదని అంటే దీపకి ఊరు వచ్చే ఉద్దేశం లేదని అనుకుంటుంది. రేపు ఒక్క రోజు వెతికి ఊరు వెళ్లిపోతానని అనుకుంటుంది. ఇక ఫుట్‌పాత్ మీద పడుకుంటుంది. 

మరోవైపు బంటు పారిజాతం దగ్గరకు వచ్చి పోలీస్‌ స్టేషన్‌కి వెళ్తాను అని సుమిత్రను చంపాలి అనుకున్నది తానే అని ఆ పని చేయమని చెప్పింది మీరే అని చెప్పేస్తా అని అంటాడు. దీప దేవతలా తనని కాపాడింది అని లేకపోతే పోలీస్ స్టేషన్‌లో ఉండేవాడినని అనుకుంటాడు. పారిజాతం ఎంత నచ్చచెప్పినా వినడు. పారిజాతం ఏవేవో చెప్తే బంటుని కన్విస్ చేస్తుంద. ఖర్చుకు డబ్బులు ఉన్నాయా అని అడిగి మస్కా కొడుతుంది. మొత్తానికి బంటుని దారిలోకి తెచ్చుకుంటుంది. ఇక దీప సంగతి చూడాలి అనకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: 'త్రినయని' సీరియల్: తిలోత్తమను అల్లాడించిన గుర్రపు హోరు, గుండె పట్టుకొని విలవిల్లాడిన వైనం.. విశాలాక్షి వస్తేనే పరిష్కారం!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjuns Bail Petition: అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ వాదనలు పూర్తి, తీర్పు వాయిదా వేసిన నాంపల్లి కోర్టు
అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ వాదనలు పూర్తి, తీర్పు వాయిదా వేసిన నాంపల్లి కోర్టు
Aus Vs Ind Test Series: బాక్సింగ్ డే టెస్టు ఆసీస్ దే.. విజయం సాధించిన కంగారూలు.. నాలుగో టెస్టులో భారత్ ఓటమి
బాక్సింగ్ డే టెస్టు ఆసీస్ దే.. విజయం సాధించిన కంగారూలు.. నాలుగో టెస్టులో భారత్ ఓటమి
Telangana News: మన్మోహన్ సింగ్‌‌కు తెలంగాణ శాసనసభ సంతాపం, భారతరత్న ఇవ్వాలని సభలో తీర్మానం
మన్మోహన్ సింగ్‌‌కు తెలంగాణ శాసనసభ సంతాపం, భారతరత్న ఇవ్వాలని సభలో తీర్మానం
KTR News: సీఎం రేవంత్ రెడ్డి తీర్మానానికి సంపూర్ణ మద్దతు తెలిపిన కేటీఆర్, ప్రభుత్వానికి కీలక సూచన
సీఎం రేవంత్ రెడ్డి తీర్మానానికి సంపూర్ణ మద్దతు తెలిపిన కేటీఆర్, ప్రభుత్వానికి కీలక సూచన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్, అసలు నిజాలు చెప్పిన పోలీసులుగవాస్కర్ కాళ్లు మొక్కిన నితీష్ తండ్రి..  ఎమోషనల్ వీడియోసెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjuns Bail Petition: అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ వాదనలు పూర్తి, తీర్పు వాయిదా వేసిన నాంపల్లి కోర్టు
అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ వాదనలు పూర్తి, తీర్పు వాయిదా వేసిన నాంపల్లి కోర్టు
Aus Vs Ind Test Series: బాక్సింగ్ డే టెస్టు ఆసీస్ దే.. విజయం సాధించిన కంగారూలు.. నాలుగో టెస్టులో భారత్ ఓటమి
బాక్సింగ్ డే టెస్టు ఆసీస్ దే.. విజయం సాధించిన కంగారూలు.. నాలుగో టెస్టులో భారత్ ఓటమి
Telangana News: మన్మోహన్ సింగ్‌‌కు తెలంగాణ శాసనసభ సంతాపం, భారతరత్న ఇవ్వాలని సభలో తీర్మానం
మన్మోహన్ సింగ్‌‌కు తెలంగాణ శాసనసభ సంతాపం, భారతరత్న ఇవ్వాలని సభలో తీర్మానం
KTR News: సీఎం రేవంత్ రెడ్డి తీర్మానానికి సంపూర్ణ మద్దతు తెలిపిన కేటీఆర్, ప్రభుత్వానికి కీలక సూచన
సీఎం రేవంత్ రెడ్డి తీర్మానానికి సంపూర్ణ మద్దతు తెలిపిన కేటీఆర్, ప్రభుత్వానికి కీలక సూచన
Game Changer: 'గేమ్ చేంజర్' చూసిన చిరంజీవి... మెగాస్టార్ ఇచ్చిన రివ్యూ ఏమిటో తెలుసా?
'గేమ్ చేంజర్' చూసిన చిరంజీవి... మెగాస్టార్ ఇచ్చిన రివ్యూ ఏమిటో తెలుసా?
TDP Mangalagiri Record: నారా లోకేష్ ఎఫెక్ట్ - టీడీపీ సభ్యత్వ నమోదులో మంగళగిరి రికార్డ్
నారా లోకేష్ ఎఫెక్ట్ - టీడీపీ సభ్యత్వ నమోదులో మంగళగిరి రికార్డ్
Game Changer : 'గేమ్ ఛేంజర్' పాటల కోసమే అన్ని కోట్లా? ఒక్కో పాట స్పెషల్ ఏంటంటే?
'గేమ్ ఛేంజర్' పాటల కోసమే అన్ని కోట్లా? ఒక్కో పాట స్పెషల్ ఏంటంటే?
Tigrer Tension: 21 రోజుల్లో 300 కి.మీ - 3 రాష్ట్రాలను హడలెత్తించిన పులిని బంధించిన అధికారులు
21 రోజుల్లో 300 కి.మీ - 3 రాష్ట్రాలను హడలెత్తించిన పులిని బంధించిన అధికారులు
Embed widget