Trinayani Serial Today April 27th: 'త్రినయని' సీరియల్: తిలోత్తమను అల్లాడించిన గుర్రపు హోరు, గుండె పట్టుకొని విలవిల్లాడిన వైనం.. విశాలాక్షి వస్తేనే పరిష్కారం!
Trinayani Serial Today Episode తిలోత్తమకు తగిన బుద్ది చెప్పాలని గురువుగారు, విశాల్ కలిసి ప్లాన్ చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Trinayani Today Episode హాల్‌లో రెడ్ క్లాత్‌లో ఏదో మూట పెట్టి ఉంటారు. అందరూ ఏంటదని కంగారుపడతారు. విశాల్ చూడబోతే విక్రాంత్ అడ్డుకుంటాడు. ఇంతలో గురువుగారు వచ్చి అందులో ఏం కట్టి పెట్టారని అడుగుతారు. దీంతో సుమన అదే తెలిస్తే మిమల్ని ఎందుకు అడుగుతామని అంటుంది..
విక్రాంత్: నీకు విషయం అర్థం కావడం లేదు. ఏం కట్టిపెట్టారు అని గురువుగారు అడిగారు అంటే ఆయన తీసుకురాలేదు అని అర్థం.
విశాల్: కరెక్ట్.
హాసిని: మనలోనే ఎవరో ఒకరు పెట్టారు. కానీ చెప్పడం లేదు. అని అంటే గురువుగారు నేను విప్పి చూస్తాను మీరు భయపడొద్దని అంటారు..
గురువుగారు: మూట విప్పి.. టెంకాయ, గుర్రపునాడ, దిష్టిబొమ్మ ఉన్నాయని తీసి చూపిస్తారు.
విశాల్: ఎందుకు ఇవన్నీ ఏం చేద్దామని తీసుకుపెట్టారు.
నయని: ఎవరు పెట్టారని చెప్పమంటే చెప్పడం లేదు కదా.
విక్రాంత్: అయినా ఇవన్నీ ఏం చేస్తారు.
గురువుగారు: గాయత్రీ దేవిని ఇక్కడి నుంచే కట్టడి చేద్దాం అనుకున్నారు.
డమ్మక్క: వారు అంటే ఎవరు.
హసిని: ఇంకెవరు.
వల్లభ: ఏయ్ మా వైపు చూస్తావేంటి నువ్వు.
తిలోత్తమ: మీ చూపులకు మమల్ని అనుమానిస్తున్నారు హాసిని.
పావనా: అయితే ఇది మీ పని కాదు అంటారా అక్కాయ్.
డమ్మక్క: అనవసరంగా అనుమానించుకొని ఒకరి మీద మరొకరు అనుమానం పెంచుకోకండి. మూట కట్టింది అయితే తిలోత్తమ కాదు అని నా మనసు చెప్తుంది.
హాసిని: గురువుగారు మీరే చెప్పాలి ఇలా ఎవరు చేశారో.
గురువుగారు: ఎవరని చెప్తాను. కానీ ఇలా చేయడం వల్ల ఫలితం చెప్తాను. నిజానికి దిష్టి తగలకుండా చేయడానికి ఇలాంటివి వాడుతారు. కానీ ఇక్కడ ఇంకో పని చేయొచ్చు. వీటిని విశాలాక్షికి ఇస్తే తర్వాత జరగబోయేది ఏంటో మీరే చూస్తారు.
పావనా: సోదరి ఇంట్లో లేదు కదా స్వామి.
డమ్మక్క: రేపు అమ్మ వస్తుంది. అప్పటి వరకు వీటిని జాగ్రత్తగా ఉంచండి.
హాసిని వాటిని తీసుకొని జాగ్రత్త పరుస్తా అంటే గాయత్రీ పాప వాటిని పట్టుకొని లాగేస్తుంది. దీంతో కొబ్బరి కాయ పగిలి బొమ్మ, గుర్రపునాడ మీద పడుతుంది. దీంతో పెద్ద గాలి వీచి గుర్రం పరుగు సౌండ్ పెద్దగా వినిపిస్తుంది. దీంతో అందరూ చెవులు మూసుకుంటారు. తిలోత్తమ ఆ సౌండ్‌కి కుప్పకూలిపోతుంది. గుండె పట్టుకొని కూర్చొంటుంది. తెగ ఆయాస పడుతుంది.
తిలోత్తమ: గుర్రం నా గుండెల మీద కాలు పెట్టి గట్టిగా తొక్కుతున్నట్లు ఉంది. శ్వాస తీసుకోవడం చాలా కష్టంగా ఉంది.
గురువుగారు: రేపు విశాలాక్షి వచ్చాక అన్నీ ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. కంగారు పడాల్సిన పని ఏం లేదు.
నయని: ప్రాణాపాయం తప్పినట్లే కదా గురువుగారు.
గురువుగారు: ఈ ఉసురు పోయిన టైం అయితే ఇది కాదు. ఫ్లాష్‌బ్యాక్.. మూట తీసుకొని వచ్చి.. విశాలా ఈ మూట ఇక్కడ పెడతాను ఏం తెలియనట్లే నన్ను రక్షించండి. ప్రాణాంతకులకు ప్రాయశిత్తం జరగాలి అంటే తప్పదు.
విశాల్: అవును స్వామి ముళ్లును ముళ్లుతోనే తీయాలి.
సుమన తన భర్తతో తిలోత్తమ ఇబ్బంది పడి శ్వాస ఆడలేదు అని. రేపు నన్ను నా బిడ్డ ఉలూచికి కూడా శ్వాస ఆడకుండా చనిపోతే అంటుంది. నయని, విశాల్‌లను తిడుతుంది. దీంతో విక్రాంత్ వాళ్లిద్దరూ ఎంతో ఆస్తి సంపాదించారని మనుషుల్ని కూడా సంపాదించుకున్నారని అందుకే ఇంట్లో అందరు ఉంటున్నారని అంటాడు. తన తల్లి, విక్రాంత్, సుమన బయటకు వెళ్తే ఒక్కరు కూడా పట్టించుకోరు అని తిడతారు.
మరోవైపు తిలోత్తమ గదిలో లైట్ ఆన్ ఆఫ్ అవుతుంది. వల్లభ వచ్చి కరెంట్‌తో ఆడుకుంటున్నావ్ ఏంటి అమ్మా అంటాడు. ఇక వల్లభని లైట్ ఆపేయమని తిలోత్తమ అంటుంది. ఇంతలో లైట్ వేయకుండానే మళ్లీ లైట్ ఆన్ ఆఫ్ అవుతుంది. దీంతో తిలోత్తమ కంగతారు పడుతుంది. దీంతో తిలోత్తమ తెగ టెన్షన్ పడుతుంది. అయితే మరోసారి గుర్రం సౌండ్ తిలోత్తమకు వినిపిస్తుంది. తిలోత్తమ మళ్లీ చాలా ఇబ్బంది పడుతుంది. తల పట్టుకొని అరుస్తుంది. వల్లభ కంగారు పడతారు. భయం వేస్తుందని అంటాడు. దీంతో తిలోత్తమ గుర్రం అని తన వైపు వస్తుందని తెగ ఇబ్బంది పడుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: భార్యతో థాయ్‌లాండ్ వెకేషన్‌లో ఆది పినిశెట్టి - ఫోటోలు వైరల్