Karthika Deepam 2 Serial October 12th: కార్తీకదీపం 2 సీరియల్: ఇప్పుడే.. ఇక్కడే.. తాళి కడతావా.. చావమంటావా.. కార్తీక్‌ని ఆలోచనలో పడేసిన జ్యోత్స్న!
Karthika Deepam 2 Serial Episode కార్తీక్ ఇంటికి జ్యోత్స్న తాళి బొట్టుతో వెళ్లి పెళ్లి చేసుకోమని లేదంటే చస్తానని బెదిరించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Karthika Deepam Idi Nava Vasantham Serial Episode నర్శింహకి దీపకి గొడవ జరుగుతుంది. దీప తాళి పట్టుకొని నర్శింహ నీకు నేనే వద్దు ఇక నా తాళి ఎందుకని దీప మెడలో తాళి తెంపేస్తాడు. దీప తాళి పక్కనే ఉన్న మంటల్లో పడిపోతుంది. దీప షాక్ అయిపోతుంది. కోపంతో పక్కనే ఉన్న బండరాయి భర్త మీదకు ఎత్తడంతో నర్శింహ పారిపోతాడు.
దీప తాళిని చూసి చాలా ఏడుస్తుంది. అనసూయ కోడల్ని ఓదార్చుతుంది. కోర్టు మీకు విడాకులు ఇస్తే ఈ రోజు నీకు విముక్తి వచ్చిందని ఈ రోజుతో వాడికి నీకు ఎలాంటి సంబంధం లేదని అంటుంది. అత్త ఎంత చెప్తున్నా దీప ఏడుస్తుంది. నా కోడలిగా నువ్వు కూడా చచ్చిపోయావని ఇప్పుడు నువ్వు నా మేనకోడలివని అనసూయ అంటుంది. ఇద్దరికీ ధైర్యం చెప్పి ఇంటికి తీసుకెళ్తుంది. మరోవైపు దాసు పార్క్‌లో కూర్చొని ఉంటే ఓ వ్యక్తి దాసుకి తెలీకుండా ఆయన స్కెచ్ వేస్తాడు. ఆ వ్యక్తి వచ్చి మాటి మాటికి దాసుని చూడటంతో దాసు ఏంటి ఇలా చూస్తున్నాడని అనుకుంటాడు. అనుమానంతో ఆయన దగ్గరకు వెళ్తే స్కెచ్ ఇస్తాడు. దాంతో దాసు ఇంప్రెస్ అయి డబ్బులు ఇస్తాడు. ఇక ఇంటి వారసురాలిని తీసుకెళ్లిన వ్యక్తి (దీప తండ్రి) బొమ్మ వేయించాలి అనుకుంటాడు. స్కెచ్ తీసుకొని సంతోషంగా ఇంటికి వెళ్తాడు.
మరోవైపు జ్యోత్స్న, పారిజాతం మాట్లాడుకుంటారు. పెళ్లి చూపులకు వస్తున్నారని నా జీవితం నాశనం చేశారని జ్యో ఆవేశ పడుతుంది. దీపే ప్లాన్‌గా ఇలా చేసిందని తాత, నాన్న నాకు వేరే పెళ్లి చేస్తే దాని లైన్ క్లియర్ అవుతుందని అంటుంది. నేను ఏంటో అందరికీ అర్థమయ్యేలా చేస్తానని అంటుంది. మరోవైపు స్వప్న కాశీలు మాట్లాడుకుంటారు. ఇక కాశీ స్వప్నని జాబ్ చేయమని అంటాడు. దానికి స్వప్న నేను బిజినెస్ చేస్తానని అంటుంది. ఇక దాసు పోలికలు చెప్పి వారసురాలిని ఎత్తుకెళ్లిన దీప తండ్రి స్కెచ్ తీసుకొని వస్తాడు. స్వప్న, కాశీలకు స్కెచ్ చూపిస్తాడు. ఇక జ్యోత్స్న కార్తీక్ ఇంటికి వెళ్తుంది.
కాంచన: ఇప్పటి వరకు పెళ్లి విషయంలో వాళ్ల నిర్ణయం వెనక్కి తీసుకుంటారని అనుకున్నానురా. కానీ ఇప్పుడు అర్థమైందిరా నా మేనకోడలిని నాకు దూరం అయిపోయిందని.
జ్యోత్స్న: అలా అవ్వకూడదు అంటే మనం చేయాల్సింది ఒకటి ఉంది అత్త.
కార్తీక్: మళ్లీ నువ్వు ఎందుకు వచ్చావ్.
జ్యోత్స్న: నిన్ను పెళ్లి చేసుకొని ఈ ఇంట్లో కోడలిగా ఉండాల్సిన దాన్ని నేను ఎందుకు రాకుండా ఉంటాను. నిన్ను తప్పు ఇంకెవరినీ నేను పెళ్లి చేసుకోను బావ.
కార్తీక్: నన్ను తప్ప ఇంకెవరిని చూపించిన మీ తాత చేస్తాడు.
జ్యోత్స్న: నా పెళ్లి విషయంలో వాళ్లు ఓ నిర్ణయం తీసుకున్నట్లే నేను ఓ నిర్ణయం తీసుకున్నాను. ఈ సమస్యల అన్నింటికీ అదే పరిష్కారం అలా చేస్తేనే మన రెండు కుటుంబాలు కలుస్తాయి. అయి తాళి బొట్టు చూపిస్తుంది.
కాంచన: ఏంటి జ్యోత్స్నా ఇది
జ్యోత్స్న: నేను అన్నీ ఆలోచించే నిర్ణయం తీసుకున్నా అత్త. బావ ఈ తాళి నా మెడలో కట్టు. మన పెళ్లి ఎవరు ఆపుతారో చూస్తాను.
కార్తీక్: ఇదేమైనా బొమ్మల పెళ్లి అనుకున్నావా ముందు ఇంటికి వెళ్లు.
జ్యోత్స్న: ఒంటరిగా వెళ్లను బావ జంటగానే వెళ్తా.
కాంచన: నీ బాధ నాకు అర్థమవుతుంది జ్యోత్స్న కానీ ఇది కరెక్ట్ కాదు. నేను ఏదో ఒకటి చేస్తానే
జ్యోత్స్న: ఎవరు ఏం చేయాల్సిన అవసరం లేదు నేను నువ్వు మా డాడీ దగ్గర తీసుకున్న నిర్ణయం నేను సరి చేస్తా. నేను అన్నీ ఆలోచించే వచ్చాను తాళి కట్టు బావ.
కార్తీక్: మామూలుగా చెప్తున్నాను అని సరదాగా తీసుకుంటున్నావా ముందు ఇంటికి వెళ్లు.
జ్యోత్స్న: నేను మొండి దాన్ని అని తెలుసుకదా నువ్వు అంటే నాకు ప్రాణం బావ ప్రాణం కంటే ఎక్కువ. నీ కోసం చచ్చిపో మంటే ఇక్కడే చస్తా. టైం లేదు నేను ఇంట్లో చెప్పకుండా వచ్చాను వాళ్లు కంగారు పడతారు. తాళి కట్టుబావ.
కార్తీక్: సారీ జ్యోత్స్న మన పెళ్లి జరగాలి అంటే అది ఇరు కుటుంబాల ఇష్టంతోనే జరగాలి. లేదంటే నువ్వు నన్ను మర్చిపో.
జ్యోత్స్న: అది జరగని పని కానీ నువ్వు నా మెడలో తాళి కడతావా లేదా. నాకు చిన్నప్పటి నుంచి ఏం చెప్పారో దాన్ని నిజం చేసుకోవడానికి వచ్చా.
కార్తీక్: పారు బాగా ట్రైనింగ్ ఇచ్చినట్లుంది.
జ్యోత్స్న: అవతల మా తాత నాకు వేరే పెళ్లి సంబంధం చూశాడు. నువ్వు నా మెడలో తాళి కట్టు బావ.
కార్తీక్: నేను మీ తాతకి చెప్పకుండా నీ మెడలో తాళి కట్టను.
జ్యోత్స్న: అయితే నువ్వు నా అఖరి మాట విను నువ్వు నా మెడలో తాళి కట్టకపోతే ఈ విషం తాగి ఇక్కడే చస్తాను. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.