Karthika Deepam 2 Serial Today November 21st: కార్తీకదీపం 2 సీరియల్: కార్తీక్ పుట్టిన రోజున సర్‌ఫ్రైజ్ ఇచ్చిన దీప.. బావకి విష్ చేయడానికి తిప్పలు పడుతున్న జ్యోత్స్న!
Karthika Deepam 2 Serial Today Episode కార్తీక్ పుట్టిన రోజు అని దీప తెలుసుకొని కార్తీక్ గది డెకరేషన్ చేసి సర్‌ఫ్రైజ్ చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode శౌర్యకి ఏమైందో చెప్పమని దీప కార్తీక్‌ని అడిగి తన మీద ఒట్టు పెట్టుకొని నిజం చెప్పమని అడుగుతుంది. దాంతో కార్తీక్ దీపతో శౌర్యకి సమస్య ఉందని చెప్తాడు. శౌర్యకి ఉన్న సమస్య నువ్వే అని చెప్తాడు. దీప షాక్ అయిపోతుంది. మన కూతురి సంతోషం గురించి ఆలోచించకుండా దాని సంతోషం పట్టించుకోకుండా ఉన్నావని అంటాడు. మందులు వేయకుండా నా మాట ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావ్ అని దీపని అంటాడు. ఇంకోసారి ఇలా నిర్లక్ష్యం చేయొద్దని చెప్పి కార్తీక్ వెళ్లిపోతాడు. దీప పాప దగ్గర కూర్చొని పాపకి ఏం కాకూడదని ఏడుస్తుంది.
అనసూయ: అమ్మా చంటి దాని ఆరోగ్యం గురించి కార్తీక్ బాబు దాచి బాగా నలిగిపోతున్నారు.
కాంచన: నేను అదే ఆలోచిస్తున్నా అనసూయ కానీ దీపకి నిజం చెప్పలేం కదా.
అనసూయ: నిజం చెప్తే అది తట్టుకోలేదమ్మా. దానికి కూతురు అంటే ప్రాణం కంటే ఎక్కువ తాళి పోగొట్టుకొని మరీ కాపాడుకుంది. దానికి ఏమైనా అయితే ఇది మనకు దక్కదమ్మా.
కాంచన: చంటి దాని విషయంలో మనం ఎలా అయినా జాగ్రత్తగా ఉంటాం కానీ ముందు వీళ్లని కలపాలి.
ఇక కాంచన రేపు కార్తీక్ పౌర్ణమి అని రేపు కార్తీక్ పుట్టిన రోజు అని అనసూయతో చెప్పడంతో దీప వింటుంది. కార్తీక్ పౌర్ణమి రోజు పుట్టడంతో కార్తీక్ అని పేరు పెట్టానని చెప్తుంది. ఇక కార్తీక్‌కి సెలబ్రేషన్స్ ఇష్టం ఉండవని మనం ఏం చేయొద్దని చెప్తుంది. దీప కాంచనకు పాలు తీసుకొని వస్తుంది. మరోవైపు జ్యోత్స్న పారిజాతంతో బావ పుట్టిన రోజుకి విష్ చేయాలని మనం బావ దగ్గరకు వెళ్దామని అంటుంది. పారిజాతం వద్దని తెలిస్తే మీ తాత ఒప్పుకోడు అంటే దానికి జ్యోత్స్న నా బావ భర్త్‌డే అని అంటుంది. దానికి పారిజాతం మీ అమ్మకి చెప్పు అని అంటుంది. దాంతో జ్యోత్స్న తల్లిదగ్గరకు వెళ్తుంది.
జ్యోత్స్న: మమ్మీ రేపు కార్తీక్ పౌర్ణమి అంటే బావ పుట్టిన రోజు ఇద్దరం వెళ్లి కేక్ కట్ చేయించి విష్ చేసి వద్దామమ్మా. పెళ్లి గురించి మాట్లాడను అమ్మా. నువ్వు సరే అంటే ఎవరికీ తెలీకుండా వెళ్దాం.
దశరథ్: ఎక్కడికి వెళ్లేది వాళ్లు మనల్ని వద్దు అనుకున్నారు మనం వాళ్లని వద్దు అనుకున్నాం.
జ్యోత్స్న: డాడీ ప్లీజ్ డాడీ..
దశరథ్: నువ్వు ఎంత సేపు బతిమాలినా నేను ఒప్పుకోను జ్యోత్స్న. వద్దు అనుకున్నవాళ్ల దగ్గరకు వెళ్లకపోతే మంచిది.
సుమిత్ర: విషెష్ చెప్తా అంటోంది కదా.
దశరథ్: చెల్లిని వద్దు అనుకున్నా కానీ ఇంకా భార్యని వద్దు అనుకోలేదు సుమిత్రా నాన్నకి ఇష్టం లేని ఏ పని నేను చేయను గుడ్ నైట్.
కార్తీక్ పడుకొని ఉంటే బెలూన్స్ డెకరేషన్ చేసి శౌర్య, కాంచన, అనసూయలు కార్తీక్‌కి భర్త్‌డే విషెస్ చెప్తారు. ఇలాంటి వన్నీ వద్దన్నాను కదా అంటే దానికి శౌర్య అమ్మ చేసిందని చెప్తుంది. కార్తీక్ దీపని చూస్తే దీప కార్తీక్‌ని చూస్తూ ఉండిపోతుంది. ఇక దీప పుట్టిన రోజు శుభాకాంక్షలు కార్తీక్ బాబు అంటే షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పాలని శౌర్య అని ఇద్దరి చేతులు కలుపుతుంది. ఇక గుడికి వెళ్లి పూజలు చేసి కోనేటిలో దీపం వదులుతామని కాంచన చెప్తుంది. ఇవన్నీ న కోసం అమ్మే చేసింది నాన్న అమ్మకి నువ్వంటే ఇష్టం అని అంటుంది.
ఉదయం పారిజాతం జ్యోత్స్నతో నువ్వే కార్తీక్ ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు చెప్పిరా అంటే శివనారాయణ కోప్పడతాడు. మనం అంటే లెక్కలేని ఇష్టం లేని మనుషుల దగ్గరకు మనం ఎందుకు వెళ్లాలని అంటారు. వాళ్లందరికీ బుద్ధి చెప్పే రోజు తొందర్లోనే ఉందని వాళ్ల ఇంటి గుమ్మం తొక్కొద్దని మనవరాలు వెళ్లినట్లు తెలిస్తే నువ్వు ఈ ఇంట్లో ఉండే చివరి రోజు ఇదే అవుతుందని అంటాడు. డైరెక్ట్‌గా వెళ్లి విష్ చేస్తానని జ్యోత్స్న అంటే ఫోన్ చేసి విష్ చేయమని పారిజాతం అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: సత్యభామ సీరియల్: చక్రవర్తికి సర్‌ఫ్రైజ్ ఇచ్చిన క్రిష్.. మైత్రి ఇంట్లో హర్ష.. నందిని ఫైర్!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

