అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source:  Poll of Polls)

Satyabhama Serial Today November 21st: సత్యభామ సీరియల్: చక్రవర్తికి సర్‌ఫ్రైజ్ ఇచ్చిన క్రిష్.. మైత్రి ఇంట్లో హర్ష.. నందిని ఫైర్!

Satyabhama Today Episode చక్రివర్తి పుట్టిన రోజు అని జయమ్మ సంజయ్‌కి చెప్తే సంజయ్ పట్టించుకోకపోవడంతో చక్రివర్తి ఫీలవడం క్రిష్ బాబాయ్ కోసం సర్‌ఫ్రైజ్ ఏర్పాటు చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Satyabhama Serial Today Episode క్రిష్ మహదేవయ్య కాళ్లు నొక్కడం సత్య చూస్తుంది. మహదేవయ్య సత్యని చూసి నవ్వుతాడు. దాంతో సత్య మనసులో మీ తమ్ముడు నాకు సహకరించి ఉంటే క్రిష్‌ ఇప్పుడు ఇలా నీ కాళ్లు పట్టేవాడు కాదు నీ పీక పట్టేవాడు. నీ దుర్మార్గానికి నూకలు చెల్లిపోయావి నిన్ను ఓ ఆట ఆడిస్తా అని అనుకుంటుంది. 

మరోవైపు ఇంట్లో సంజయ్ డ్యాన్స్ చేసుకొని వస్తూ ఉంటాడు. జయమ్మ ఎంత పిలిచినా వినిపించుకోడు. నాకు పని ఉందని సంజయ్ అంటే రోడ్లు ఊడ్చడానికి మున్సిపాలిటీ వాళ్లు ఉన్నారు కానీ నువ్వు ఎక్కడికి అని అంటుంది. ఇక రేపు మీ నాన్న పుట్టిన రోజు గుర్తులేలా అంటే సంజయ్ అనవసరమైన విషయాలు నాకు అవసరం లేదని అంటాడు. సంజయ్ మాటలు విని చక్రవర్తి బాధ పడతాడు. చక్రవర్తి వెనక సత్య నిల్చొచి సత్య కూడా ఫీలవుతుంది. ఫ్రీ టైంలో మెసేజ్ పెడతాను కేక్ కటింగ్‌లు అవి ఎందుకు అని మాట్లాడుతాడు.  

సత్య: ఎందుకు ఫీలవుతున్నారు మామయ్య. సంజయ్ మాటలకా తను మీ కొడుకు కాదు కదా.
చక్రి: పాతికేళ్లకు పైగా పెంచానమ్మా కొంచెం అయినా అభిమానం ఉండాలి కదా.
సత్య: మీరు నీరు పోసి పెంచింది కలుపు మొక్కకి దానికి గులాబీలు పూయవు. కన్న కొడుకు గురించి మీరు చెప్పరు పెంచిన కొడుకు మిమల్ని పట్టించుకోడు. ఇప్పటికైనా నిజం చెప్పండి. మీ కొడుకుకి నిజం తెలిస్తే మిమల్ని గుండెల్లో పెట్టి చూసుకుంటాడు. ఆలోచించండి మామయ్య.

నందిని అందంగా రెడీ అయి శాంతమ్మ దగ్గరకు వెళ్లి ఎలా ఉన్నాను అని అడుగుతుంది. దాంతో శాంతమ్మ ఇంత అందంగా రెడీ అవడం వచ్చి కూడా ఎందుకే జుడ్డు ముఖంతో ఉంటావు ఇలా అయితే నీ మొగుడు ఎవర్తినో తగులుకుంటాడని అంటుంది. దాంతో నందిని నా మొగుడు ఎవరినీ తగులుకోడు అంటుంది. మరోవైపు మైత్రి బస్‌ స్టాఫ్‌లో కొందరు రౌడీలతో మాట్లాడి హర్ష వచ్చినప్పుడు తనని యాక్సిడెంట్ చేయమని చెప్తుంది. హర్ష రావడం చూసి మైత్రి వాళ్లకి సైగలు చేస్తుంది. ఇక నందిని హర్షకి కాల్ చేసి ఫుడ్ ఫెస్ట్‌కి తీసుకెళ్తా అన్నావు ఇంకా రాలేదు అంటే 5 నిమిషాల్లో వస్తా అంటాడు. ఇక రౌడీలు మైత్రికి గుద్దేస్తారు. మైత్రి నటన మొదలు పెడుతుంది. ఇక మైత్రి నడవలేను అంటే ఆటోలో మైత్రి ఇంటికి తీసుకెళ్తాడు. 

మరోవైపు సత్య క్రిష్‌ని వయ్యారాలు తిరిగుతూ బయటకు వెళ్లకుండా ఆపుతుంది. ఇక మీ బాపు నీకు ఓ పని చెప్పాడు కదా అంటే క్రిష్‌ వెంటనే సత్యని తోసేసి ఇప్పుడే వెళ్లాలి అంటాడు. ఇక క్రిష్ సత్యతో ఓ సర్‌ఫ్రైజ్ ఉంది అన్నావ్ ఏంటి అని అడుగుతాడు. దానికి సత్య గుడ్‌న్యూస్ రెడీగా ఉంది టైం వస్తే చెప్తా అంటుంది. ఇక సత్య రేపే మీ బాబాయ్ పుట్టిన రోజు కదా గుర్తుందా అని అంటుంది. చక్రవర్తి గురించి సత్య చెప్తే క్రిష్ మనసులో ఏంటి సత్య బాబాయ్‌ గురించి రుద్దు తుంది అని అంటుంది. నిన్ను చాలా అభిమానిస్తారు అని సంజయ్ ఉన్నా లేకపోయినా ఒకటే అని నువ్వే చూసుకోవాలి కదా సర్‌ఫ్రైజ్ ఇవ్వు అంటుంది. 

మరోవైపు నందిని రాత్రి హర్ష కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. శాంతమ్మ నందిని దగ్గరకు వచ్చి భర్తతో బయటకు వెళ్తానని సాయంత్రం బయల్దేరావు ఇంకా రాలేదా వాడు అని అంటుంది. దాంతో నందిని అసలే కోపంగా ఉన్నాను నన్ను కదపొద్దు అంటుంది. కోపంతో హర్షకి కాల్ చేస్తుంది. ఇక డాక్టర్ మైత్రికి కట్ట కట్టి కాలు బెనికింది రెస్ట్ తీసుకోవాలి తోడు ఎవరో ఉండాలి ఈయన నీ భర్తే కదా తోడు ఉండాలి అని అంటుంది. నందిని కాల్ చేస్తే హర్ష మాట్లాడలేక ఇబ్బంది పడతాడు. కాల్ కట్ చేస్తాడు. మైత్రి మాత్రం మనసులో హర్ష లేటుగా వెళ్లేలా చేయాలని అనుకుంటాడు.

నందిని మళ్లీ కాల్ చేస్తే మైత్రికి యాక్సిడెంట్ అయితే వాళ్ల ఇంటికి తీసుకొచ్చా అంటే నందిని కోపంతో ఆవిడకి రాత్రంతా సేవలు చేసుకొని అక్కడే ఉండు అంటుంది. ఇక రాత్రి క్రిష్, సత్య, జయమ్మలు చక్రవర్తి గదికి వెళ్లి పుట్టిన రోజు విష్ చేస్తారు. చక్రవర్తి కనీళ్లు పెట్టుకొని ఎప్పుడో మీ కోడలు బతికున్నప్పుడు నా పుట్టిన రోజు జరిగింది ఇప్పుడు మళ్లీ అని చెప్తాడు. ఇక క్రిష్ తన బాబాయ్ కళ్లు మూసి బయటకు తీసుకెళ్తాడు. జయమ్మతో క్రిష్ వెనకుండగా నీ చిన్న కొడుకుకి ఏం కాదు అంటాడు. హ్యాపీ బర్త్‌ డే బాబాయ్ అని బయట కేక్ ఏర్పాట్లు చేసుంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: సత్యభామ సీరియల్: కంగారు పెట్టించి చక్రవర్తి నిజం ఒప్పుకునేలా చేసిన సత్య.. క్రిష్‌, చక్రిలను కలుపుతుందా!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Cabinet: టూరిజం పాలసీకి ఆమోదం - కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు, ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే!
టూరిజం పాలసీకి ఆమోదం - కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు, ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే!
Paritala Sunitha: మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి సోదరులు జాకీని వెళ్లగొట్టారు, తక్షణం చర్యలు చేపట్టాలి: పరిటాల సునీత
మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి సోదరులు జాకీని వెళ్లగొట్టారు, తక్షణం చర్యలు చేపట్టాలి: పరిటాల సునీత
Weather Update Today: ఏపీకి వాన గండం- తెలంగాణపై చలి పిడుగు - జిల్లాల వారీగా ఉష్ణోగ్రతలు ఇవే
ఏపీకి వాన గండం- తెలంగాణపై చలి పిడుగు - జిల్లాల వారీగా ఉష్ణోగ్రతలు ఇవే
Allu Arjun: భార్యతో బన్నీ సీక్రెట్ వాట్సాప్ చాట్ గ్రూప్- ఎందుకు, ఎప్పుడు ఉపయోగిస్తారో తెలుసా?
భార్యతో బన్నీ సీక్రెట్ వాట్సాప్ చాట్ గ్రూప్- ఎందుకు, ఎప్పుడు ఉపయోగిస్తారో తెలుసా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రామ్ చరణ్ దర్గా వివాదంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన ఉపాసనబాచుపల్లిలో కాలకూట విషంగా మారిన తాగు నీళ్లువాలంటీర్ జాబ్స్‌పై ఏపీ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలుఅరటిపండు రాకెట్ కూలిపోయింది, ట్రంప్ ముందు పరువు పోయిందిగా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet: టూరిజం పాలసీకి ఆమోదం - కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు, ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే!
టూరిజం పాలసీకి ఆమోదం - కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు, ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే!
Paritala Sunitha: మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి సోదరులు జాకీని వెళ్లగొట్టారు, తక్షణం చర్యలు చేపట్టాలి: పరిటాల సునీత
మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి సోదరులు జాకీని వెళ్లగొట్టారు, తక్షణం చర్యలు చేపట్టాలి: పరిటాల సునీత
Weather Update Today: ఏపీకి వాన గండం- తెలంగాణపై చలి పిడుగు - జిల్లాల వారీగా ఉష్ణోగ్రతలు ఇవే
ఏపీకి వాన గండం- తెలంగాణపై చలి పిడుగు - జిల్లాల వారీగా ఉష్ణోగ్రతలు ఇవే
Allu Arjun: భార్యతో బన్నీ సీక్రెట్ వాట్సాప్ చాట్ గ్రూప్- ఎందుకు, ఎప్పుడు ఉపయోగిస్తారో తెలుసా?
భార్యతో బన్నీ సీక్రెట్ వాట్సాప్ చాట్ గ్రూప్- ఎందుకు, ఎప్పుడు ఉపయోగిస్తారో తెలుసా?
Karthika Vanabhojanam 2024: కార్తీక సమారాధన అంటే క్యాటరింగ్ భోజనాలు కాదు..అసలైన వనభోజనాలంటే ఇవి!
కార్తీక సమారాధన అంటే క్యాటరింగ్ భోజనాలు కాదు..అసలైన వనభోజనాలంటే ఇవి!
Vizag Crime News: లా స్టూడెంట్‌పై గ్యాంగ్‌ రేప్‌ కేసులో లవర్ సహా నలుగురు నిందితుల అరెస్ట్‌
లా స్టూడెంట్‌పై గ్యాంగ్‌ రేప్‌ కేసులో లవర్ సహా నలుగురు నిందితుల అరెస్ట్‌
Viral News: దేవుడిలా వచ్చి సీపీఆర్ చేసి మహిళ ప్రాణాలు కాపాడిన పోలీస్ కానిస్టేబుల్స్
Viral News: దేవుడిలా వచ్చి సీపీఆర్ చేసి మహిళ ప్రాణాలు కాపాడిన పోలీస్ కానిస్టేబుల్స్
Telangana News: తెలంగాణలో తగ్గిన ఉష్ణోగ్రతలు - ప్రజలకు ఆరోగ్య శాఖ బిగ్ అలర్ట్
తెలంగాణలో తగ్గిన ఉష్ణోగ్రతలు - ప్రజలకు ఆరోగ్య శాఖ బిగ్ అలర్ట్
Embed widget