Karthika Deepam 2 Serial Today November 20th: కార్తీకదీపం 2 సీరియల్: దీపలో మార్పు.. భర్తని చూసి ముసిముసి నవ్వులు.. కళ్లు తిరిగి పడిపోయిన శౌర్య.. ఒట్టేసి నిజం చెప్పమన్న దీప!
Karthika Deepam 2 Serial Today Episode శౌర్య కళ్లుతిరిగి పడిపోవడం కార్తీక్ హడావుడి చేయడంతో పాపకి ఏమైందని దీప తన మీద ఒట్టువేసుకొని కార్తీక్‌కి నిజం అడగటంలో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode కార్తీక్ తాతతో గొడవ పెట్టుకుంటాడు. మా తాత ఎవరు అని ఎవరైనా అడిగితే ఏం చేయాలని కార్తీక్ అంటే మీ తాత చచ్చాడు అని చెప్పు అని సీరియస్ అయి శివనారాయణ జ్యోత్స్నని తీసుకొని వెళ్లిపోతాడు. ఇక శౌర్య వచ్చి ఏమైంది నాన్న అమ్మ ఏడుస్తుంది అంటే అమ్మ వంట చేసింది కదా కంట్లో కారం పడిందని అంటాడు. ఇక కార్తీక్ ఐస్‌క్రీమ్ తినిపిస్తానని శౌర్యని తీసుకెళ్లిపోతాడు. జ్యోత్స్న ఓ చోట కారు ఆపి తాత నీతో మాట్లాడాలి అంటుంది.
జ్యోత్స్న: తాత నీకు ఇప్పటికీ ఆ దీప గురించి తెలీడం లేదు. పని దాని స్థాయి నుంచి యజమాని స్థాయికి మన ముందే ఎదిగింది. అందరూ జీవితంలో గెలవడానికి ఎదగడానికి తెలివి వాడుతారు. దీప దాంతో పాటు తన మంచితనం అనే ముసుగు వాడింది. ఇక దాని అదృష్టం దాని కూతురు. మంచితనంతో అమ్మకి దగ్గరైతే దాని కూతురితో బావకి దగ్గరైంది. చివరకు ఇది ఎక్కడికి వచ్చి ఆగింది అంటే నువ్వు బావ మీద చేయి ఎత్తితే తన చేయి అడ్డు పెట్టేంత స్థాయికి ఎదిగింది. అంతే పొరపాటున నువ్వు బావని కొట్టుంటే దీప నిన్ను కొట్టేదా తాతయ్య. మన రెస్టారెంట్‌లో మన స్టాఫ్ ముందు మనకు ఇంత అవమానం జరిగితే మనం ఏం చేయలేమా. నాకు తెలిసి డాడీ నీకు ఎదురు తిరగరు. కనీసం ఎవరూ నిన్ను ఏం అనరు.
శివనారాయణ: ఎవరి పొగరు ఎలా దించాలో నీ వయసుకి తెలియకపోయినా నా అనుభవానికి తెలుసు ఇంటి కెళ్దాం పద.
జ్యోత్స్న: తాత ఏం చేయబోతున్నాడు. ఏం చేసినా బావకి దీపని దూరం చేయాలి.
కాంచన, అనసూయలు రెస్టారెంట్ నుంచి వెళ్లి వచ్చిన నుంచి ఏం మాట్లాడటం లేదని అనుకుంటారు. అసలేం జరిగిందో ఎలా తెలుస్తుందని కాంచన అంటుంది. ఇంతలో శౌర్య అక్కడికి వస్తే అనసూయ ఏమైందని అడుగుతుంది. దాంతో శౌర్య చదువుకోవాలని అంటుంది. దాంతో కాంచన చాక్లెట్స్ చూపించి రెస్టారెంట్‌లో ఏం జరిగింది అని అడుగుతుంది. ఏం జరగలేదని శౌర్య చెప్తుంది. ఇక శౌర్యకి కాంచన రెస్టారెంట్‌కి ఎవరు వచ్చారని అడుగుతుంది. దాంతో శౌర్య జ్యో, ముద్దుల తాత వచ్చారని చెప్తుంది. ఇక కాంచన దీప రావడంతో నాన్న రెస్టారెంట్‌కి వచ్చారా అని అడుగుతుంది. దాంతో దీప ఓనర్ కదమ్మా రాకుండా ఉంటారా అని అంటుంది. ఇక కాంచన కార్తీక్‌ని అడిగితే కార్తీక్ కూడా తప్పించుకొని వెళ్లిపోతాడు. దీప గదిలోకి వెళ్లి జరిగింది తలచుకొని బాధ పడుతుంది. ఇంతలో కార్తీక్ దీప దగ్గరకు వస్తాడు.
కార్తీక్: మా తాత చేతిని అడ్డుకోవడం నీది తప్పే కదా దీప. నేను మనవడికి కాబట్టి ఆయనకు కొట్టే హక్కు ఉంది. నువ్వు అడ్డుకోవడం నాకు నచ్చలేదు.
దీప: నా కారణంగా మీరు ఎందుకు దెబ్బలు తినాలి. అందుకే అడ్డు పడ్డాను. నా కారణంగా మిమల్ని ఎవరు ఏమన్నా నేను ఊరుకోను.
కార్తీక్: నువ్వు జ్యోత్స్నకి నేను నీ భర్త అని చెప్పింది నాకు బాగా నచ్చింది. తనని అలాగే అనుకోమన్నావ్ నేను కూడా అలాగే అనుకోవచ్చా.
దీప: అనుకోండి. ఆ మాట అయితే మాట వరసకు అనలేదు మనస్ఫూర్తిగానే అన్నాను.
కార్తీక్ మురిసిపోతూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దీప కూడా చిన్నగా నవ్వుకుంటుంది. కార్తీక్ సంతోషంగా రావడంతో కాంచన కార్తీక్‌ని పిలిచి దీప జ్యోత్స్నతో ఏమందని అడిగితే దానికి కార్తీక్ నా బావ ఇప్పుడు నీ మొగుడు అయిపోయాడు అనా మాట పడనివ్వడం లేదని అంటే జ్యోత్స్న అంటే దీప అదే అనుకోమని అంది అని అంటాడు కార్తీక్. కాంచన, అనసూయ చాలా సంతోషపడతారు. దీపలో మార్పు మొదలైందని ఇంకా వాళ్లని దగ్గర చేయాలని అనుకుంటారు. తాతగారిని అడ్డుకోవడం వల్ల ఆయన ఏమనుకుంటారు.. విషయం తెలిస్తే సుమిత్ర గారు ఏమనుకుంటారని దీప ఆలోచిస్తూ ఉంటుంది.
మరోవైపు శౌర్య బెలూన్‌తో ఆడుకుంటూ కళ్లు తిరిగి పడిపోతుంది. అక్కడే ఉన్న దీప పాపని చూసుకోదు. ఇక కార్తీక్ అటుగా వెళ్తూ పాపని చూసి పరుగున వెళ్తాడు. కార్తీక్ పిలుపుతో దీప పాపని చూసి కంగారు పడుతుంది. కార్తీక్ వెనకే ఉన్న పాపని చూసుకోలేదని దీపని కార్తీక్ తిడతాడు. మందులు వేయలేదు అని దీప చెప్పడంతో జాగ్రత్తగా చూసుకోమని చెప్పినా పట్టించుకోవా అని తిడతాడు. ఇక శౌర్యని లేపి మందులు వేసి పడుకోపెడతాడు. నా కూతురికి ఏమైంది అని దీప అడుగుతుంది.
మందులు వేసుకోకపోతే ఇలా అవ్వడం ఏంటి అని అడుగుతుంది. కార్తీక్ ఇలా ఎన్నాళ్లు శౌర్య కండీషన్ దాస్తాడో అని కాంచన అనుకుంటుంది. నాన్న ఉండగా నీకు ఏం కాదు హాయిగా పడుకో అని కార్తీక్ శౌర్యతో చెప్తాడు. దీప కార్తీక్‌తో నా కూతురికి ఏమైందని మళ్లీ అడుగుతుంది. దాంతో నీకు మాత్రమే కూతురా దీప అని అడుగుతాడు. మీరు కోరుకున్నట్లు నేను ఉండలేను అని దీప అంటే మనం అనుకోవడానికి నీకు మనసు రాకపోయినప్పుడు నేను ఎలా చెప్తానని అంటాడు. నా దగ్గర ఏదో దాస్తున్నారని దీప అంటే నాకు ఏంటి అవసరం అని కార్తీక్ అంటాడు. దాంతో దీప తన తల మీద కార్తీక్ చేయి పెట్టుకొని ఒట్టు వేసి చెప్పమని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: దీప, కార్తీక్‌లపై విరుచుకుపడ్డ శివనారాయణ.. కార్తీక్ కోసం తాతపై చేయెత్తిన దీప!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

