Karthika Deepam 2 Serial July 12th: కార్తీకదీపం 2 సీరియల్: గురువారమే కార్తీక్, జ్యోత్స్నల నిశ్చితార్థం.. పెద్ద కూతుర్ని పిలిచిన సుమిత్ర!
Karthika Deepam 2 Serial Episode దీప ప్రసాదం చేయడానికి గుడికి వెళ్లడం అక్కడ దీపని సుమిత్ర చూసి ప్రశ్నించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Karthika Deepam Idi Nava Vasantham Serial Episode శౌర్య గోడ మీద కార్తీక్ అని రాసుకుంటుంది. అది చెరిపేయాలని దీప వస్తే వద్దని శౌర్య బుంగమూతి పెట్టుకుంటుంది. ఇక గోడ మీద పేరు దీప చెరిపేస్తుంది. దాంతో శౌర్య చేతి మీద కార్తీక్ అని రాసుకుంటుంది. అది దీపకు చూపించి కార్తీక్ నాతోనే ఉన్నాడని అంటుంది. ఇంటి ఓనర్ వచ్చి రేపు గుడిలో అన్నదానం ఉందని 50 మందికి ప్రసాదం చేయమని అంటాడు. దీప సరే అంటుంది. కార్తీక్ ఉదయం జ్యోత్స్న వాళ్ల ఇంటికి వస్తాడు.
కార్తీక్: మనసులో.. ఎవరో బాధ పడతారు అని ఆగిపోతే చివరకు నా మెడకే బిగుసుకుపోయేలా ఉంది. ముహూర్తాల వరకు వెళ్లనివ్వకుండా జ్యోత్స్నను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు అని చెప్పేస్తా.
శివనారాయణ: మనవడా ఇంక నీకు నచ్చినట్లు తిరిగే రోజులు పోయినట్లే. ఎందుకంటే పెళ్లి అయితే మగాడి ఫ్రీడమ్ పోయినట్లే కదరా.
కార్తీక్: మీ ఇద్దరే ఉన్నారు మిగతా వాళ్లు ఏరి.
శివనారాయణ: నీకు జ్యోత్స్నకి నిశ్చితార్థం ముహూర్తం పెట్టించడానికి మీ అత్త, మామయ్య జ్యోత్స్నని తీసుకొని గుడికి వెళ్లారు. కుదిరితే నువ్వు వెళ్లు మీ అత్తయ్య సంతోషిస్తుంది.
పారిజాతం: ఏం మనవడా చాలా సంతోషంగా ఉందా. పట్టలేని ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయిపోతావ్ కదూ.
కార్తీక్: తప్పు చేస్తున్నావ్ పారు అన్నీ తెలిసి కూడా ఇవన్నీ దగ్గరుండి చేస్తూ చాలా పెద్ద తప్పు చేస్తున్నావ్.
పారిజాతం: నువ్వేమనుకున్నా పర్లేదు మనవడా నీ చేతిలో నా మనవరాలి మెడలో మూడు ముళ్లు వేయించడం ఖాయం.
కార్తీక్: పగటి కలలు కనకు పారు. నేను ఇప్పుడే వెళ్లి మామయ్యతో ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు అని చెప్పేస్తా.
పారిజాతం: మీ అమ్మానాన్న ఒప్పుకున్నారు.
కార్తీక్: తాళి కట్టేది నేను.
పారిజాతం: కానీ మాట తీసుకుంది మీ అమ్మ. అన్నయ్య కూతుర్ని ఇంటి కోడల్ని చేసుకోవాలి అనే ఒకే ఒక్క ఆశతో మీ అమ్మ బతుకుతుంది. నువ్వు ఈ పెళ్లి చేసుకోను అంటే మొదట బాధ పడేది మీ అమ్మే. పోనీ నా మనవరాలు ఊరుకుంటుందా బావ నా మెడలో తాళి కట్టకపోతే విషం తాగి చస్తా అంటుంది. అప్పుడు ఇళ్లు రెండు అయినా ఒక్కటిగా ఉంటున్న ఈ కుటుంబం రెండు ముక్కలు అయిపోతుంది. ఈ నిశ్చితార్థం నువ్వు ఆపలేవు.
దీప ప్రసాదం చేయడాని శౌర్యని తీసుకొని గుడికి వెళ్తుంది. మధ్యలో ఓ పాప రాయిని తన్నేసి కాళ్లకి గాయం అయితే తన తండ్రి ఆమెను ప్రేమగా దగ్గరకు తీసుకొని కట్టు కడతాడు. అది చూసిన శౌర్య దీపతో అమ్మ కార్తీక్ ఎప్పుడొస్తాడని అడుగుతుంది. దాంతో దీప షాక్ అయిపోతుంది. కార్తీకే తన తండ్రి అని శౌర్య అనుకుంటుందేమో అని దీప అనుకుంటుంది. మరోవైపు కార్తీక్, జ్యోత్స్నల తల్లిదండ్రులు పంతులుగారితో ముహూర్తాలతో మాట్లాడుకుంటారు. అందరూ కార్తీక్, జ్యోత్స్నలకు పుట్టబోయే పిల్లల గురించి మాట్లాడుకుంటారు. ఇక గురువారం మంచి ముహూర్తం ఉందని పంతులు గారు అంటారు. ఆ ముహూర్తమే ఖాయం చేయమని అంటారు. ఇక సుమత్రి ప్రసాదం పంచడానికి వెళ్తుంది. దీప కూడా ప్రసాదం చేయడానికి వెళ్తుంది. దీప సుమత్రని చూస్తుంది. ఫ్యామిలీ మొత్తం గుడికి వచ్చిందని శౌర్య చూస్తే ఎలా అనుకునేలోపు శౌర్య చూసేస్తుంది. దీప శౌర్యని తన దగ్గరకు వెళ్లొద్దని అంటుంది. ఇక దీప దాక్కుంటుంది. ఇంతలో సుమిత్ర దీప దగ్గరకు వస్తుంది.
సుమిత్ర: దీప దొరికిపోతావని అనుకోలేదు కదా. నీ కూతుర్ని అక్కడ కూర్చొపెట్టి ఇటు వస్తున్నప్పుడే నేను నిన్ను చూశాను దీప. నన్ను చూసి దాక్కునే నువ్వు పిలిస్తే పలకవు అని ఇలా వచ్చా. అసలేం జరుగుతుంది దీప. పాపకి బాలేదు హాస్పిటల్‌లో చేర్పించావ్ అది చెప్పలేదు ఇష్టం లేదు అనుకున్నాం. కానీ అర్థరాత్రి ఎవరికీ చెప్పకుండా ఇళ్లు ఎందుకు ఖాళీ చేశావు. ఏం జరిగింది. ఇది కూడా నేనే తెలుసుకోవాలా.
దీప: ఎవరింట్లోనో ఎంత కాలం అని ఉంటాను. ఎప్పటి నుంచి వెళ్లిపోతా అంటున్నా కదా అది ఇప్పుడు జరిగింది.
సుమిత్ర: గుడిలో ఉండి ఎంత బాగా అబద్దం చెప్తున్నావ్ దీప. నువ్వన్నదే నిజం అయితే నువ్వు ఎవరితో చెప్పినా చెప్పకపోయినా వెళ్లే ముందు నాతో చెప్తావ్. ఇప్పుడు గుడిలో చూస్తే దాక్కోవు. వచ్చి పలకరించేదానివి. ఏం జరిగిందో చెప్పవే.
దీప: మనసులో.. దీనింతటికి కారణం మీ మేనల్లుడే అమ్మ. అది మీకు ఎలా చెప్పను.
సుమిత్ర: నీ సమస్యలు ఏమైనా కావొచ్చు నువ్వు నాతో అవి చెప్పకపోవచ్చు. కానీ నీ తల్లిలా చెప్తున్నా నా మనవరాలిని తీసుకొని మన ఇంటికి వచ్చేయ్.
దీప: నేను రాలేనమ్మా.
సుమిత్ర: ఎందుకు రాలేవు. సరే కారణం చెప్పవని నాకు అర్థమైంది కానీ నువ్వు ఇంటికి రావాలి దీప. ఎందుకంటే కార్తీక్, దీపలకు పెళ్లి చేయాలి అనుకుంటున్నాం. నువ్వు శౌర్య మా ఇంట్లో శుభకార్యానికి లేకపోతే ఏదోలా ఉంటుంది. నా చిన్న కూతురి నిశ్చితార్థంలో పెద్ద కూతురు లేకపోతే ఎలా చెప్పు.
దీప: నేను రాలేనమ్మా. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: 'త్రినయని' సీరియల్: సుమనకు ఆస్తి రాసిచ్చిన తిలోత్తమ.. ఏం ట్విస్ట్ ఇవ్వబోతుందో!