అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Trinayani Serial Today July 12th: 'త్రినయని' సీరియల్: సుమనకు ఆస్తి రాసిచ్చిన తిలోత్తమ.. ఏం ట్విస్ట్ ఇవ్వబోతుందో!

Trinayani Serial Today Episode ఉలూచి కాళ్లు కాల్చేసినందుకు సుమన తిలోత్తమకు ఆస్తి రాసివ్వమనడం తిలోత్తమ రాసివ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Trinayani Today Episode తిలోత్తమ సర్పదీవి నుంచి వచ్చిన తర్వాత గంటలమ్మ దగ్గర తాంత్రిక విద్య నేర్చుకోవడానికి తన చేతిని, తనతో పాటు వచ్చిన పాములా ఉన్న ఉలూచి తోకను కాల్చేస్తుంది. ఆ విషయం హర్ష ద్వారా నయని తెలుసుకొని తిలోత్తమ ఒంటరిగా ఉన్నప్పుడు నిలదీస్తుంది. ఇక సుమన ఉలూచికి తిలోత్తమ వల్లే కాళ్లకు దెబ్బ తగిలింది అన్న నెపంతో తిలోత్తమ దగ్గర నుంచి ఆస్తి కొట్టేయాలని పేపర్లు రెడీగా ఉంచుకుంటుంది. తన తల్లి ఆస్తి ఇస్తే గుండు చేసుకుంటానని విక్రాంత్ సుమనతో ఛాలెంజ్ చేస్తాడు. ఇక ఉదయం అందరూ హాల్‌లో ఉంటారు. గురువుగారు ఇంటికి వస్తారు. 

విశాల్: అనుకోకుండా వచ్చి మమల్ని సంతోష పడేలా చేశారు స్వామి.
గురువుగారు: అనుకోకుండా రాలేదు విశాలా. మీ మరదలు కబురు పంపింది.
సుమన: అవును స్వామి వారు వస్తే తప్ప ఈ సమస్య పరిష్కారం అవ్వదని అనిపించింది. ఆస్తి ఇప్పించాలి అని స్వామి వారిని ఇంటికి రప్పించాను.
గురువుగారు: సుమన మీ కుటుంబ విషయాల్లో నా జోక్యం ఎందుకు.
విశాల్: సుమన డబ్బు, ఆస్తి ఇలాంటి విషయాల్లో ఆయన్ను ఇబ్బంది పెట్టడం సరికాదు.
సుమన: నా కూతురు పాదాలు కాలడానికి కారణం అయిన తిలోత్తమ అత్తయ్య ఆస్తిలో నాకు పావలా వాటా కావాలి అంటే ఎవరూ నాకు సపోర్ట్‌గా మాట్లాడలేదు.
తిలోత్తమ: సుమన సమయం వచ్చినప్పుడు నీకు సాయం చేస్తా అన్నాను కదా.
విక్రాంత్: ఆస్తి మొత్తం వస్తుందంటే పిల్ల బలి అయిపోయిన పర్వాలేదు అనుకుంటా.
నయని: అందరూ శాంతంగా ఉండండి. సుమన పరిహారం అడగటం అత్తయ్య ఇస్తాను అనడం అది వాళ్ల ఇద్దరి మధ్య ఉండే అవగాహన. దానికి ఎవరూ సపోర్ట్ చేయరు. అడ్డుకోరు.  సుమన: మీరు ఎవరూ నాకు సపోర్ట్ చేయరు అనే ఎలాంటి కోరికలు ఆశలు లేని స్వామి వారిని పిలిచి న్యాయం చేయమని పిలిపించానక్క.
గురువుగారు: తిలోత్తమ సుమన అడిగినదాంట్లో స్వార్థం ఉన్నా సరే దానికి అర్థం ఉంది ఏమంటావ్.
తిలోత్తమ: మీరు మధ్యవర్తిత్వం వహిస్తే నేను అభ్యంతరం ఎలా చెప్పగలను స్వామి. కానీ ఓ చిన్న విన్నపం. సుమన రాసుకొచ్చిన డాక్యుమెంట్స్‌లో తిరకాసు ఉండొచ్చు. అందుకే మేం రాయిస్తాం.
గురువుగారు: తిలోత్తమ ఆలోచిన వేరుగా ఉంటుంది. 
పావనా: అంటే సుమన అడిగిన అంత ఇవ్వదా అక్క.
వల్లభ: ఎంత అడిగితే అంత ఇస్తే రేపు ఇంకొకరు బ్లాక్‌మెయిల్ చేస్తారు. 

తిలోత్తమ వల్లభకు పెన్ను పేపర్ తీసుకొచ్చి రాయమని చెప్తుంది. దాంతో వల్లభ తనకు చదువురాదు అని దిక్కులు చూస్తాడు. ఇక విక్రాంత్ రాయను అనేస్తాడు. విశాల్‌ని రాయొద్దని నయని అనేస్తుంది. హాసిని కూడా రాయను అనేస్తుంది. చివరకు దురంధర రాయడానికి సిద్ధం అవుతుంది. 
గురువుగారు: మనసులో.. తిలోత్తమ జరగబోయే పరిణామాలకు దురంధరని ఇరికించాలి అని నువ్వు పన్నాగం పన్నావ్. తను రాయడం ఒక ఎత్తు అయితే అమ్మవారి రాత మరో ఎత్తు. 
తిలోత్తమ: తిలోత్తమ అనే నేను గడిచిన కొద్ది రోజుల్లో సంపాదించిన 280 కోట్లలో పావాలా వంతు అంటే 70 కోట్లు విలువ గల ఆస్తిని నా చిన్న కోడలు ముక్కంటి పురం సుమనకు రాస్తున్నాను. అంటూ దురంధర తిలోత్తమ తెచ్చిన పేపర్ మీద రాస్తుంది. ఇక తిలోత్తమకు సంతకం పెట్టమని దురంధర పేపర్ ఇచ్చేస్తుంది. తిలోత్తమ సంతకం పెడుతుంది. డాక్యూమెంట్స్ జాగ్రత్త పోగొట్టుకొని మళ్లీ రాయమని చెప్తే మాత్రం రాయను అని తిలోత్తమ అంటుంది.
వల్లభ: హలో అది మిస్ అయితే ఆస్తిలో వాటా పోయినట్లే జాగ్రత్త.
పావనా: ఆ పేపర్లను ఉలూచి కంటే జాగ్రత్తగా చూసుకుంటుంది.
గురువుగారు: తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుంది. 

తిలోత్తమ ఆరు బయట కూర్చొని ఉంటే వల్లభ అక్కడికి వస్తాడు. 70 కోట్లు పోయాయని బాధ పడుతున్నావా అని అడుగుతాడు. సుమనకు వాటా ఇవ్వకపోతే ఉలూచి కాళ్లు ఎందుకు కాలిపోయాయని ఆరా తీసి తన గుట్టు రట్టు చేస్తుందని అంటుంది. అయితే సుమనకు ఆస్తి ఇచ్చినప్పుడు ట్విస్ట్ ఇచ్చానని పేపర్లు పోతే మళ్లీ ఆస్తి ఇవ్వనన్నానని ఆ పేపర్ పోతే అని తిలోత్తమ అంటుంది దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: లక్కీ మిత్ర కూతురని తెలుసుకున్న లక్ష్మీ.. ఇంట్లోకి వచ్చింది లక్ష్మీనే అని చెప్పిన మనీషా!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
KA Movie OTT Release Date: కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

మహారాష్ట్రలో బీజేపీ సత్తా! ఏ మ్యాజిక్ పని చేసింది?కుప్పకూలిన ఆసిస్ అదరగొట్టిన భారత బౌలర్లు!ఎలక్ట్రిక్ వెహికిల్స్ పేలిపోకూడదంటే.. జాగ్రత్తలు ఇవే!Memers Celebrating Team India Bowlers | Aus vs Ind First Test లో బౌలర్ల దెబ్బ అదుర్స్ కదూ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
KA Movie OTT Release Date: కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
TGPSC Group-1 Results: 'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
IND vs AUS 1st Test Highlights: 20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్, ఆసీస్‌లో మొదలైన కంగారు
20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్ భాగస్వామ్యం, ఆసీస్‌లో మొదలైన కంగారు
Road Accident: అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురి మృతితో తీవ్ర విషాదం
అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురి మృతితో తీవ్ర విషాదం
Jayamangala Venkataramana : వైసీపీకి మరో షాక్ - పార్టీకి, పదవికి ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామా !
వైసీపీకి మరో షాక్ - పార్టీకి, పదవికి ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామా !
Embed widget