Karthika Deepam 2 Serial Today January 4th: కార్తీకదీపం 2 సీరియల్: కార్తీక్, దీపల్ని నడిరోడ్డు మీదే అవమానించిన పారు.. సుమిత్రతో దాసు నిజం చెప్పేశాడా!
Karthika Deepam 2 Serial Today Episode సుమిత్ర దాసుతో దీప కార్తీక్‌లను చూడాలని ఉందని తీసుకెళ్లమని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode దీప, కార్తీక్‌లు కూరగాయలు తీసుకొని రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే పారిజాతం చూసి రోడ్డు మీద చూస్తుంది. దీపది దరిద్రపు జాతకం అని పుట్టగానే తల్లిని మింగేసింది తర్వాత తండ్రిని తనని పెళ్లి చేసుకొని నువ్వు మహారాజా జీవితం నుంచి బికారి జీవితం అనుభవిస్తున్నావని కార్తీక్‌ని వెటకారం చేస్తుంది.
పారిజాతం: దీప హైదరాబాద్‌లో అడుగుపెట్టింది ఆ నర్శింహ గాడి జీవితం మటాష్.. కొడితే జైలు కెళ్లి పడ్డాడు. వాడి బతుకుతో పాటు రెండో పెళ్లాం బతుకు సర్వనాశనం. నువ్వు తాళి కట్టావ్ నీ జీవితం రోడ్డు మీదకు లాగేసింది.
కార్తీక్: తను నన్ను తీసుకురావడం కాదు నేను తనని రోడ్డుకు లాగాను. నేను పెళ్లి చేసుకోకపోయి ఉంటే కడియం బాబాయ్ హోటల్‌లో పని చేసుకుంటూ కూతురిని మంచిగా చదివించుకునేది. కానీ నేను దీప జీవితాన్ని ఉద్దరించాలి అని పెళ్లి చేసుకొని బయటకు లాగేశా.
పారిజాతం: నీ మరదలితో పెళ్లి చెడిపోవడానికి ఈ దరిద్రపుదే కారణం కాదా.
కార్తీక్: ఆ మాటకు వస్తే ఇదంతా జరగడానికి కారణం నువ్వే. అసలైన దరిద్రానివి నువ్వే.
పారిజాతం: కార్తీక్.
కార్తీక్: జ్యోత్స్నని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదని నేను చెప్పాను. కానీ నువ్వే దాన్ని పెళ్లి వరకు తీసుకొచ్చావ్. మా ఇద్దరికీ రాసి పెట్టి ఉంది అందుకే సంబంధం లేని మనషులుగా కలిశాం. కలిసే ఉన్నాం దీప దరిద్రం కాదు నా అదృష్టం. జరిగిన తప్పులకు తనకు ఏం సంబంధం లేదు.
పారిజాతం: నువ్వు నీ పెళ్లాం గురించి నచ్చినట్లు అనుకో కానీ జనాలు అలా అనుకోరురా. నా దగ్గరకు వచ్చి నాకు సంబంధం లేకుండా కార్తీక్ బాబు నన్ను పెళ్లి చేసుకున్నాడని చెప్పింది. జ్యోత్స్న దగ్గరకు వెళ్లి నా భర్త జోలికి వస్తే చంపేస్తా అంటోంది. నా తల్లి దగ్గర ఒక మాట తండ్రి దగ్గర ఒక మాట. నీ దగ్గర ఎన్ని మాటలు మాట్లాడుతుందో ఎలా నడుచుకుంటుందో నీకు తెలియాలి. దీప మాత్రం నీ జీవితానికి విలనేరా.
కార్తీక్: నా జీవితానికి దీప విలన్ కాదు కథానాయిక ఇది నీకు ఇప్పుడు కాదు నేను గెలిచిన తర్వాత తెలుస్తుంది.
దాసుతో కొడుకు కోడలు మాట్లాడుతారు. ఈ మధ్య చాలా డల్‌గా ఉన్నారు ఏమైందని అడుగుతారు. ఎవరి కోసమో వెతుకుతున్నారు అది ఏమైందని అడుగుతారు. దాంతో దాసు ఆ మనిషి ఎప్పటికీ దొరకడని చెప్తాడు. నిజం దొరికింది కానీ తన నోటితో చెప్పలేనని అంటాడు. ఇక జ్యోత్స్న తాత, తండ్రితో బిజినెస్ డల్ అయిందని చెప్తుంది. సీఈవోగా లాభాలు పెంచడానికి కాంపెనీకి ఏది మంచిది అనిపిస్తే అది చేయ్ అని శివన్నారాయణ కంపెనీ బాధ్యత మొత్తం జ్యోత్స్నకి ఇస్తాడు. దశరథ్ ఇలా చేయడం కష్టం అని అంటే దానికి శివన్నారాయన ఒక్క సంవత్సరం లాభాలు రాకపోతే ఏం కాదు అని కానీ బాధ్యత మొత్తం జ్యోత్స్న మీద పెడితే తాను కార్తీక్‌ని మర్చిపోవడమే కాకుండా బిజినెస్ కూడా చూసుకుంటుందని అంటాడు.
ఇక కార్తీక్, దీపలు సరుకులతో ఇంటికి వస్తారు. శౌర్య స్కూల్‌కి తీసుకెళ్లమని చెప్తుంది. ఇంత లైట్ అయిందేంటని కాంచన అడిగితే తెలిసిన వాళ్లు కలిశారని చెప్తుంది. ఇక కార్తీక్ పాపని స్కూల్‌కి తీసుకెళ్తాడు. ఇక కార్తీక్ ఓ వ్యక్తి దగ్గర సైకిల్ తీసుకొని దాని మీద పాపని తీసుకెళ్తాడు. కార్తీక్ పరిస్థితికి దీప, కాంచన బాధ పడతాడు. సుమిత్ర గుడికి బయల్దేరుతుంది. నేను వస్తానని పారిజాతం చెప్తుంది. భర్త, కోడలితో కార్తీక్ నడిచిరోడ్డు మీద కూరగాయలు తీసుకొని వెళ్తాడు. ఇంతలో దాసు దీప గురించి సుమిత్రతో మాట్లాడటానికి వస్తాడు. ఇంతలో జ్యోత్స్న ఎదురు పడుతుంది. జ్యోత్స్న, దాసు మాట్లాడుతూ ఉంటే సుమిత్ర అటువైపు వస్తుంది. దీప గురించి మర్చిపోతే నేను బతుకుతా అని అంటుంది. ఇక్కడి నుంచి వెళ్లిపో అని జ్యోత్స్న అంటే అంతలో సుమిత్ర వచ్చి వెళ్లిపోవాలి ఎందుకు తను నీకు బాబాయ్ అలా అనొద్దని అంటుంది. దాంతో తాతయ్య ఉన్నాడని బాబాయ్‌ని వెళ్లిపోమని చెప్తున్నా అంటుంది. జ్యోత్స్నలో మార్పు ఉందని సుమత్రి చాలా ఆనందిస్తుంది. సుమిత్ర దాసుతో కార్తీక్, దీపల విషయంలో జ్యోత్స్న చేసిన దానికి కోపంగా ఉందని కానీ కూతురు కదా అని అంటుంది. ఇక సుమిత్ర దాసుతో తనకు కార్తీక్ వాళ్లని చూడాలని ఉందని వాళ్ల దగ్గరకు తీసుకెళ్తావా అంటుంది. దాసు సంతోషంగా వెళ్దాం పదండి వదిన అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: అమ్మాయి గారు సీరియల్: క్షమించమని రాజుని అడిగిన రూప.. కఠినంగా మారిపోయిన రాజు.. మందారానికి ఆబ్దికం!