Karthika Deepam 2 Serial Today April 12th: కార్తీకదీపం 2 సీరియల్: దీప అరెస్ట్.. ప్రాణాపాయంతో దశరథ్.. మేనమామ, భార్యల్లో కార్తీక్ సపోర్ట్ ఎవరికి?
Karthika Deepam Serial Today Episode దీప చేతిలో గన్ చూశానని కార్తీక్ పోలీస్ స్టేషన్‌లో చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode దీప గన్‌తో దశరథ్‌ని కాల్చేస్తుంది. ఇంటిళ్లపాది షాక్ అయి కుప్పకూలిపోయిన దశరథ్‌ని పట్టుకొని ఏడుస్తారు. కార్తీక్ దీప కాల్చడం చూసి షాక్ అయిపోతాడు. కార్తీక్ లోపలికి రాగానే జ్యోత్స్న ఏడుస్తూ బావ దీప మా డాడీని షూట్ చేసింది అని చెప్తుంది. కార్తీక్ దీప ముఖం చూస్తూ దీప అని అరుస్తాడు.
కార్తీక్ దశరథ్‌ని పట్టుకుంటే పెద్దాయన వద్దు అని నా ఇంటికి చావుని పంపావని ఏడుస్తాడు. దీప కూడా దశరథ్ దగ్గరకు వస్తే సుమిత్ర వద్దని తోసేస్తుంది. ఇక పోలీసులు రావడంతో దీపని అరెస్ట్ చేయమని చెప్తారు. పోలీసుల సాయంతో దశరథ్‌ని హాస్పిటల్‌కి తీసుకెళ్తారు. దీపని పోలీసులు అరెస్ట్ చేస్తారు. కార్తీక్ దీప వెనక పరుగులు తీస్తాడు. పోలీసులు దీపని తీసుకెళ్లిపోవడంతో సైకిల్‌తో వెనక వెళ్తాడు.
స్వప్న కూరగాయలు కట్ చేస్తుంటే వేలు తెగుతుంది. కాశీ హడావుడి చేస్తాడు. శార్యని తీసుకురమ్మని చెప్తుంది. శౌర్యని తీసుకొచ్చి ఆడుకోవాలని సరదాగా కార్తీక్, దీప గురించి మాట్లాడుతారు. ఇంతలో శౌర్య ఇంటికి ఆడుకుంటూ వస్తుంది. వచ్చి చూసే సరికి కాంచన వీల్ చైర్ నుంచి కింద పడిపోయింటుంది. శౌర్య పెద్దగా అరుస్తుంది. ఇంతలో అనసూయ చూసి కాంచనను లేపి నీరు ఇచ్చి ఏమైందని అడిగితే కళ్లు తిరిగాయని అంటుంది.. ఇక శౌర్యని బట్టలు మార్చుకోమని చెప్తారు. అమ్మానాన్నని పిలుద్దామంటే వాళ్లు పని మీద వెళ్లారు వద్దని అంటారు.
దీపని జైలుకి తీసుకెళ్లి సెల్‌లో పెడతారు. దీప తాను కాల్చలేదని దశరథ్‌ని తాను చంపాలి అనుకోలేదని అంటుంది. దొరికిపోయి కూడా అబద్ధాలు చెప్తున్నావ్ మేం నీ సంగతి చెప్తాం అని పోలీసులు అంటారు. ఎఫ్‌ఐఆర్ రాయమని చెప్తారు. ఇంతలో కార్తీక్ అక్కడికి వస్తాడు. కార్తీక్‌తో నేను కాల్చలేదు నేను చంపడానికి వెళ్లలేదు జ్యోత్స్నతో మాట్లాడటానికి వెళ్లాను అని చెప్తుంది. పోలీస్ దీప ఆస్తి కోసం చంపావా అని అడుగుతారు. ఇక కార్తీక్ మీకు తెలుసా అని అరుస్తాడు. దానికి పోలీస్ నువ్వు చూశావా అని అడుగుతాడు. కార్తీక్ నోరెత్తడు. దశరథ్ మా మామయ్య మాకు గొడవలు లేవు అని కార్తీక్ చెప్తాడు. కార్తీక్ ఎస్‌ఐతో గొడవ పెట్టుకుంటాడు. నువ్వు చూశావా అరెస్ట్ చేశావ్ అని పోలీసుని ప్రశ్నిస్తాడు. లైవ్‌లో దొరికిపోయి కూడా ఈ మాటలేంటి అని ఎస్‌ఐ అంటారు. వాళ్ల ఇంటి నుంచి కంప్లైంట్ వచ్చింది అరెస్ట్ చేశాం. ఎఫ్‌ఐఆర్ నమోదు చేశాం దీపని కోర్టుకి తీసుకెళ్తాం అని చెప్తాడు. మిగతావి అంతా కోర్టే చూసుకుంటుందని పోలీస్ చెప్తాడు.
కార్తీక్ ఏం మాట్లాటకుండా సైలెంట్ అయిపోతాడు. నిన్ను ఏమనాలో నాకు అర్థం కావడం లేదు దీప ఆవేశంగా వెళ్లిపోయావ్ నాకు కనీసం చెప్పలేదు అని అంటాడు. నాకు చెప్పుంటే ఇంత వరకు వచ్చేది కాదని జరిగింది చూస్తే మాట్లాడటానికి వెళ్లినట్లు లేదని నువ్వు చంపడానికే వెళ్లినట్లుందని కార్తీక్ అంటాడు. మామయ్యకి ఎలా ఉందో అని కార్తీక్ టెన్షన్ పడతాడు. దాంతో దీప హాస్పిటల్‌కి వెళ్లమని అంటుంది. శౌర్యకి చెప్పొద్దని దీప అంటుంది. కార్తీక్ పోలీస్ స్టేషన్ నుంచి వెళ్లిపోతాడు. తన చేతులకు అంటిన రక్తం చూసి దీప కాల్చడం గుర్తు చేసుకొని ఏడుస్తుంది. దశరథ్‌కి అపరేషన్ జరుగుతుంది. అందరూ ఏడుస్తుంటారు. పారు, జ్యోత్స్న ఏడుస్తూ సుమిత్రను ఓదార్చడానికి ప్రయత్నిస్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: అమ్మాయి గారు సీరియల్: "అత్యాచారయత్నం కేసులో సీఎం అరెస్ట్.. పదవికి రాజీనామా"!





















