Nirupam Paritala: ఉగాదికి 'కార్తీక దీపం' ఫేమ్ నిరుపమ్ పరిటాల పెళ్లి సందడి
Nirupam Paritala Manjula marriage: 'కార్తీక దీపం' సీరియల్ హీరో నిరుపమ్ పరిటాల ఉన్నారు కదా, ఉగాదికి ఆయన పెళ్లి! అదేంటి? ఆల్రెడీ అయ్యిందిగా అంటున్నారా? అయితే... అసలు విషయం చదవండి.
'కార్తీక దీపం' సీరియల్ ఫేమ్, బుల్లితెర సూపర్ స్టార్ నిరుపమ్ పరిటాల ఉన్నారు కదా! ఆయన గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఉగాదికి ఆయన పెళ్లి. నిరుపమ్ పెళ్లి సందడి పండక్కి ప్రత్యేక ఆకర్షణ కానుంది. అదేంటి? ఆల్రెడీ ఆయనకు పెళ్లి అయిందిగా అంటున్నారా? అయితే... అసలు విషయంలోకి వెళ్లాల్సిందే.
ప్రతి పండక్కి టీవీ ఛానళ్ల వాళ్ళు స్పెషల్ ఈవెంట్స్ చేస్తూ ఉంటారు. అందరికీ ఈ విషయం తెలుసు. ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేయడానికి రకరకాల స్కిట్స్ చేస్తూ ఉంటారు. గతంలో ఒకసారి సుధీర్ - రష్మీకి పెళ్లి చేశారు. ఇప్పుడు అలా నిరుపమ్ పరిటాలకు పెళ్లి చేస్తోంది మల్లెమాల టీమ్. ఆయన రియల్ వైఫ్ మంజులను ఉగాది స్పెషల్ ఈవెంట్‌కు తీసుకొచ్చింది. నిరుపమ్, మంజులకు పెళ్లి చేసింది. బుల్లితెర వీక్షకుల్లో నిరుపమ్‌కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందువల్ల, ఉగాదికి వీళ్ళిద్దరి పెళ్లి సందడి హైలైట్ కానుంది.
Also Read: Karthika Deepam మార్చి 16 ఎపిసోడ్: మళ్లీ చిక్ మంగుళూరుకి హిమ, అక్కడే ఆనంద్ ని కలవబోతుందా
'అంగరంగ వైభవంగా' పేరుతో ఈటీవీ కోసం మల్లెమాల సంస్థ చేసిన ఉగాది ఈవెంట్‌లో రాజశేఖర్, జీవిత దంపతులు, సుమ కనకాల, రష్మీ గౌతమ్, ఈషా చావ్లా తదితరులు సందడి చేశారు. రోజా, జీవిత స్కిట్ చేయడం... అందులో రోజాకు జీవిత కౌంటర్ ఇవ్వడం బావున్నాయి. ఏప్రిల్ 2న ఈ ఈవెంట్ టెలికాస్ట్ కానుంది.
Also Read: మోనిత, ఆనంద్ ఎవరో హిమకి తెలిసిపోయింది, సీరియల్ ఇప్పటి వరకూ ఓ లెక్క ఇకపై మరోలెక్క
View this post on Instagram