Kalavari Kodalu Kanaka Mahalakshmi September 18th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: ఇళ్లు దాటితే చచ్చినంత ఒట్టుని లక్ష్మీతో చెప్పిన యమున
Kalavari Kodalu Kanaka Mahalakshmi Today Episode కనకాన్ని రౌడీల నుంచి కాపాడి మరోసారి యమున తనని ఇంటికి తీసుకురావడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode కనక మహాలక్ష్మీ కోసం విహారి, అతని తల్లి వెతుకుతారు. మరోవైపు ఓ వ్యక్తి కనకం వెనక పడితే కనకం బ్యాగ్‌తో ఆయన్ను కొట్టి పారిపోతుంది. ఇక కనకం ఓ చోట కూర్చొని వెళ్తుంటే అటుగా వెళ్తున్న విహారి ఫ్రెండ్ సత్య కనకాన్ని చూస్తాడు. యూటర్న తీసుకొని లక్ష్మీ దగ్గరకు వెళ్లే సరికి కనకం కనిపించడదు. దాంతో అతను విహారికి ఫోన్ చేసి కనకాన్ని చూశానని చెప్తాడు. దాంతో విహారి రోడ్డు మీద పరుగులు తీస్తాడు.
ఏరోజు అయినా కనకం కనిపిస్తుందని ఈరోజు కనిపిస్తే బాగున్నని అనుకుంటాడు. అతని ఫ్రెండ్ దగ్గరకు వెళ్లాడు. ఫోన్‌లో ఫొటోతో కనిపించిన ప్రతీ ఒక్కరికీ అడుగుతారు. ఇంతలో ఓ వ్యక్తి ఆటోలో వెళ్తుందని చెప్తాడు. విహారి కారులో వెళ్తాడు. ఇక కనకం ఆటోలో వెళ్తుండగా ఆటో డ్రైవర్ కనకంతో తేడాగా మాట్లాడుతాడు. కనకం దిగిపోతాని అంటే ఒప్పుకోడు. దాంతో కనకం ఆ వ్యక్తి చేయి కొరికేసి పరుగులు తీస్తుంది. దాంతో యమునను ఢీ కొట్టేస్తుంది. యమున లక్ష్మీని ఏడుస్తుంది.
యమున కనకంతో నా మనసు బాధ పడేంత తప్పు చేశావ్ లక్ష్మీ నాతో ఒక్క మాట చెప్పలేదు అని చెప్పుకుండా వెళ్లిపోవాలని అనుకున్నావ్ అని అడుగుతుంది. విహారి కనకం మిస్ అయిపోయినందుకు టెన్షన్ పడుతుంది. బయట ప్రపంచం చాలా తేడాగా ఉందని ఇకపై తనని వదిలేసి చెప్పకుండా వెళ్లిపోతే తాను చనిపోయినంత ఒట్టు అని తల మీద ఒట్టు పెట్టుకుంటుంది యమున. దాంతో కనకం షాక్ అయిపోతుంది. కనకాన్ని యమున కారులో కూర్చొపెడుతుంది. ఇంతలో విహారి వస్తాడు. లక్ష్మీ కనిపించిందని కారులో ఉందని చెప్తుంది. విహారి చూడటానికి ట్రై చేస్తే లక్ష్మీ ముఖం దాచేస్తుంది. విహారి చూస్తే ప్రాబ్లమ్ అవుతుందని చెప్పుకుండా ముఖం దాచుకుంటుంది. విహారి లక్ష్మీతో మాట్లాడుతాడు. మీ వల్ల మా అమ్మ బాధ పడుతుందని మీరు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారో కారణం చెప్పమని కనీసం తన తల్లికి అయినా చెప్పమని అంటాడు. ఇక అంబిక నిద్ర లేచి బయటకు వస్తుంది. ఈ టైంలో కారు ఏంటని అనుకుంటుంది. కనకం విహారికి కనిపించకుండా ఇంట్లోకి వెళ్లిపోవాలని అనుకుంటుంది. ఇక అంబిక లక్ష్మీ వెళ్లిపోవాలి అనుకుంటే విహారి వాళ్లు తీసుకొచ్చారని అనుకుంటుంది.
మరోసారి చెప్పకుండా వెళ్లిపోవద్దని ఈ ఇళ్లు నీదే అని మేమంతా నీ వాళ్లం అనుకో అని ఇంకోసారి చెప్పకుండా వెళ్లిపోవద్దని చెప్తాడు. లక్ష్మీ విహారి మాటలకు ఎమోషనల్ అవుతుంది. ఇక విహారి కనక మహాలక్ష్మి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఉదయం కనకం తల్లిదండ్రులు హైదరాబాద్‌కి వస్తాడు. విహారికి కాల్ చేసి హైదరాబాద్ వచ్చామని సన్మానం కోసం వచ్చామని కాసేపట్లో సన్మానం జరుగుతుందని వీడియో కాల్ చేసినప్పుడు చూడమని అంటాడు. విహారి కనకం కోసం చాలా బాధ పడతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.