Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 8th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: సహస్ర నిశ్చితార్థం డ్రస్ చింపేసిన అంబిక.. లక్ష్మీపై నింద.. ఇంటి నుంచి గెంటేస్తారా!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Today Episode లక్ష్మీని ఇంటి నుంచి గెంటేయడానికి అంబిక సహస్ర నిశ్చితార్థం డ్రస్ కత్తిరించేసి ఆ నింద లక్ష్మీ మీద వేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode విహరి, యమున, భక్తవత్సలం సమాధి దగ్గరకు వెళ్తారు. భర్త సమాధిని చూసి యమున చాలా ఏడుస్తుంది. ముగ్గురు సమాధి మీద పూల దండ వేసి ఎమోషనల్ అవుతారు. నీ చెల్లిలి కూతురే నీ కోడలిగా వస్తుందని నువ్వు ఉండి ఉంటే బాగుండేదని భక్తవత్సలం ఏడుస్తాడు. యమున చాలా ఏడుస్తుంది. తర్వాత ముగ్గురు ఇంటికి బయల్దేరుతారు.
సహస్ర తన ఫ్రెండ్స్‌తో మాట్లాడుతుంటుంది. తన బావ అందగాడు హీరో అని కథలు కథలు చెప్తుంది. తన ఫ్రెండ్స్ కూడా సహస్రని ఏడిపిస్తారు. ఇక అంబిక వర్క్ చేస్తుంటే ఎదురుగా లక్ష్మీ చీర పట్టుకొని వెళ్తుంటే యమున సహస్రకి ఇస్తానన్న చీర అనుకొంటుంది. లక్ష్మీ ఆ చీరని సహస్ర గదిలో పెడుతుంది. లక్ష్మీ వెళ్లిపోగానే అంబిక ఆ గదిలోకి వెళ్లి సహాస్ర నిశ్చితార్థం కోసం వేసుకోవాలని రెడీ చేసుకున్న డ్రస్‌ని కత్తెరతో కట్ చేసేస్తుంది. లక్ష్మీ పని అయిపోతుందని అనుకుంటుంది.
మరోవైపు విహారి తల్లిదండ్రులతో కలిసి వస్తుండగా ఆదికేశవ్ కాల్ చేస్తాడు. తాతయ్య, తల్లిని చూసి విహారి ఫోన్ లిఫ్ట్ చేయడు. ఆదికేశవ్ అదే పనిగా ఫోన్ చేస్తాడు. అర్జెంట్ అయింటుందని మాట్లాడమని యమున చెప్తుంది. విహారి ఫోన్ లిఫ్ట్ చేసి సిగ్నల్ లేదు అని కారు పక్కన ఆపి వాళ్లతో మాట్లాడుతాడు.
ఆదికేశవ్: మీ అత్తయ్య మీ కోసం పిండి వంటలు చేసింది అవి ఎక్కడికి పంపాలో అడ్రస్ చెప్తే మేం అక్కడికి పంపిస్తాం.
విహారి: మనసులో.. వీళ్లకి ఇప్పుడు అమెరికా అడ్రస్ ఇవ్వాలా ఏంటి. ఒక పని చేయండి అంకుల్ హైదరాబాద్‌లో మా ఫ్రెండ్ ఇంటికి ఇచ్చేయండి ఆయన మాకు ఇస్తాడు.
ఆదికేశవ్: సరే బాబు నేను హైదరాబాద్ వస్తాను అప్పుడే మీ ఫ్రెండ్కి ఇచ్చేస్తా. మీరు అమెరికాలో దసరా చక్కగా చేసుకోండి బాబు. పెళ్లి అయి ఇన్ని రోజులు అయినా మాకు ఇంకా మీరు కనకం మెడలో పుస్తెలు కట్టినట్లు మేం అక్షింతలు వేసినట్లే ఉంది. సరే బాబు ఉంటాను.
విహారి: దేవుడా నేను కనకం అమెరికాలో హాయిగా ఉన్నామని ఆదికేశవులు గారు అనుకుంటున్నారు ఆయన నమ్మకాన్ని నేను పని కట్టుకొని బల పరుస్తున్నాను. ఇంకానేను ఎన్ని రోజులు అబద్ధాలు చెప్పాలి. ఇక విహారికి తాతయ్య పిలవడంతో వెళ్తారు.
సహస్ర ఫ్రెండ్స్ తన గదిలోకి వచ్చి నిశ్చితార్థానికి ఏ డ్రస్ వేసుకోవాలి అనుకుంటున్నావో చూపించమని అడుగుతారు. సహస్ర ఫ్రెండ్ ఆ డ్రస్ చూసి చిరిగిపోయిందని చెప్తుంది. దాంతో సహస్ర డ్రస్ చూసి ఇలా ఎందుకు అయిందే అంటే ఎవరో కావాలనే చింపేసినట్లుందని అంటారు ఫ్రెండ్స్. ఇక పక్కనే చీరని చూపిస్తారు. దాంతో సహస్ర సాయంత్రం నిశ్చితార్థం పెట్టుకొని ఇప్పుడు డ్రస్ పోతే ఎలా అనుకుంటుంది. ఏరి కోరి తెచ్చుకున్నానని కిందకి వెళ్లి తల్లి వాళ్లతో కంప్లైంట్ ఇస్తుంది. లక్ష్మీ పాప సహస్ర అనుకుంటుంది. ఇక సహస్ర చీర చూపించి ఈ చీర నా గదిలోకి ఎలా వచ్చిందని అడుగుతుంది. దానికి లక్ష్మీ ఈ చీర నేనే నీ రూంలో పెట్టానమ్మా అని చెప్తుంది. దాంతో సహస్ర ఆవేశంగా లక్ష్మీని అందరి మధ్యలోకి లాగుతుంది. నా పర్మిషన్ లేకుండా నిన్ను ఎవరు వెళ్లమన్నారని అడుగుతుంది. చీర పెట్టి డ్రస్ నువ్వే చింపేశావని అంటుంది. లక్ష్మీ తనకు ఏం సంబంధం లేదని అంటుంది. పద్మాక్షి లక్ష్మీని లాగిపెట్టి కొడుతుంది. అందరూ కలిసి లక్ష్మీని గెంటేస్తారని అంబిక సంతోషపడుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: 'త్రినయని' సీరియల్: ఒకేసారి ఎంట్రీ ఇచ్చిన గాయత్రీదేవి, గాయత్రీ పాప.. ఇదెలా సాధ్యం?