Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 30th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: కనకం, విహారి మాట్లాడుకోవడం చూసేసిన సహస్ర.. బావని అనుమానిస్తుందా!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Today Episode : కనకమహాలక్ష్మీ తనతో సరిగా మాట్లాడటం లేదని విహారి కనకాన్ని అడగటం సహస్ర విహారి గదికి రావడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode : సహస్ర విహారి నిద్రపోయి ఉంటే చేయి పట్టుకొని తనకు బావ అంటే ఎంత ఇష్టమో విహారితో తన జీవితం ఎలా ఉండాలి అని కలలు కంటుందో అన్నీ ఎమోషనల్ అవుతూ చెప్తుంటుంది. అక్కడే దాక్కున్న కనకమహాలక్ష్మీ ఆ మాటలు వింటుంది. నీతో కడదాకా ఉంటాననే బావ అని అనుకుంటుంది. విహారి చేతికి ముద్దు పెట్టుకుంటుంది. నుదిటిపై ముద్దు పెడుతుంది.
లక్ష్మీ: సహస్రమ్మ కూడా నాలాంటి ఓ అమ్మాయి కదా భర్తతో ఎంతో జీవితం ఊహించుకొని ఉంటుంది. పెళ్లి తర్వాత రాబోయే భవిష్యత్ కోసం ఎన్ని ఆశలు పెట్టుకొని ఉంటుంది. మీరు నా మెడలో మంగళ సూత్రం కట్టి ఉండవచ్చు. కానీ మనస్ఫూర్తిగా భర్త కాలేరు. నేను మళ్లీ మీ జీవితంలోకి రావాలి అనుకోవడంలో అర్థం లేదు. సహస్రమ్మ మీ మీద ఆశలు పెట్టుకుంది. మీరు సహస్రమ్మ కలిసి కడవరకు ఉండాలన్నది విధిరాత. దాన్ని నేను కాదు అనలేను. మీ ఇద్దరి ఆశల్ని నేను పాడు చేయలేను.
విహారి షూ తీసి దుప్పటి కప్పి బయటకు వెళ్లి ఏడుస్తుంది కనక మహాలక్ష్మీ. తన పెళ్లిని గుర్తు చేసుకొని కుమిలిపోతుంది. విహారి కంట పడుతూ ఆయనకు ఎదురు పడుతూ ఉండగలనా లేదా అర్థం కావడం లేదని ఈ సమస్యకు ఏదో ఒక పరిష్కారం చూపించు తండ్రీ అని ఏడుస్తుంది. ఇంతలో పండు అక్కడికి వస్తాడు. కనకం ఏడ్వడం చూసి లక్ష్మీమ్మ ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావ్ అని అడుగుతాడు. జరిగిన దానికి విహారి చాలా బాధ పడుతున్నాడని విహారి సమస్యలకు మూలం అవుతున్నానని అందుకే బాధగా ఉందని అంటుంది. దానికి పండు నీ ఆలోచన విధానం బాలేదేమో లక్ష్మీమ్మ అని అంటాడు.
పండు: నువ్వు విహారి బాబు కంట పడకూడదు అనుకున్నావ్ కానీ పడేలా ఆ భగవంతుడు చేశాడు.
లక్ష్మీ: అలా అనకు పండు ఆయన బాధకు నేను కారణం అవ్వకూడదు అనవసరం అయిన గొడవలు వస్తాయి. వాటికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో కారణం అవుతాను
పండు: లక్ష్మీమ్మ నువ్వు ఈ ఇంటికి రావాలి అనుకోలేదు భగవంతుడే రప్పించాడు. అందుకే విహారి బాబుని నిన్ను ఎదురు పడేలా చేశాడు. అంతా విధి వల్లే జరుగుతుంది. జరిగే దానికి తల వంచుకుపోవడం మన ధర్మం.
లక్ష్మీ: ఏమో పండు నువ్వు తీసుకున్న అంత ఈజీగా నేను తీసుకోలేకపోతున్నాను.
ఉదయం కనకం తల్లిదండ్రులు హైదరాబాద్ చేరుకుంటారు. లక్ష్మీకి ఫోన్ చేస్తారు. కనకం ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో విహారికి చేస్తారు. మత్తులోనే ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ఆదికేశవ్ అల్లుడుగారు అనడంతో మత్తు మొత్తం దిగిపోతుంది. ఇక విహారితో మీ ఫ్రెండ్‌ని పంపిస్తాను అన్నారు పంపమని చెప్తాడు. విహారి సరే అంటాడు. విహారి కనక మహాలక్ష్మీతో మాట్లాడి ఒప్పించి తన తల్లిదండ్రులకు అప్పగించాలి అనుకుంటాడు. ఇక పని మనిషి భవానితో లక్ష్మీకి మజ్జిగ తీసుకురమ్మని చెప్తాడు. భవాని వెళ్లి లక్ష్మీకి విషయం చెప్తుంది. లక్ష్మీ తీసుకొని విహారి గదికి వెళ్తుంది.
విహారి: కనక మహాలక్ష్మీ నేను నీతో చాలా మాట్లాడాలి అసలు నువ్వు మీ ఊరు వెళ్లకుండా ఇక్కడే ఆగిపోయావు. మరోవైపు అందరూ సహస్రని ఆటపట్టిస్తారు. విహారి కిందకు రాలేదని సహస్ర పిలవడానికి వెళ్తుంది.
లక్ష్మీ: మీరు అడిగే ప్రశ్నలకు నా దగ్గర సమాధానం లేదు ఒకవేళ సమాధానం ఉన్న ఇప్పుడు చెప్పాలి అని లేదు.
విహారి: ఎందుకు చెప్పవు నాకు చెప్పాల్సిన బాధ్యత నీకు లేదా.
లక్ష్మీ: బాధ్యత ఉంది కాబట్టే ఆగిపోయిన గతం గురించి మాట్లాడాలి అనుకోవడం లేదు మీ భవిష్యత్ బాగుండాలి అంటే ఆ గతం గుర్తు చేసుకోవాల్సిన అవసరం లేదు.
విహారి: కనక మహాలక్ష్మీ ఎందుకు నువ్వు నీ చుట్టూ గీత గీసుకుంటున్నావు ఎందుకు నాతో మాట్లాడటానికి నిన్ను నువ్వు ఆపుకుంటున్నావు.
లక్ష్మీ: గీత నా చుట్టూ మీకు నాకు మధ్య ఉంది. మీరు ఆ గీత దాటి నా వైపు రావాలి అని నేను కోరుకోవడం లేదు.
విహారి: నువ్వు కనపించావు అని నా మనసు కుదట పడింది. నేను నీతో ఎంతో మాట్లాడాలి అనుకుంటే నువ్వు ఎందుకు నన్నుఆపేస్తున్నావ్. ఇంతలో సహస్ర వచ్చి బావ అని ఇద్దరినీ చూసి షాక్ అవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.