Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today November 4th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: విహారిని చంపడానికి ప్లాన్ చేసిన అంబిక.. లక్ష్మీ కాపాడుతుందా!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Today Episode విహారి కాన్‌ట్రాక్టర్లను మార్చేయమని అంబికకు చెప్పడం తన పవర్ పోతుందని ఫీలైన అంబిక విహారిని చంపాలి అనుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode ఆదికేశవ్ దగ్గరకు విహారి తన ఫ్రెండ్ ఒక వ్యక్తిని పంపిస్తాడు. ఇక గౌరీ లగేజ్‌ని ఆ వ్యక్తికి ఇచ్చి అవన్నీ జాగ్రత్తగా అమెరికాకి ఇవ్వమని చెప్పి కచ్చితంగా ఇవ్వడంని చెప్తుంది. విహారి ఫ్రెండ్ ఎమోషనల్ అవుతాడు. కచ్చితంగా ఇస్తానని చెప్తాడు. ఇక ఆదికేశవ్ ఓ అమ్మవారి బొమ్మని ఇచ్చి ఇది కనకాన్ని చాలా ఇష్టం తన బాధ, సంతోషం కనకం ఈ విగ్రహానికి చెప్పేదని జాగ్రత్తగా అందించమని చెప్తారు. విహారి ఫ్రెండ్ కోసం కూడా ఓ బ్యాగ్ ఇస్తారు. మరోవైపు లక్ష్మీ యమున దగ్గరకు జ్యూస్ తీసుకొని వెళ్తుంది. యమున పద్మాక్షి మాటలు తలచుకొని పరధ్యానంలో ఉంటుంది.
లక్ష్మీ: ఏమైంది అమ్మ ఎందుకు అలా ఉన్నారు. అసలేమైంది నాకు చెప్పకూడదా.
యమున: మనసంతా కాస్త భారంగా ఉంది. విహారి, సహస్రల నిశ్చితార్థానికి ఇన్ని ఆటంకాలు ఏంటని ఇక పెళ్లికి ఎన్ని అవరోధాలు ఎదురువుతాయా అని భయంగా ఉంది.
లక్ష్మీ: అలా ఎందుకమ్మా అనుకుంటారు అన్నీ రోజులు ఒకేలా ఉంటాయా ఈసారి అలా జరగదు.
యమున: విహారి పెళ్లిని వాయిదా వేస్తున్నాడు. పెట్టిన ముహూర్తాన్ని కాదు అంటున్నాడు. అసలు ఎందుకు అలా చేస్తున్నాడు. నాకేం అర్థం కావడం లేదు. పద్మాక్షి వాళ్లకి చాలా అనుమానాలు వస్తున్నాయి. సహస్ర, విహారిల పెళ్లి జరిగే వరకు ఎవరికీ మనస్శాంతి ఉండదు.
లక్ష్మీ: అమ్మగారు హడావుడిగా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏంటని విహారి గారు ఆలోచించి ఉంటారు. మీరు అనవసరంగా ఆలోచిస్తున్నారు అనిపిస్తుంది.
యమున: ఏం లేకపోతే సరే కానీ వాయిదా వేస్తే మాత్రం ఇంట్లో అల్లకల్లోలం మొదలవుతుంది. ఇంట్లో శత్రుత్వం మళ్లీ సునామి అవుతుంది.
లక్ష్మీ: మీరు అనుకున్నట్లు ఏం కాదు అంతా మంచే జరుగుతుంది మీరు నిశ్చింతగా ఉండండి.
విహారి సైట్‌కి వెళ్లి అన్నీ చూస్తుంటాడు. ఓ ముఖ్యమైన ఫైల్ మర్చిపోవడంతో తల్లికి కాల్ చేస్తాడు. విషయం చెప్పి అడ్రస్ చెప్పి అక్కడికి పంపమని అంటాడు. యమున ఆ పని లక్ష్మీకి అప్పగిస్తుంది. లక్ష్మీ ఫైల్ తీసుకొని బయల్దేరుతుంది. ఇక చారుకేశవ అంతా తానే చూసుకుంటానని విహారితో బిల్డప్ ఇస్తాడు. అంబిక చారు కేశవ మీద సెటైర్లు వేస్తుంది. ఇంతలో అక్కడ ఓ పెద్ద ఇటుక పడి పగిలిపోతుంది. దాంతో విహారి కొంచెం కింద పడినందుకే ఇటుక విరిగిపోతే మరి బిల్డింగ్ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తాడు. అంబిక నీళ్లు నములుతుంది. ప్రతి ప్రాజెక్ట్ తనకు ఇంపార్టెంట్ అని ఇలా అయితే నాకు కష్టమని ప్రాజెక్ట్ కాంట్రాక్టర్స్‌ని మార్చేయమని ఆర్డర్ చేస్తాడు. అంబిక,సుభాష్ షాక్ అయిపోతారు. ఏదో ఒకటి సర్దిచెప్పబోతే విహారి ఒప్పుకోకుండా ఆర్డర్ వేసి వెళ్లిపోతాడు. చారు కేశవ కూడా సెటైర్లు వేసి వెళ్లిపోతాడు. అంబిక, సుభాష్ బెంబేలెత్తిపోతారు. ఇలాగే జరిగితే మన ఫ్యూచర్ పోతుందని విహారికి బ్రేక్ వేయాలని అంటుంది. ఇదే సైట్‌లోనే విహారిని చంపేస్తానని అంబిక సుభాష్‌తో చెప్తుంది. మరోవైపు లక్ష్మీ కూడా వస్తుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.