అన్వేషించండి

Kalavari Kodalu Kanaka Mahalakshmi August 12th: కనకమహాలక్ష్మీ సీరియల్: అవినాష్‌తో కనకం పెళ్లి చేయనని తేల్చేసిన సౌధామణి.. ఆది కేశవ్‌కి ఘోర అవమానం!

Kalavari Kodalu Kanaka Mahalakshmi Today Episode కనకమహాలక్ష్మీని తన ఇంటి కోడల్ని చేసుకునేదే లేదని సౌధామణి తేల్చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode ఆది కేశవ్ మాటలకు కనకమహాలక్ష్మి ఎమోషనల్ అవుతుంది.  మిమల్ని వదిలి వెళ్లను నాన్న అని అంటుంది. దాంతో ఆదికేశవ్ నిన్ను మా చెల్లి మీ అమ్మలా నిన్ను చూసుకుంటుందని అంటుంది. ఇక గౌరి అక్కడికి వచ్చి మళ్లీ పెళ్లి గోల మొదలైందా అని అడుగుతుంది. ఇక ఆది కేశవ్ చెల్లి సౌధామణి నట్టేట ముంచేస్తుందని గౌరీ అంటే కనకమహాలక్ష్మిని కచ్చితంగా తన చెల్లి కోడల్ని చేసుకుంటుందని అంటాడు. 

ఆదికేశవ్: అమ్మా చిన్నప్పుడు నుంచి ఇప్పటి వరకు నువ్వు వేసుకున్న బట్టల నుంచి కట్టుకోబోయే భర్త వరకు అన్నీ నా నిర్ణయాలే. కాదు అని వద్దు అని ఒక్కసారి కూడా నువ్వు అనలేదు. ఇంత అదృష్టం ఏం తండ్రికి ఉంటుంది చెప్పు.
కనకమహాలక్ష్మి: మీ ఇష్టాఇష్టాలకు వ్యతిరేకంగా నేను ఏదైనా పని చేస్తే ఆ రోజు నేను మీ కూతురిగా చనిపోయినట్లు లెక్క. నేను మీ కూతుర్ని నాన్న మీకు కాదు ఏ పని చేయను.
ఆది కేశవ్: చూడవే మన కూతురు ఆ దేవతే కూతిరిగా మనకు పుట్టింది. అత్తయ్య వాళ్లు వస్తే మీ పెళ్లి గురించి మాట్లాడి ఆ తాంబూలం ఇచ్చేస్తే నా భారం సగం దిగిపోతుంది. మీరు త్వరగా కానివ్వండి.
కనకమహాలక్ష్మి: అమ్మా నాన్న నా పెళ్లి గురించి చాలా ఆశలు పెట్టుకుంటున్నారమ్మా ఏదైనా అటు ఇటు జరిగితే నాన్న ఏమైపోతారా అని భయంగా ఉంది.
గౌరి: ఆయనకు చెల్లి మీద నమ్మకం ముదిరి పాకాన పడింది. నేను ఏమైనా చెప్తే ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తారు. మీ నాన్నకు ఏమీ పట్టవు చెల్లి చెల్లి అని ఆ మాయలోనే ఉంటాడు. ఇక మనకు ఆ భగవంతుడే కాపాడాలి.

ఆశ్రిత పెళ్లి కూతురిలా రెడీ అవుతుంది. ఆదికేశవ్ అక్కడికి వచ్చి తన చేతిలో నేసిన చీర పెట్టి పెళ్లికి కట్టుకోమని అంటాడు. ఇక సౌధామణి వస్తే ఆశ్రిత విషయం చెప్పి తన బ్లౌజ్ రేట్ ఆ చీర ఉండదని టిష్యూ పేపర్ లాంటిదని చీరని విసిరి కొడుతుంది. గౌరీ కనకం అది చూస్తారు. కనకమహాలక్ష్మి చీర తీసుకొని వెళ్లిపోతుంది. ఇక ఆశ్రిత పెళ్లి అంగ రంగ వైభవంగా జరుగుతుంది. ఆది కేశవ్ తాంబూలం పళ్లెం పట్టుకొని పెళ్లి తర్వాత తన చెల్లితో తాంబూలం మార్చుకుందామని అంటాడు. ఇక పెళ్లి తర్వాత పెళ్లి కూతురికి మేన మామ మట్టెలు తొడగాలి అంటే సౌధామణి ఆది కేశవ్‌కి పిలుస్తుంది. ఆది కేశవ్ సంబరంగా ఆశ్రిత కాళ్లకు మెట్టెలు తొడుగుతుంది. అత్తయ్య నాన్న పట్టించుకోవడం లేదు నాన్న కంగారు పడుతున్నారని అంటుంది. ఇక తన తండ్రి ట్యాబ్లెట్ కూడా వేసుకోలేదని కనకమహాలక్ష్మి ట్యాబ్లెట్ ఇస్తుంది. ఇక ఆది కేశవ్ వేసుకోకుండా చెల్లి వెంట పడతాడు. చెల్లికి తాంబూలం గురించి చెప్పాలని చూస్తే సౌధామణి అవాయిడ్ చేస్తుంది. ఫొటోలు తీసేటప్పుడు ఆది కేశవ్ ఫ్యామిలీ వస్తుంటే వద్దని సౌధామణి ఆపుతుంది.

ఆదికేశవ్: ఎలాగూ అందరం ఒకే చోటు ఉన్నాం కదా తాంబూలం మార్చేస్తే అయిపోతుంది చెల్లి. కనకం, అవినాష్‌ల పెళ్లికి మనం తాంబూలం మార్చుకుందాం చెల్లి. 
సౌధామణి: అది అయ్యే పని కాదు అన్నయ్య. ఈ తాంబూలాలు ఈ పెళ్లి ఇవన్నీ జరగవు.
గౌరీ: ఏంటి వదినా ఇలా మాట్లాడుతున్నావు ఎందుకు మాట మార్చుతున్నావు.
సౌధామణి: అందరూ చూస్తున్నారు ఇష్యూ చేయకు అన్నయ్య. ఆది కేశవ్ తాంబూలం పళ్లెం తెస్తే విసిరి కొడుతుంది. నువ్వు చేస్తుంది ఏంటి అన్నయ్య. మా పరువు బజారు పాలు అవుతుంది ఆపుతావా ఇక. చూడు నువ్వు అనుకున్నట్లు నీ కూతుర్ని నా కొడుకుకి చేసుకోవడం లేదు.
ఆదికేశవ్: ఎందుకమ్మా.
సౌధామణి: ఈ మట్టి పిసుక్కునేదాన్ని తీసుకెళ్లి నా కోడలిని ఎలా చేసుకోవాలి. గతం గతహా  అప్పట్లో వంద అంటాం అవన్నీనిజం అయిపోతాయా కాలంతో పాటు మనం మారాలి. 
ఆదికేశవ్: ఈ అన్నయ్యకి మాట ఇచ్చావ్ కదమ్మా.
సౌదామణి: మాట మాట ఏం మాట ఆ రోజుల్లో నాకు సాయం చేశావని ఏదో అన్నాను ఇప్పుడు నేను నీకు అందనంత ఎత్తులో ఉన్నాను. నీకిచ్చిన మాట కోసం దిగిమంటావా దిగజారిపోమంటావా. ఇన్ని ఆస్తులు అంతస్తులు అన్నీ తూచ్ అని మర్చిపోమంటావా.
గౌరీ: ఏం మాట్లాడుతున్నారు వదినా వీళ్ల పెళ్లి జరిపిస్తాను అని మీరు ఆయనకు మాటిచ్చారు కాబట్టి ఆ నమ్మకద్రోహాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. 

ఆదికేశవ్ భార్య గౌరీని కొడతాడు. కనకమహాలక్ష్మి కూడా ఆవిడ చేసిన దాన్ని నమ్మక ద్రోహం అంటారు కదా నాన్న అమ్మని ఎందుకు కొడతావ్ అని అడుగుతుంది. ఆది కేశవ్ పెళ్లి జరగకపోతే చనిపోతానని అంటాడు. జరిగిన మోసం చాలదని ఇలా అంటారేంటి అని గౌరీ, కనకమహాలక్ష్మి తండ్రిని తీసుకెళ్లడానికి సిద్ధమవుతారు. అందరూ ఆది కేశవ్ గురించి పాపం అనుకుంటాడు. ఇక అందరూ సౌదామణి గురించి తప్పుగా మాట్లాడుతారు. ఇక సౌధామణి నీ ముఖం చూడాలి అంటే చిరాకుగా ఉంది పో అవతలికి అని ఆదికేశవ్‌ని నెట్టేస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: సత్యభామ సీరియల్: అత్తాకోడళ్ల సవాల్, సత్యకు అగ్నిపరీక్ష.. బోనం ఎత్తడంలో సక్సెస్ అవుతుందా!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Mahindra XUV 7XO: 7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి
7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Mahindra XUV 7XO: 7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి
7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Gold vs Silver for Investment : బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
Thiruparankundram: ఆ కొండపై దీపం వెలిగించుకోవచ్చు - మద్రాస్ హైకర్టు సంచలన తీర్పు - స్టాలిన్ సర్కార్ ఇక ఆపలేదు !
ఆ కొండపై దీపం వెలిగించుకోవచ్చు - మద్రాస్ హైకర్టు సంచలన తీర్పు - స్టాలిన్ సర్కార్ ఇక ఆపలేదు !
Venezuelan people happy: దేశాధ్యక్షుడ్ని అమెరికా కిడ్నాప్ చేస్తే సంబరాలు చేసుకుంటున్న వెనిజులా ప్రజలు - మదురో ఇంతగా టార్చర్ పెట్టారా?
దేశాధ్యక్షుడ్ని అమెరికా కిడ్నాప్ చేస్తే సంబరాలు చేసుకుంటున్న వెనిజులా ప్రజలు - మదురో ఇంతగా టార్చర్ పెట్టారా?
Embed widget