Janaki Kalaganaledu serial: సీరియల్‌కు గుడ్ బై, శ్రీశైలంలో ‘జానకి కలగనలేదు’ ఫ్యామిలీ ట్రిప్ - ఆ ఒక్కరు మిస్!
సీరియల్ శుభం కార్డు పడటంతో ‘జానకి కలగనలేదు’ ఫ్యామిలీ అంతా శ్రీశైలం వెళ్లారు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.
![Janaki Kalaganaledu serial: సీరియల్‌కు గుడ్ బై, శ్రీశైలంలో ‘జానకి కలగనలేదు’ ఫ్యామిలీ ట్రిప్ - ఆ ఒక్కరు మిస్! Janaki Kalaganaledu team Srisailam trip video viral on internet Janaki Kalaganaledu serial: సీరియల్‌కు గుడ్ బై, శ్రీశైలంలో ‘జానకి కలగనలేదు’ ఫ్యామిలీ ట్రిప్ - ఆ ఒక్కరు మిస్!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/23/1d194c0301fe9561c54204857af855d81692769349362768_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Janaki Kalaganaledu serial: మామూలుగా సీరియల్స్ లలో నటించే నటీనటులు మంచి స్నేహితుల్లా కనిపిస్తూ ఉంటారు. కేవలం షూటింగ్ టైంలోనే రీల్ పాత్రలతో కనిపిస్తూ ఉంటారు. కానీ.. కాస్త బ్రేక్ దొరికితే చాలు సెట్ లో సందడి చేస్తారు. ఏదైనా ఈవెంట్ ఉంటే కలిసి మెలిసి ఫ్యామిలిలా కలిసి వెళ్తుంటారు. ముఖ్యంగా ‘‘జానకి కలగనలేదు’’ సీరియల్ ఫ్యామిలీ మెంబర్స్ సోషల్ మీడియాలో చేసే రచ్చ మామూలుగా ఉండదని చెప్పాలి. కాస్త బ్రేక్ దొరికితే చాలు ఫన్నీ ఫన్నీ వీడియోస్ చేస్తూ పంచుకునే వాళ్ళు. సీరియల్లో పాత్రలపరంగా అలా ఉంటారు.. కానీ బయట మాత్రం చాలా క్లోజ్ గా ఉంటారు.
ఇక సోషల్ మీడియాలో సరదాగా వీడియోలు చేస్తూ ఉంటారు. యూట్యూబ్లో ఛానల్ క్రియేట్ చేసుకొని తమ సీరియల్ కి సంబంధించిన విషయాలు పంచుకుంటూ ఉంటారు. చాలావరకు ఈ నటీనటులంతా ప్రేక్షకులను సీరియల్ పరంగానే కాకుండా సరదా వీడియోలతో కూడా బాగా ఎంటర్టైన్ చేస్తున్నారు. ముఖ్యంగా ‘జానకి కలగనలేదు’ సీరియల్ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం సోషల్ మీడియాలో చేసే రచ్చ మామూలుగా ఉండదని చెప్పాలి. కాస్త బ్రేక్ దొరికితే చాలు ఫన్నీ ఫన్నీ వీడియోస్ చేస్తూ పంచుకునే వాళ్ళు. సీరియల్లో పాత్రలపరంగా అలా ఉంటారు కానీ బయట మాత్రం చాలా క్లోజ్ గా ఉంటారు. అయితే రీసెంట్ గానే ‘జానకి కలగనలేదు’ సీరియల్ శుభం కార్డు పలికిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో అభిమానులు ఆ సీరియల్ కంటే వాళ్లు కలిసి చేసే ఎంటర్టైన్మెంట్ ని మిస్ అయ్యాము అంటూ చాలా బాధపడుతున్నారు. ఆ సీరియల్ ముగియటంతో వాళ్లను మళ్లీ కలిసి చూడలేము అని అంటున్నారు. కానీ వాళ్ళు సీరియల్ సెట్ లో ఉన్నంతవరకే కాకుండా.. బయట కూడా కలుసుకుంటున్నట్లు కనిపిస్తుంది. ఇన్ని రోజుల వారి మధ్య సీరియల్ అనుబంధం ఉంది కాబట్టి.. సీరియల్ ముగిసినప్పటికీ కూడా వాళ్ళు ఒకరిని ఒకరు వదలకుండా ఉంటున్నట్లు అర్థమవుతుంది.
అయితే తాజాగా ‘జానకి కలగనలేదు’ నటీనటులంతా శ్రీశైలం వెళ్లారు. ఆ వీడియోను జెస్సి పాత్రలో నటించిన భవి యూట్యూబ్ ద్వారా పంచుకుంది. ఆ వీడియోలో రామ, అఖిల్, జెస్సి, మల్లిక ఇలా మరి కొంతమంది కూడా కనిపించారు. అందరూ కలిసి శ్రీశైలం ట్రిప్ లో బాగా ఎంజాయ్ చేసినట్లు కనిపించారు. కొన్ని పురాతన గుడిలు చూపిస్తూ వాటి గురించి కూడా కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
అయితే ఆ వీడియోలో జానకి మాత్రం కనిపించలేదు. అంతే కాదు జ్ఞానాంబ, గోవిందరాజులు కూడా కనిపించలేదు. బహుశా వారు ఇతర పనులలో బిజీగా ఉన్నారేమో. ప్రస్తుతం ఆ వీడియో బాగా వైరల్ అవ్వగా.. ‘‘జానకి కలగనలేదు’’ సీరియల్ అభిమానులు ఆ వీడియోకి బాగా లైక్స్ కొడుతున్నారు. ఇటువంటి వీడియోస్ చేస్తూ తమందర్ని ఎంటర్టైన్మెంట్ చేయమని కోరారు.
also read : Neethone Dance: ‘నీతోనే డాన్స్’ షోలో విజయ్ దేవరకొండ సందడి - అంతా రౌడీ పెళ్లి గురించే రచ్చ
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)