Janaki Kalaganaledu April 8th: రామాని ఘోరంగా అవమానించిన మల్లిక- జానకి దంపతుల చేతుల మీదుగా శ్రీరాముడి కళ్యాణం
జానకి కానిస్టేబుల్ కావడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
విష్ణు చేసిన అప్పు తీర్చమని రామ అడుగుతాడు. అందరి వాటాలో ఉన్న స్వీట్ షాపు విడిపించడం మానేసి ఈ నగల గోల ఏంటని మల్లిక అంటుంది. కొద్ది రోజులు ఆగి జానకి పేరు మీద లోన్ తీసుకుని తప్పకుండా స్వీట్ షాపు విడిపిస్తానని రామ అంటాడు. అయినా అది వాడి ఒక్కడి బాధ్యత అన్నట్టు నిలదీస్తారు ఏంటి మీరు కూడా డబ్బులు ఇవ్వండి అని గోవిందరాజులు చెప్తాడు.
మల్లిక: బాగుంది పిల్లలకి ఆస్తుల వాటా పంచాల్సింది పోయి అప్పుల వాటా పంచుతున్నారా? అయినా సంపాదన బట్టి ఎవరైనా డబ్బులు అడగండి. బావగారికి బండి మీద పదిహేను వేలు వస్తున్నాయి, జానకిది గవర్నమెంట్ ఉద్యోగం. వాళ్ళని అప్పు తీరుస్తారు. మీలా మాది గవర్నమెంట్ ఉద్యోగం ఏమి కాదు ఒకరి కింద జీతం కోసం పని చేస్తున్నారు
జానకి: మరిది బ్యాంక్ లోన్ తీసుకుని బట్టల షాపు పెట్టిన విషయం ఇంట్లో అందరికీ తెలుసు, నేను బయట పడటం లేదు కదా మాట్లాడొద్దు
Also Read: కావ్యకి పూలు కొనిచ్చిన రాజ్- ఇంట్లో నుంచి వెళ్లిపోతున్న అపర్ణ
మల్లిక: మెడ బోసిగా ఉన్న అత్తయ్య నగల గురించి అడగలేదు నువ్వు బావని గిచ్చి గోల చేస్తున్నావ్ అన్నదమ్ములు కలిసి ఉండటం ఇష్టం లేదా. అరిచి గీ పెట్టినా నగలు విడిపించడానికి మా దగ్గర పైసా లేదు
డబ్బులు అడిగినందుకు సందు చేసుకుని ఇంట్లో నుంచి విడిగా వెళ్లిపోదామని మల్లిక దొంగ ఏడుపు ఏడుస్తుంది. ఎందుకు ఆ మాటలు ఆ ఐదు లక్షలు నేనే కత్తి నగలు విడిపిస్తానని రామ అంటాడు. ప్రతిదీ నీ నెత్తిన మోస్తుంటే మిగతా వాళ్ళు చూస్తూనే ఉంటారని గోవిందరాజులు చెప్తాడు. స్వీట్ షాపు పని నువ్వు చూసుకో విష్ణు నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు నగలు విడిపించమని జ్ఞానంబ చెప్తుంది. అది అయ్యే పని కాదని మల్లిక తెగేసి చెప్తుంది. ఆ మాట ఇప్పుడు కాదు నగలు తాకట్టు పెట్టకముందు చెప్పాలని రామ కోపంగా అంటాడు.
మల్లిక రామ గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. జ్ఞానంబ వారిస్తున్నా కూడా వినకుండా తన నోటికి పని చెప్తుంది. నువ్వు ఇచ్చిన అలుసు మల్లిక నోరు ఇష్టం వచ్చినట్టు లేస్తుందని గోవిందరాజులు భార్యని అంటాడు. జరిగిన దానికి జానకి రగిలిపోతుంది. పిల్లి మెడలో గంట కడతాను అన్నారు ఇప్పుడు ఏమైందో చూడండి అది పిల్లి కాదు కోతి అని కోపంతో ఊగిపోతుంది. అటు విష్ణు ఆలోచిస్తూ ఉంటాడు. అన్నయ్యని మరీ అలా తీసి పారేసినట్టు అలా మాట్లాడావ్ ఏంటని అడుగుతాడు. ఐదు లక్షలు అప్పు తీరినందుకు సంతోషించండి అని అంటుంది. ఇంట్లో వాళ్ళ సహాయం లేకుండా మనం ఈ స్థాయికి ఎదిగే వాళ్ళం కాదని చెప్పినా కూడా మల్లిక వినకుండా తాను చేసిన పని సమర్థించుకుంటుంది.
Also Read: కనురెప్పల కాలంలోనే కథ అంతా మారిపోయిందే- ఖుషిని దూరం చేసేందుకు అభిమన్యు కుట్ర
జెస్సీ గదిలోకి వచ్చి మల్లికను తిడుతూ ఉంటుంది. బావ మంచివారు కాబట్టి సరిపోయింది వేరే వాళ్ళు ఆ ప్లేస్ లో ఉంటే చెంప పగలగొట్టే వాళ్ళని జెస్సి అంటుంటే అఖిల్ మాత్రం మౌనంగా ఉంటాడు. మల్లిక వదిన ఇలా మాట్లాడి ఉండకూడదు కానీ అన్నయ్య మారిపోయాడు వదిన మాటలు విని ఇలా చేస్తున్నాడు తమ్ముళ్లతో ప్రేమగా ఉండే వాడు కానీ ఇప్పుడు ఇలా చేశాడు దీనికి కారణం పెద్ద వదినే అని అంటాడు. మల్లిక కావాలనే ఇలా చేసిందని జ్ఞానంబ అంటుంది. పిల్లలకి అర్థం అయ్యేలా చెప్పాలని చెప్తుంది. జ్ఞానంబ ఇంటికి సర్పంచ్ వస్తాడు. శ్రీరామనవమి సందర్భంగా శ్రీరాముడి కళ్యాణం రోజు రామ, జానకి పీటల మీద కూర్చుంటే బాగుంటుందని అడుగుతాడు. ఆ మాటకి జ్ఞానంబ చాలా సంతోషపడుతుంది.