Janaki Kalaganaledu April 25th: జానకి నెత్తిన మరో పిడుగు- జ్ఞానంబ ఇంట్లో ఇక ప్రళయమే
రామని బెయిల్ మీద బయటకి తీసుకురావడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
![Janaki Kalaganaledu April 25th: జానకి నెత్తిన మరో పిడుగు- జ్ఞానంబ ఇంట్లో ఇక ప్రళయమే Janaki Kalaganaledu Serial April 25th Episode 562 Written Update Today Episode Janaki Kalaganaledu April 25th: జానకి నెత్తిన మరో పిడుగు- జ్ఞానంబ ఇంట్లో ఇక ప్రళయమే](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/25/b964d7f1174fc831aa2e68355e4df3181682399649267521_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
రామ గురించి అవమానంగా మాట్లాడుతుంటే ఉండలేనని జ్ఞానంబ బాధపడుతుంది. జానకి లాయర్ తీసుకుని స్టేషన్ బెయిల్ మీద రామని విడిపించడానికి వస్తుంది. కానీ బెయిల్ ఇచ్చేందుకు ఒప్పుకొనని మనోహర్ అడ్డం తిరగడంతో అప్పుడే ఒక ఎస్సైకి కాల్ వస్తుంది. మీరు చెప్పినట్టే చేస్తానని సుగుణని పిలిచి ఫార్మాలిటీస్ పూర్తి చేసి రామని విడుదల చేయమని చెప్తాడు. ఆ మాటకి జానకి సంతోషంగా థాంక్స్ చెప్తుంది. గోవిందరాజులు ఎంత సర్ది చెప్తున్నా కూడా జ్ఞానంబ తన పట్టు వదలనని అంటుంది. సుగుణ రామని విడుదల చేస్తుంది. అన్యాయం బయట విచ్చలవిడిగా తిరుగుతుంటే మీరు న్యాయాన్ని బంధించారు. రామని బెయిల్ మీద తీసుకుని వెళ్ళడం గెలుపు అనుకోవడం లేదు అసలు యుద్దం ముందు ఉందని జానకి మనోహర్ కి అదిరిపోయే కౌంటర్ వేస్తుంది. రామ చేయి పట్టుకుని స్టేషన్ నుంచి బయటకి తీసుకెళ్తుంది. తన అహం దెబ్బతిన్నడంతో రగిలిపోతాడు.
Also Read: దివ్యకి చుక్కలు చూపిస్తున్న రాజ్యలక్ష్మి- తులసి వాళ్ళని అవమానించి పంపించమన్న లాస్య
లాయర్ కి జానకి థాంక్స్ చెప్తుంది. తనని అభిమానించే అత్తయ్య చనిపోయిందని జానకితో చెప్పండి ఇక జీవితంలో తన మొహం చూడనని అంటుంది. అప్పుడే జానకి రామని తీసుకుని ఇంటికి వస్తుంది. కొడుకుని చూసి జ్ఞానంబ సంతోషపడుతుంది. గోవిందరాజులు జానకిని పక్కకి తీసుకుని వెళ్ళి మాట్లాడతాడు. ఈరోజుతో జ్ఞానం మీద ఆశ వదిలేసుకున్నా నా మాట వినే స్థాయి దాటిపోతుందని బాధపడ్డాను. జరగదు అనుకున్న దాన్ని ఎలా సాధ్యం చేశావ్. ఆ ఎస్సై ఎలా వదిలి పెట్టాడని అడుగుతాడు. బెయిల్ మీద తీసుకొచ్చాను మళ్ళీ ఆయన వెనక్కి వెళ్లాలని చెప్పేసరికి గోవిందరాజులు షాక్ అవుతాడు. ఈ నిజం మీ అత్తయ్యకి తెలిస్తే కుప్పకూలిపోతుంది ఇప్పుడే ఈ విషయం చెప్పకని అడుగుతాడు. రామని ఎటువంటి సూటి పోటి మాటలు అనొద్దని పీటర్ మేరీకి చెప్తాడు కానీ తను మాత్రం వినదు. జానకిని దగ్గరకి తీసుకుని జ్ఞానంబ నీ మనసు బాధపెడితే క్షమించమని అడుగుతుంది. వాడిని తీసుకొచ్చి ఇంటి పరువు నిలబెట్టడమే కాదు ప్రాణం కూడా నిలబెట్టావని అంటుంది.
Also Read: మనసుల్ని మెలిపెట్టేసిన ఎమోషన్- భవానీ మాటలకు గుండెలు పగిలేలా ఏడ్చిన మురారీ
పెద్దన్నయ్య వచ్చాకే పీటల మీద కూర్చుంటానని అఖిల్ అంటాడు. గదిలోకి వెళ్ళిన తర్వాత రామ భార్య కౌగిట్లో వాలిపోతాడు. బాబు ఏడుస్తుంటే జానకి వచ్చి ఎత్తుకుని ఆడిస్తానని తీసుకుంటుంది. అది అఖిల్ చూస్తాడు. మురళి జ్ఞానంబ ఇంటి దగ్గరకి వస్తాడు. కొడుకు తిరిగి వచ్చినందుకు జ్ఞానంబ కన్నీళ్ళు పెట్టుకుంటుంది. ఇంట్లో సమస్యలు వచ్చినప్పుడల్లా జానకి నేనున్నా అంటూ కాపాడుతుంది. తనని అనుమానించి మనసు బాధపెట్టాను. ఇంత వయసు వచ్చినా కూడ ఎందుకు ఇలా చేశాను తప్పు చేశానని జ్ఞానంబ బాధపడుతుంది. భర్త కాసేపు ఊరడించే మాటలు చెప్తాడు. జానకి ఇంటి గుమ్మం దగ్గర బాబుని ఎత్తుకుని ఆడిస్తూ ఉండటం మురళి చూస్తాడు. ఇదే సరైన ప్రతీకారం అనుకుంటాడు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)