Janaki Kalaganaledu September 6th: జ్ఞానంబ ఇంటికి జెస్సి పేరెంట్స్- జానకి ముందు నిజం ఒప్పుకుని సేవ్ చెయ్యమని అడిగిన అఖిల్
అఖిల్ గర్ల్ ఫ్రెండ్ జెస్సి ప్రగ్నెంట్ అయిన విషయం జానకికి తెలిసిపోతుంది. తనకి ఎలాగైనా న్యాయం చేస్తాను అని జానకి మాట ఇచ్చి చిక్కుల్లో పడుతుంది. దీంతో కథనం ఉత్కంఠగా మారింది.
అసలు మీరు కడుపుతో ఉన్నారా అని నాకు డౌట్ గా ఉందని చికిత మల్లికతో అంటుంది. కడుపుతో ఉన్న వాళ్ళకి వాంతులు అవుతాయి ఏమి తినబుద్ది కాదు మరి మీరేమో కుంభాలు కుంభాలు తింటున్నారు అని చికిత అనేసరికి బిత్తరపోయిన మల్లిక తనకి మొట్టికాయ వేస్తుంది. అఖిల్ జానకి నుంచి తప్పించుకునేందుకు బయటకి వెళ్లేందుకు చూస్తాడు కానీ దొరికిపోతాడు. ఏం ఆలోచించావ్ అఖిల్ నువ్వే చెప్పే దాని మీదే నేను తీసుకునే నిర్ణయం ఆధారపడి ఉంటుందని నిలదిస్తుంది. అప్పుడే జ్ఞానంబ ఇంట్లో అందరినీ పిలుస్తుంది. దీంతో దొరికిందే సంధు అని అఖిల్ జానకి దగ్గర నుంచి జారుకుంటాడు.
వినాయక చవితి సందర్భంగా ఇంట్లో అందరికీ బట్టలు తీసుకొచ్చాను అని జ్ఞానంబ చెప్పి వాటిని ఇస్తుంది. జానకి మాత్రం అఖిల్ ని కోపంగా చూస్తూ ఉంటుంది. అది మల్లిక పసిగడుతుంది. ఏంటి జానకి అదే పనిగా అఖిల్ ని కోపంగా చూస్తుంది ఏమై ఉంటుంది అర్థం కావడం లేదే అని మనసులో అనుకుంటూ ఉంటుంది. జానకి ప్రవర్తన ఎంతో తేడా కొడుతుంది. ఫాలో అయితే తెలిసిపోతుందని అనుకుంటుంది. జెస్సి జానకికి ఫోన్ చేసి ఇంట్లో జరిగింది అంతా ఏడుస్తూ చెప్తుంది. నా ప్రగ్నన్సికి కారణం అఖిల్ అనే విషయం అమ్మానాన్నలకి చెప్పక తప్పలేదు ఇప్పుడు ఈ విషయం గురించి మాట్లాడటానికి వాళ్ళు ఆవేశంగా మీ ఇంటికే బయల్దేరారు అని చెప్తుంది. అది విని జానకి షాక్ అవుతుంది. వాళ్ళు ఇంటికి వస్తే పెద్ద ప్రాబ్లం అవుతుందని జానకి కంగారు పడుతుంది.
అమ్మానాన్నని ఆపడానికి చాలా ట్రై చేశాను కానీ కుదరలేదు అని జెస్సి చెప్తుంటే జానకి ఫోన్ కూత చేసేస్తుంది. ఈ టైంలో అత్తయ్యగారికి విషయం తెలిస్తే తట్టుకోలేరు చాలా బాధపడతారు ఏదో ఒకటి చెయ్యాలి అని జానకి అనుకుంటుంది. వాళ్ళ మాటలు వినేందుకు మల్లిక ట్రై చేస్తుంది కానీ వినిపించవు. జానకి దాని గురించి ఆలోచిస్తే టెన్షన్ పడుతుంటే రామా వచ్చి తనతో మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళు వచ్చేలోపు రామాని లోపలికి పంపించేసి ఇంటి బయట జానకి జెస్సి వల్ల పేరెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అప్పుడే వాళ్ళు కోపంగా ఇంట్లోకి వస్తూ ఉంటే జానకి ఎదురుపడుతుంది. విషయం తేల్చుకోడానికే వచ్చాము, ఆడపిల్ల జీవితం అంటే ఆటలుగా ఉందా, మీది మాత్రమే పరువా మాది పరువు కాదా మా కూతురు కడుపుతో ఉందని తెలిసి మా గుండెలు రగిలిపోతున్నాయి’ అని జెస్సి తండ్రి జానకితో అంటాడు.
జానకి వాళ్ళకి విషయం సర్ది చెప్పేందుకు చూస్తుంది అది కాస్త మల్లిక కంటపడుతుంది. జానకి ఏదో తప్పు చేసింది అందుకే వాళ్ళని బతిమలాడుతుందని అనుకుంటుంది. జెస్సీ తల్లి మాకు న్యాయం జరగాలని అనేసరికి ఇలా అరిచి గొడవ చేస్తే సమస్య పెద్దది అవుతుందని నచ్చజెప్పేందుకు చూస్తుంది. మీ తొందరపాటుకు కూతురు జీవితం బలి అవుతుంది. నాకు కొంచెం టైం ఇవ్వండి నేను న్యాయం జరిగేలా చేస్తాను అని జానకి అంటుంది. కాదు మాకు ఇప్పుడే న్యాయం జరగాలి అనేసరికి సరే మీ ఇష్టం అనేసి జానకి కోపంగా అనడంతో బిత్తరపోతారు.
Also Read: రుక్మిణికి ఫోన్ చేసి మాట్లాడిన దేవుడమ్మ- మాధవ్ షాక్, కుమిలి కుమిలి ఏడుస్తున్న రుక్మిణి
జెస్సికి అఖిల్ తో పెళ్లి జరగాలి అంటే నా మాట విని ఇప్పుడే వెళ్లిపోండి లేదంటే విషయం చెప్పి మీ కూతురు జీవితాన్ని మీరే నాశనం చేసుకోండి. ప్లీజ్ నన్ను నమ్మండి నేను ఎలాగైనా మా అత్తయ్యగారితో మాట్లాడతాను అంటుంది. ఈ సారికి నీ మాట విని వెళ్లిపోతున్నాం రేపు సాయంత్రం లోగా మాకు పరిష్కారం కావాలి లేదంటే మేము చేయాల్సింది మేము చేస్తాం అనేసి వాళ్ళు వెళ్లిపోతారు. దాంతో జానకి ఊపిరి పీల్చుకుంటుంది. అఖిల్ జానకి నుంచి తప్పించుకునేందుకు వెళ్లబోతుంటే పట్టుకుని పక్కకి తీసుకెళ్తుంది. అది మల్లిక చూసి వెనకాలే ఫాలో అవుతుంది. చేసిన తప్పు కప్పిపుచ్చి ఆడపిల్లకి అన్యాయం చెయ్యాలని అనుకుంటున్నావా ఇప్పుడే వెళ్ళి అత్తయ్యగారికి మీ అన్నయ్యకి విషయం చెప్పేస్తాను అని జానకి అంటుంది.
‘అమ్మకి తెలిస్తే నన్ను చంపేస్తుంది. నేను చేసింది తప్పే తొందరపడ్డాను నిజమే. సడెన్ గా జెస్సి ప్రగ్నెంట్ అని చెప్పింది భయపడ్డాను ఆ భయంతోనే అబార్షన్ చేయించుకోమని చెప్పాను, సాక్ష్యం ఉండకూడదనే నీ ఫోన్లో ఫోటోస్ డిలీట్ చేశాను అంతే తప్ప జెస్సిని మోసం చేయాలనే ఉద్దేశం లేదు. అమ్మ భయంతోనే నీ నుంచి తప్పించుకుని తిరుగుతున్నా ఈ విషయం తెలిస్తే అమ్మ అసలు క్షమించదు అందరి ముందు నా పరువు కూడా పోతుంది. అందరూ నన్ను ఏమనకుండా నా పరువు పోకుండా నువ్వే ఏదో ఒకటి చెయ్యి వదినా ప్లీజ్' అని అఖిల్ ఏడుస్తూ బతిమలాడతాడు. అత్తయ్యగారితో నేను మాట్లాడతాను నాతో రా అని జానకి పిలుస్తుంది.