అన్వేషించండి

Janaki Kalaganaledu మే 31 (ఈరోజు) ఎపిసోడ్: జానకి రామచంద్రను హైదరాబాద్ వెళ్లనీయకుండా మల్లిక ఎత్తుగడ- మాత్రతో మాయ చేస్తున్న చిన్న కోడలు

జానకీ రామచంద్ర హైదరాబాద్‌ వెళ్తున్నారని తెలుసుకున్న మల్లిక.. వాళ్లను ఆపడానికి రకరకాల ప్లాన్లు వేస్తుంది.

మల్లిక ద్వారా గోవిందరాజులు వేసిన ప్లాన్ జ్ఞానాంభ తెలుసుకుంటుంది. మల్లిక మాటపై నమ్మకం ఉండదామెకు. ఎంతకీ మల్లిక వదలకుండా... బస్‌ టికెట్లు వెరిఫై చేయమంటుంది. మల్లిక మాటలతో హాల్‌లోకి వెళ్తుంది జ్ఞానాంభ. వెన్నెలను వెంటబెట్టుకొని వెళ్లబోతుంటే... టికెట్స్‌ తీసుకొని ఎదురుగా వస్తారు జానకీ, రామ. బస్‌కు టైం అవుతుంటే ఇంకా బయల్దేర కుండా ఏం చేస్తున్నారని జ్ఞానాంభ ఆరా తీస్తుంది. ఓసారి ఆ టికెట్లు ఓ సారి ఇవ్వమంటుంది. ఏమైందని రామచంద్ర అడుగుతాడు. బస్‌ ఎప్పుడు బయల్దేరుతుంది.. ఎంతకు చేరుకుంటుంది లాంటి వివరాలు తెలిస్తే ప్రశాంతంగా నిద్రపోతానంటూ కవర్ చేస్తుంది. వెన్నెలను పిలిపి టికెట్‌లో వివరాలు చదివి చెప్పమంటుంది. టికెట్ తీసి వెన్నెల చదువుతుంది. బస్‌ మన ఊరిలో ఏడు గంటలకు బయల్దేరుతుందని... పన్నెండు గంటలకు వైజాగ్ వెళ్తుందని చదువుతుంది. అప్పటి వరకు టెన్షన్ పడ్డ జానకీ రామచంద్ర, గోవిందరాజుకు కాస్త రిలీఫ్ ఇస్తుంది వెన్నెల. మల్లిక మరోసారి చూడమంటుంది... హైదరాబాద్‌ అని ఉంటుందని పదే పదే చెబుతుంది. వెన్నెల టికెట్ చూపించి ఇదిగో వైజాగ్ అని ఉందని స్పెల్లింగ్‌తో సహా చదివి వినిపిస్తుంది. 
అందరూ వెళ్లిపోయాక అసలు విషయం చెప్తాడు గోవిందరాజు. 

మల్లిక చాటున ఇలాంటి వింటుందని ముందు గ్రహించిన గోవిందరాజు హైదరాబాద్‌, వైజాగ్‌ టికెట్లు తీస్తాడు. హ్యాపీగా హైదరాబాద్ వెళ్లి కప్‌ కొట్టుకొని వచ్చేయండని ప్రోత్సహిస్తాడు. 

అసలు విషయం తెలుసుకున్న మల్లిక కంగుతింటుంది. నీ గురించి ముందే ఊహించానంటూ షాకింగ్ విషయం చెప్తాడు గోవిందరాజు. 

గోవిందరాజుకు రామచంద్ర థాంక్స్ చెప్తాడు. 

రూమ్‌లోకి వచ్చిన మల్లిక బోరుబోరున ఏడుస్తుంది. ఇంత ప్లాన్ చేసి నన్నే ముంచేశారా అని అలోచిస్తుంటుంది. కప్‌  కొట్టి తీసుకొస్తే మళ్లీ ఆ పెద్ద కోడలిని జ్ఞానాంభ నెత్తిన పెట్టుకుందని బాధ పడుతుంది మల్లిక. ఎలాగైనా వాళ్లు హైదరాబాద్ వెళ్లకుండా వంటల పోటీల్లో పాల్గొనకుండా చేయాలని ఆలోచిస్తుంటుంది. ఇంతలో టీవీలో వస్తున్న సీరియల్ చూస్తూ ఉండి పోతుంది. అందులో సీన్ చూసి మల్లికతో ఓ ఐడియా వస్తుంది. 

వస్తువులు పెట్టుకునే బల్లను శుభ్రం చేస్తూ జానకి కింద పడబోతుంటే రామచంద్ర పట్టుకుంటాడు. అసలు అంత ఎత్తున ఉన్న బల్ల శుభ్రం చేయాల్సిన అవసరం ఏమి వచ్చిందని అడుగుతాడు రామచంద్ర. మీ కోసమే అంటుంది. కొంపదీసి నన్ను అక్కడ కూర్చోబెడతారా ఏంటి అని అడుగుతాడు. నవ్వుతూ.. మీరు తీసుకొచ్చే ప్రైజ్‌ను అక్కడ పెట్టడానికి అని చెబుతుంది జానకి. చెఫ్ పోటీల్లో గెలిస్తే వచ్చే కప్‌ను అక్కడ పెడతానంటుంది. ఆ పోటీల్లో చదువుకున్న పెద్ద పెద్దవాళ్లంతా పాల్గొంటారు.. నేను  గెలుస్తానంటూ మీరు ఎలా నమ్ముతారని ప్రశ్నిస్తాడు రామ. నేను ఐపీఎస్‌ అవుతానంటూ మీరు ఎలా నమ్మారో ఇదీ అంతేనంటుంది జానకి. ఏదో మూల భయం ఉన్నా మీ నమ్మకంతో గెలిచి తీరాలన్న ఆలోచన పెరిగింది అంటాడు రామచంద్ర. 

జానకి, రామచంద్రను హైదరాబాద్‌ వెళ్లకుండా చేసేందుకు వేసిన ప్లాన్ వర్కౌట్ చేసేందుకు ప్రయత్నిస్తుంది మల్లిక. జ్ఞానాంభ రూమ్‌కు వచ్చి  జ్ఞానాంభ, గోవిందరాజు వేసుకునే టాబ్లెట్స్‌ మార్చేస్తుంది. 

రేపటి ఎపిసోడ్ 
ట్యాబ్లెట్స్ మారిన సంగతి తెలియకుండా జ్ఞానాంభ వాటిని వేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
Pawan Kalyan to Delhi : హఠాత్తుగా ఢిల్లీకి పవన్ కల్యాణ్ - ఎవరెవరితో భేటీలో సస్పెన్స్ !
హఠాత్తుగా ఢిల్లీకి పవన్ కల్యాణ్ - ఎవరెవరితో భేటీలో సస్పెన్స్ !
Revanth Reddy: తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
Rain Alert: బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆర్‌జీవీ ఇంటికి పోలీసులు, అరెస్ట్‌కి రంగం సిద్ధంపుష్ప 2 మూవీలోని కిస్సిక్ సాంగ్‌పై విపరీతమైన ట్రోల్స్యూపీలోని షాహీ మసీద్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తతవిజయ్‌తో రిలేషన్‌షిప్‌పై ఓపెన్ అయిన రష్మిక

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
Pawan Kalyan to Delhi : హఠాత్తుగా ఢిల్లీకి పవన్ కల్యాణ్ - ఎవరెవరితో భేటీలో సస్పెన్స్ !
హఠాత్తుగా ఢిల్లీకి పవన్ కల్యాణ్ - ఎవరెవరితో భేటీలో సస్పెన్స్ !
Revanth Reddy: తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
Rain Alert: బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
Ambati Rambabu On PusPha 2: కుట్రలు చేసినా పుష్ప-2 సినిమాని ఆపలేరని అంబటి రాంబాబు ఫైర్ - ఇంతకీ అల్లు అర్జున్ సినిమాని ఆపాలని ప్రయత్నించింది ఎవరు ?
కుట్రలు చేసినా పుష్ప-2 సినిమాని ఆపలేరని అంబటి రాంబాబు ఫైర్ - ఇంతకీ అల్లు అర్జున్ సినిమాని ఆపాలని ప్రయత్నించింది ఎవరు ?
Bhuvneshwar Kumar: భారీ ధరకు భువనేశ్వర్‌ను దక్కించుకున్న ఆర్సీబీ, బాధలో హైదరాబాద్ ఫ్యాన్స్!
భారీ ధరకు భువనేశ్వర్‌ను దక్కించుకున్న ఆర్సీబీ, బాధలో హైదరాబాద్ ఫ్యాన్స్!
Ram Gopal Varma: ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
KTR: '28 సార్లు ఢిల్లీకి పోయి రూ.28 కూడా తేలేదు' - సీఎం రేవంత్‌కు రైతుల బాధలు వినే తీరిక లేదని కేటీఆర్ సెటైర్లు
'28 సార్లు ఢిల్లీకి పోయి రూ.28 కూడా తేలేదు' - సీఎం రేవంత్‌కు రైతుల బాధలు వినే తీరిక లేదని కేటీఆర్ సెటైర్లు
Embed widget