Janaki Kalaganaledhu July 26th: ‘జానకి కలగనలేదు’ సీరియల్: అందరి ప్రశంసలు అందుకుంటున్న జానకి, కోడలి ప్రవర్తన ఇష్టపడని జ్ఞానంబ?
ఐపీఎస్ గా జానకి అత్తగారి ఊర్లో మర్యాదలు అందుకోవటంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
Janaki Kalaganaledhu July 26th: జానకి ఐపీఎస్ ఆఫీసర్ అని తెలియటంతో భయంతో వణికి పోతాడు మనోహర్. ఇక అప్పుడే ఆఫీసర్ వచ్చి మనోహర్ తో జానకి క్యాబిన్ చూయించమని చెబుతాడు. ఇక ముందు జానకి వెనుక మనోహర్ నడుస్తూ ఉండగా జానకి పులి తను మేకలాగా ఉన్నాను అని అనుకుంటాడు. గతంలో జానకి పట్ల చాలా దురుసుగా ప్రవర్తించాను అని ఏం అంటుందో అని భయపడతాడు.
ఇక జానకి క్యాబిన్ చూపించగా తనతో పాటు లోపలికి వెళ్లి గతంలో మీ పట్ల అలా ప్రవర్తించాను అది మనసులో పెట్టుకోకండి అన్నట్లు మాట్లాడుతాడు. వెంటనే జానకి నీ స్టేషన్ కి వచ్చాక దాని గురించి మాట్లాడదాం అని అంటుంది. ఇక తనకు వార్నింగ్ ఇవ్వటానికి ముహూర్తం పెట్టుకుందేమో అని భయపడతారు మనోహర్. మనోహర్ వెళ్లిన తర్వాత జానకి ఆ చైర్ అవన్నీ చూసి తన కల నెరవేరింది అని మురిసిపోతుంది.
ముఖ్యంగా తన తండ్రి కోరిక తీరింది అని సంతోషపడుతుంది. ఇదంతా రామ వల్ల సాధ్యమైంది అని అనుకుంటుంది. వెంటనే ఇంటికి వెళ్ళాలి అందరూ అక్కడ ఎదురు చూస్తుంటారు అని అనుకుంటుంది. మరోవైపు ఊర్లో జ్ఞానంబ ఫ్యామిలీ తో పాటు ఊరి జనాలు, ఎమ్మెల్యే, సర్పంచులు కూడా జానకి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇక రామకు కంగ్రాట్యులేషన్స్ చెబుతూ ఉంటారు.
అది చూసి ఫ్యామిలీ అంతా మురిసిపోతుంది కానీ జ్ఞానంబ మౌనంగా ఉంటుంది. ఇక వచ్చిన వాళ్లంతా ఐపీఎస్ జానకి భర్త అని అంటుంటారు. జ్ఞానంబకు అది నచ్చకపోవటంతో కాస్త మరోలా ఉంటుంది. ఆ తర్వాత కొందరు ఆడవాళ్లు వచ్చి జ్ఞానంబకు చీర పెట్టడం, సన్మానించడం కూడా జరుగుతుంది. ఎమ్మెల్యే కూడా జ్ఞానంబను మెచ్చుకుంటాడు. మీ వల్ల మీ కోడలు ఐపీఎస్ అయ్యింది అని పొగుడుతాడు.
జానకి వల్ల ఈ ఊరే గర్వంగా ఫీల్ అవుతుందని మేము మీసాలు తిప్పుకుంటూ గర్వంగా తిరుగుతున్నాము అని అంటాడు. అంతేకాకుండా రామ కూడా తెగ సంబరపడిపోతూ ఉంటాడు. ఒక ఎమ్మెల్యే అందరికీ అన్ని ఏర్పాట్లు చేసావా అని సర్పంచ్ ను అడగటంతో అన్ని ఏర్పాట్లతో పాటు ఐపీఎస్ గారికి వెల్కమ్ ఏర్పాట్లు కూడా చేశాను అని అంటాడు.
ఇక జానకి కారు రావడంతో జానకి అందరిని చూసి సంతోషపడుతుంది. రామ దగ్గరికి వెళ్లి ఎమోషనల్ గా సంతోషపడుతుంది. అందరు జనాలు జానకి దగ్గర గుమ్మిగూడుతూ ఉంటారు. తర్వాత జానకి తన అత్తమామల దగ్గరికి వచ్చి తన అత్తకు షీల్డ్ ఇచ్చి వారి ఆశీర్వాదాలు తీసుకుంటుంది. ఇక ఎమ్మెల్యే కూడా పూలతో అభినందిస్తూ ఉండగా అప్పుడే వెన్నెల తన అన్నయ్యతో నువ్వు కూడా వదిన పక్కన వెళ్లి నిలబడు అని అంటుంది.
దాంతో రామ వద్దులే అని అంటాడు. వెంటనే జ్ఞానంబ కనీసం జానకి అయిన తన భర్తను దగ్గరికి పిలిపించుకోవచ్చు కదా.. ఇక ఒక హోదాకు రాగానే తను తానే బతికేయచ్చని అనుకుంటుందా అని అపార్థం చేసుకుంటుంది. ఇక మళ్లీ తనే ఇలా అనుకుంటున్నాను ఏంటి అని అనుకుంటుంది. ఎమ్మెల్యే ఈరోజు రాత్రికి సన్మానం చేస్తామని జానకితో చెప్పటంతో జానకి తనకు అటువంటివి నచ్చవు అని అంటుంది.
also read it : Trinayani July 26th: ‘త్రినయని’ సీరియల్: ఆవు పేడలో ఎలర్జీ మందు కలిపిన వల్లభ, తిలోత్తమా ప్లాన్ బోల్తా కొట్టించిన గాయత్రి పాప?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial