Trinayani July 26th: ‘త్రినయని’ సీరియల్: ఆవు పేడలో ఎలర్జీ మందు కలిపిన వల్లభ, తిలోత్తమా ప్లాన్ బోల్తా కొట్టించిన గాయత్రి పాప?
అందరూ పూసుకునే ఆవుపేడలో తిలోత్తమా వల్లభ చే మందు కల్పించడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
Trinayani july 26th: గార్డెన్ లో ఆవు పేడ పూసుకోవడానికి ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ఇక ఒక్కొక్కరు ఒక్కొక్క వస్తువు పట్టుకొని వస్తుంటారు. ఇక అక్కడ పేడ తేవకముందే సుమన పేడ వాసన వస్తుందని చీదరించుకోవడంతో వెంటనే విశాల్ అక్కడ పేడనే లేదు అని అంటాడు. అమ్మ వాళ్ళు కూడా వస్తే బాగుండు అని అంటుండగా.. విశాల్ అన్నయ్య గురించి వాళ్ళు తెలుసు కదా అని అంటాడు.
అప్పుడే వల్లభ ఒకచోట నిలబడి అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారా అని చూస్తూ ఉంటాడు. ఇక తిలోత్తమా కెమికల్ తీసుకొని వచ్చి వల్లభకి ఇస్తుంది. పేడ పూసుకుంటే ఎటువంటి ఇన్ఫెక్షన్ రాదు అని నయని అన్నది కదా.. ఇప్పుడు ఈ కెమికల్ కలిపితే దెబ్బకు ఇన్ఫెక్షన్ వచ్చి మంట వస్తుంది. అప్పుడు తను తిక్క కుదురుతుంది అని అంటుంది. నేను చెప్పినప్పుడు కలుపు అని సలహా ఇస్తుంది.
అప్పుడే నయని ఆవు పేడ తీసుకొని రావటంతో సుమన ఆ వాసనకు చీదరగొడుతుంది. ఆవు పేడలో అన్ని దంచి పెట్టుకున్న పదార్థాలను వేసి కలుపుతుంది నయని. వల్లభని కూడా అక్కడ ఏమైనా పని చేయమని అంటుంది తిలోత్తమా. ఇక వల్లభ వెళ్లి ఒకచోట కూర్చుంటాడు. ఇక అందరూ అలా కలపడం వల్ల వాసన బాగా వస్తుంది అని అంటారు. తిలోత్తమా కూడా ఒకసారి ఆ వాసన తనకు చూపించమని అనడంతో విశాల్ ఆ పేడను ఒక ప్లేట్ లో తీసుకొని వస్తాడు.
మధ్యలో హాసిని వెటకారపు డైలాగులు కొడుతూనే ఉంటుంది. ఇక అందరూ తిలోత్తమా వైపు చూస్తుండగా వెంటనే వల్ల బాగా కెమికల్ కలుపుతాడు. ఇక తాము ఈ ప్లేట్ లో ఉన్నది పెట్టుకుంటాము అని వల్లభ ఆ ప్లేట్ తీసుకుంటాడు. ఇక గాయత్రి పాప వచ్చి కెమికల్ కలిపి ఉన్న ఆవు పేడలో చేయి పెట్టి కెమికల్ మాయం చేస్తుంది. వెంటనే నయని అల్లరి బాగా చేస్తుందని తన చేతులు కడుగుతుంది.
ఇక మొదట సుమన అది తీసుకొని పెట్టుకుంటుంది. ఆ తర్వాత అందరు పెట్టుకుంటూ ఉంటారు. ఇక వల్లభ కూడా ఆ పేడను మొత్తం పూసుకుంటూ ఉంటాడు. తిలోత్తమా కూడా రాసుకుంటూ ఉండగా వల్లభ నొప్పి అంటూ మంటతో అరుస్తూ ఉంటాడు. ఆ కెమికల్ వల్లభ ప్లేట్లోనే ఉంటుంది. గాయత్రి పాప సమయం చూసుకొని ఆ ప్లేట్లో కెమికల్ కలిపి వారికే తగిలేలా చేస్తుంది.
ఇక అందరూ ఆశ్చర్యపోతారు. కాసేపు తర్వాత వల్లభ ఒంటి మీద బట్టలు లేకుండా దుప్పటి కప్పుకొని మంటతో బాధపడుతూ ఉంటాడు. అప్పుడే తిలోత్తమా మంట తగ్గడానికి పౌడర్ తీసుకొని వస్తుంది. మధ్యలో హాసిని ఎంట్రీ ఇచ్చి కాసేపు వెటకారం చేసి అక్కడినుంచి వెళ్తుంది. ఆ తర్వాత తిలోత్తమా వల్లభకి పౌడర్ వేస్తుంది. ఇక అందరూ స్నానాలు చేసి వచ్చాక పూజ ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial