Krishnamma kalipindi iddarini July 25th: ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని’ సీరియల్: అఖిలకు అనుమానం పెట్టించిన సౌదామిని, అందరి మనసులు గెలుచుకున్న గౌరీ?
సౌదామిని అఖిల దగ్గరికి వచ్చి ఆదిత్య గురించి అనుమానం పెట్టించడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
Krishnamma kalipindi iddarini July 25th: సునంద
అఖిల దగ్గరికి వచ్చి గౌరీని చూసి నేర్చుకో అని కొన్ని మాటలు చెప్పి.. స్నానం చేసి దేవుడికి దీపం పెట్టి టిఫిన్ చేయమని చెప్పి అక్కడ నుంచి వెళ్తుంది. దాంతో కోపంతో రగిలిపోతున్న అఖిలను సౌదామిని, ఉజ్వల పొగరుగా చూస్తూ ఉంటారు. సౌదామిని అఖిల దగ్గరికి వచ్చి ప్రేమగా మాట్లాడుతున్నట్టు నటించి నన్ను పిన్ని అని పిలువు అని చెప్పి బయటికి వస్తుంది. వెంటనే ఉజ్వల తన తల్లితో అంటే అఖిలను మంచిగా చేసుకొని ఏదైనా ప్లాన్ చేస్తున్నావా అని అనటంతో అవును అంటుంది సౌదామిని.
ఇక మన్మధరావు వంట గదిలో స్వీట్లు తినడానికి ప్రయత్నిస్తుండటంతో అప్పుడే భానుమతి ఆ స్వీట్లు తినకుండా అడ్డుపడుతుంది. ఇక మన్మధరావు ఎంత బతిమాలిన కూడా భానుమతి వద్దంటే వద్దు అని చెబుతుంది. అదంతా గౌరీ గమనిస్తూ ఉంటుంది. నన్ను స్వీట్ తినకుండా చేస్తున్నావ్ మరి నువ్వు కూడా ఉప్పు కారాలు తింటున్నావు కదా అని అంటాడు. ఇక వారి మాటలు విని గౌరీ ఈశ్వర్ దగ్గరికి వెళ్లి ఎందుకు అమ్మమ్మ తాతయ్యని స్వీట్ తినొద్దంటుంది అని అడుగుతుంది.
దానితో ఈశ్వర్ తాతయ్యకు షుగర్ అని.. నానమ్మకి బీపీ ఉంది అని చెబుతాడు. దాంతో గౌరీ అందరి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి అని అనుకుంటుంది. ఇక ఇంట్లో వాళ్లకి ఏవైనా అనారోగ్య సమస్యలు ఉన్నాయా అని అడిగి వాళ్ళ అభిరుచిలు అడిగి తెలుసుకుంటుంది. ఆ తర్వాత గౌరీ అందరికోసం వంటలు చేస్తూ ఉంటుంది.
అది చూసి అఖిల బాగా మండిపడుతుంది. తను మంచి పేరు తెచ్చుకోవడానికి ఉదయాన్నే అన్ని పనులు చేస్తుంది అని కుళ్లుకుంటుంది. అక్కడ గౌరీ తనకు కావాల్సినది దొరకకపోవటంతో తన చిన్న అత్తయ్య దగ్గరికి అడగడానికి వెళ్తుంది. అప్పుడే అఖిల అక్కడికి వెళ్లి ఉప్పు కలపాలని ఉప్పు వేస్తూ ఉండటంతో సౌదామిని అఖిలను పక్కకు పిలుస్తుంది.
అఖిల ఉప్పు వేయకుండా పక్కకు పెట్టేసి తన ప్లాన్ అంత పాడయింది అని కోప్పడుతుంది. ఇక సౌదామిని అఖిలతో ఆదిత్య తనతో ప్రవర్తిస్తున్న విధానాన్ని చెప్పి తనను నిన్ను దూరం పెడుతున్నాడు కదా అని అంటుంది. అలా ఏమీ లేదు తను కాస్త ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పటంతో.. అలా లేదు తను ఎవరినో ప్రేమిస్తున్నాడు అని నిన్ను పెళ్లి చేసుకోవడం కూడా అతనికి ఇష్టం లేదు అని.. అలా ఏమి ఉండదంటూ అఖిల కోపంతో రగిలిపోతుంది.
ఒకవేళ అదే నిజమైతే నా అసలు రూపాన్ని చూస్తారు అని గట్టిగా చెబుతుంది. ఇక ఆ తర్వాత అందరికీ గౌరీ భోజనాలు వడ్డిస్తూ ఉండటంతో ఇక్కడ కూడా నీ గతి పనిమనిషి అంటూ నేను మహారాణి లాగా కూర్చున్నాను అంటూ అఖిల అనుకుంటుంది. గౌరీ చేసిన వంటలు అందరికీ నచ్చటంతో అందరూ గౌరీని పొగుడుతూ ఉంటారు. పైగా ఎవరికి కావాల్సిన ఫుడ్ వాళ్లకి తయారు చేయడంతో అందరి ఫీదా అవుతారు. ఇక తనను మరింత పోగడటంతో అఖిల తట్టుకోలేక పోతుంది.
also read it : Trinayani July 25th: ‘త్రినయని’ సీరియల్: సుమన చెంప పగలగొట్టిన అత్త.. తిలోత్తమా చీర కొంగుకు చుట్టుకున్న శంఖం?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial