Jagadhatri Serial Today August 8th Episode: జేడీ ఫొటో మీననక్ ఇవ్వాలని త్రిపాఠీ చేసిన ప్రయత్నం ఫలిచిందా? ఇవాల్టి జగధాత్రి సీరియల్‌లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఏంటీ?
Jagadhatri Serial Today August 8th Episode: జేడీ ఫోటోలు ఫోన్‌లో తీసిన త్రిపాఠీ వాటిని మీనక్‌కు పంపేందుకు ప్రయత్నించగా జేడీ అనుమానించి ఫోన్ తీసుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది.
Jagadhatri Serial Today August 8th Episode: మీనన్ త్రిపాఠీకి ఫోన్ చేసి జేడీ ఫోటో కావాలని కోరతాడు. జేడీ(JD) ఫొటో ఇస్తే నీ జోలికి రానని బెదిరిస్తాడు. దీంతో జేడీ ఫొటో మీనన్(Menon)కు ఇస్తే....మీనన్ జేడీ సంగతి చూస్తాడని అప్పుడు తాను హ్యాపీగా ఉండొచ్చని త్రిపాఠీ(Thripati) సంబరపడిపోతాడు.
అప్పుడే పోలీసుస్టేషన్‌కు వచ్చిన కేధార్(Kedhar), జేడీని కమిషనర్ అభినందిస్తుంటాడు.అప్పుడే అక్కడి వచ్చిన త్రిపాటీ వీరిద్దరిని విష్ చేసి మెచ్చుకుంచాడు. లోపలికి వచ్చారు కదా ఇంకా ఆ మాస్కులు ఎందుకని తీసివేయండని కోరతాడు. వెంటనే వారిద్దరూ వారి నోటికి ఉన్న మాస్కులు తీసివేస్తారు. అప్పుడు చాటుగా జేడీ(JD) ఫొటోలు ఫోనులో తీయడానికి ప్రయత్నిస్తాడు కానీ కుదరదు. కమిషనర్ వాళ్లను రూంలో తీసుకెళ్లి వారి ధైర్య సాహసాలను మెచ్చుకుంటాడు. మీనన్(Menon)కు భయాన్ని పరిచయం చేశారని మెచ్చుకుంటాడు.
కమిషనర్: అయినా యువరాజు ఇంట్లో ఫంక్షన్ జరుగుతుండగా ఆయుధాలు డీల్ చేస్తాడని ఊహించలేదు.
జేడీ: యువరాజు(Yuvaraj)కు కూడా అలా చేయాలని లేదు. కానీ వేరే మార్గం లేక ఆ పని చేయాల్సి వచ్చింది. వాళ్లు ఎప్పుడూ అక్కడే గన్స్ ఇంఫోర్ట్ చేసుకుంటారు. నాకు, కేదార్‌కు ఆ ఫార్సిల్‌పై అనుమానం వచ్చిందో వెంటనే ఆ ఫార్సిల్స్ నుంచి ఆ గన్స్ బయటకు తీసివేశారు. సిటీ మొత్తం పోలీసులు గస్తీ కాస్తున్నారని తెలిసి ఎక్కడ దాచాలో తెలియక మా ఇంట్లోనే దాచారు.
కేదార్: ఆ పార్సిల్ గురించి మాట్లాడినందుకే యువరాజు అంత గొడవ చేశాడు సార్. అంటే మీనన్‌కు మా బాబాయి కూడా సాయం చేస్తున్నారా..?
కమిషనర్: మీనన్ కొన్ని కోట్ల నకిలీ నగదు సిటిలోకి తీసుకొస్తున్నాడని ఇన్‌ఫర్మేషన్ ఉంది. అది అడ్డుకోవాలని సూచిస్తాడు
కమిషనర్, కేదార్, జేడీ(JD) లోపల మాట్లాడుతుండగా గ్లాస్ డోర్ నుంచి జేడీ ఫొటోలు తీసేందుకు త్రిపాటి ప్రయత్నిస్తుంటాడు. ఆ విషయం జేడీ గమనించే లోపల కింద కూర్చుంటాడు. ఈలోగా కమిషనర్‌తో మాట్లాడి జేడీ, కేదార్ అక్కడి నుంచి వెళ్లిపోతారు.
మళ్లీ మాస్కులు పెట్టుకుని బయటకు వచ్చిన వారితో మాస్కులు తీయించేందుకు త్రిపాటి దేవుడి ప్రసాదం తెచ్చినట్లు నాటకమాటడాడు. ప్రసాదం తినేందుకు జేడీ, కేదార్ మరోసారి మాస్కులు తొలగిస్తారు. వారిద్దరూ ప్రసాదం తింటుంటే వీడియో తీస్తాడు. త్రిపాఠీ(Thirpati) పదేపదే మాస్కులు తీయమని అడుగుతుండటం గుర్తుకు వచ్చి జేడీ అనుమానిస్తుంది. ఇదే విషయాన్ని కేదార్‌కు చెబుతుంది. నేను వెళ్లి త్రిపాటి ఫోన్ తీసుకుంటానని...నువ్వు వెళ్లి రమ్యతో త్రిపాటీ ఫోన్ హ్యాక్ చేయించమని చెబుతుంది.
జేడీ త్రిపాఠీ దగ్గరకు వెళ్లి తన ఫోన్ స్విఛ్చాప్ అయ్యిందని...ఒకసారి ఫోన్ ఇవ్వమని కోరుతుంది. అందులో ఉన్న వీడియో డిలీట్ చేస్తుంది. అక్కడ కేదార్ త్రిపాఠీ ఫోన్‌ను హ్యాక్ చేస్తాడు. జేడీ ఏం తెలియనట్లు ఫోన్ ఏంటి మొత్తం డెడ్ అయిపోయిందంటూ అతనికే ఆ ఫోన్ ఇచ్చేస్తుంది. ఫోన్ మొత్తం హ్యాక్ అవ్వడం చూసి అతను కంగారుపడిపోతాడు. జేడీ అతనికి తెలిసేలా చిన్న హెచ్చరిక ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తన ఫోన్‌ను అలా చేసినందుకు త్రిపాఠీ ఆగ్రహంతో ఊగిపోతాడు.
సురేశ్(Suresh) మాటలు తలచుకుని కౌషికి(Kowshiki) బాధపడిపోతూ ఉంటుంది. ఆమెకు ఇలా జరగడంపై పిన్ని చాలా సంతోషపడుతుంది. కాచీతో కలిసి అక్కడి వచ్చి ఆమెను అన్నం తినాలని బ్రతిమిలాడినట్లు నటిస్తారు. ముగ్గురూ కలిసి ఆమెకు సురేశ్‌పై లేనిపోని విషయాలు చెబుతారు. సురేశ్‌కు నీమీద నమ్మకం లేదని మాటలు ఎక్కిస్తారు. వెంటనే సురేశ్‌కు విడాకులు ఇవ్వాలని రెచ్చగొడతారు.
కౌషికి: నా లైఫ్‌లోకి సురేశ్ వచ్చినప్పటి నుంచి కాదు... ఆ దివ్యాంక వచ్చినప్పుడు నుంచే మేం సంతోషంగా లేం. ఆ రాక్షాసి మమ్మల్ని విడగొట్టాడనికి ప్రయత్నించింది. ఆ మ్యాట్రిమోనీ కుట్ర దివ్యాంకనే చేసిందని తేలితే అప్పుడు దివ్యాంగను జైళ్లో పెట్టిస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. దీంతో కాచీ,నిషి సహా ముగ్గురు భయపడిపోతారు. దివ్యాంకకు ఆ డిటైల్స్ ఇచ్చింది మనమేనని తెలిసిపోతుందని కంగారుపడిపోతారు. కానీ దివ్యాంకను పట్టుకోవడం అంత ఈజీ కాదని చెప్పి నిషి ధైర్యం చెబుతుంది.
త్రిపాఠీ ఇంత పనిచేస్తారని ఊహించలేదని కేదార్ జేడీతో చెబుతాడు. త్రిపాఠీ మీనన్‌తో చేతులు కలిపాడని జేడీ అనుమానిస్తుంది. త్రిపాఠీకి నామీద గెలవాలని కసి ఉందని అందుకే మీనన్‌తో కలిసి పోయి ఉంటాడని చెబుతుంది. నన్ను డైరెక్ట్‌గా ఎదుర్కొలేక మీనన్‌తో చేయి కలిపి ఉండొచ్చని అనుమానిస్తుంది. ఇదే నిజమైతే త్రిపాఠీని పక్కను పెట్టుకుని మనం రోజూ పనిచేయలేమని కేదార్ అంటాడు. అప్పుడు తమ కారును త్రిపాఠీ కారు వెంబడిస్తుందని జేడీ గమనిస్తుంది. కారును పక్కకు ఆపి చూస్తే వెనక కారులో త్రిపాఠీ ఫాలో అవుతున్నట్లు నిర్థారిస్తారు. ఖచ్చితంగా త్రిపాఠీ మీనన్‌కు అమ్ముడుపోయినట్లు నిర్థారించుకుంటారు. మళ్లీ కారు ముందుకు వెళ్లగా...వారి వెంటే త్రిపాఠీ అనుసరిస్తుండటంతో ఈ రోజు ఏపీసోడ్ ముగిసిపోతుంది.