Jagaddhatri Serial February 5th: పోలీస్ కేసు పెడతానంటున్న కౌషికి.. హత్య కేసులో ఇరుక్కున్న సుధాకర్!
Jagaddhatri Serial Today Episode: హత్య చేయకుండానే సుధాకర్ హత్య కేసులో ఇరుక్కోవడంతో కధలో కీలక మలుపులు ఏర్పడతాయి.
Jagaddhatri Serial Today Episode: ఎపిసోడ్ ప్రారంభంలో పెన్ డ్రైవ్ కనిపించక షాక్ అవుతుంది కౌషికి.
కౌషికి: పెన్ డ్రైవ్ ఇక్కడే పెట్టాను కనిపించడం లేదు అనటంతో కౌషికి, ధాత్రి, కేదార్ ముగ్గురు పెన్ డ్రైవ్ వెతుకుతారు, దొరకకపోవడంతో నా రూమ్ లోకి వచ్చి ఎవరు పెన్ డ్రైవ్ తీస్తారు అని కోపంతో ఊగిపోతుంది.
ధాత్రి: ఇంకెవరు ఆ దివ్యంకయే ఈ పని చేసి ఉంటుంది. మన ఇంట్లో వాళ్ళు సపోర్ట్ ఇవ్వబట్టే తను ఇంతకు తెగించింది అంటుంది.
కౌషికి : ఇప్పుడే వాళ్ళ పని చెప్తాను అంటూ హాల్లోకి వచ్చి అందర్నీ పిలుస్తుంది. హాల్లోకి కుటుంబ సభ్యులందరూ రావడంతో నా పెన్ డ్రైవ్ కనిపించడం లేదు అని చెప్తుంది.
నిషిక: కనిపించకపోతే వెతుక్కోండి దొరుకుతుంది అంతేగాని కనిపించడం లేదు అంటే అది ఏమైనా ఎగురుకుంటూ మీ దగ్గరికి వచ్చేస్తుందా అని వెటకారంగా అంటుంది. కానీ కౌషికి కోపంగా చూడటంతో ఏదో జోక్ గా అన్నాను అంటుంది.
కౌషికి : ఇది జోక్ చేసే సమయం కాదు ఆఫీస్ కి సంబంధించిన విషయం ఆ పెన్ డ్రైవ్ తీస్తే ఇచ్చేయ్ అని అడుగుతుంది.
నిషిక : అంటే ఏంటి ఆ పెన్డ్రైవ్ నేను తీశాననా అని కోపంగా అడుగుతుంది.
వైజయంతి : ఇంటి కోడలు మీద దొంగతనం అంటగడతావేంటమ్మి అది మంచి పద్ధతి కాదు అంటుంది.
ధాత్రి దంపతులు నిషిక ని విడిగా బయటకు తీసుకువెళ్తారు.
ధాత్రి : పెన్ డ్రైవ్ తో జోకులు వేయకు పెన్ డ్రైవ్ తీస్తే ఇచ్చేయ్. ఆ దివ్యాంక వదిన మీద కోపంతో నిన్ను పనిలో పెట్టుకుంది. రేపటి రోజున ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యలోకి నిన్ను నెట్టేస్తుంది అర్థం చేసుకో అంటుంది.
నిషిక : నేనెందుకు తీస్తాను నాకేం అవసరం, అయినా దివ్యాంకని మధ్యలో తీసుకురావద్దు అని పొగరుగా సమాధానం చెప్తుంది.
ధాత్రి: అయితే ఈ విషయం పోలీసుల వరకు వెళుతుంది తర్వాత నేను కూడా ఏమి చేయలేను అంటుంది.
మరోవైపు సుధాకర్ మినిస్టర్ ఇంటికి వెళ్తాడు. పెన్ డ్రైవ్ మినిస్టర్ చేతిలో పెట్టి నా జోలికి నా ఫ్యామిలీ జోలికి రావద్దు అని చెప్తాడు.
మినిస్టర్: ఉండు నువ్వు తెచ్చిన సాక్ష్యం నేను చెక్ చేసుకోవాలి కదా అని కొడుక్కి ఇచ్చి ప్లే చేయమని చెప్తాడు. అయితే అందులో సినిమా వస్తుంది అది చూసి మినిస్టర్, సుధాకర్ ఇద్దరు షాక్ అవుతారు.
మినిస్టర్ : కోపంతో కేకలు వేస్తాడు. మర్యాదగా సాక్ష్యాన్ని తీసుకు వస్తే సరే సరి లేదంటే నీ కొడుకుని చంపేస్తాను అంటాడు.
సుధాకర్: కోపంగా మినిస్టర్ పీక మీద కత్తి పెట్టి నేను నీ దగ్గరికి భయపడి రాలేదు, సమస్యని సామరస్యంగా పరిష్కరించుకుందామని వచ్చాను. అంతేగాని నా కుటుంబం జోలికి వస్తానంటే చూస్తూ ఊరుకోను. నిజంగా ఇదే కౌషికి దగ్గర ఉన్న సాక్ష్యం. నువ్వు నమ్మితే నమ్ము లేకపోతే నేనేమీ చేయలేను అని బెదిరించి వెళ్ళిపోతాడు.
మరోవైపు కౌషికి పోలీస్ కంప్లైంట్ ఇవ్వటానికి పోలీస్ స్టేషన్ కి వెళ్దాం అనుకుంటుంది.
ధాత్రి: అప్పుడే పోలీసుల వరకు ఎందుకు వదిన పోలీసులకు తెలిసిందంటే సాక్ష్యం మన దగ్గర లేదు అని అందరికీ తెలిసిపోతుంది అంటుంది.
కౌషికి: పోలీస్ కంప్లైంట్ ఇవ్వకపోతే నేను నిజంగానే ఆ సాక్ష్యాన్ని అమ్ముకున్నాను అనుకుంటారు అంటుంది.
కేదార్: సుధాకర్ గారు ఏరి చాలాసేపటి నుంచి ఆయన ఇంట్లో కనిపించడం లేదు అంటాడు.
అప్పుడే బయట నుంచి వస్తున్న సుధాకర్ ని ఎక్కడికి వెళ్లారు బాబాయ్ అని అడుగుతుంది కౌషికి.
సుధాకర్: మినిస్టర్ ఇంటికి పెన్ డ్రైవ్ ఇవ్వటానికి వెళ్ళాను అంటాడు.
కౌషికి: ఎంత పని చేశారు బాబాయ్,ఇది సురేష్ ప్రాణాలు తెగించి స్ట్రింగ్ ఆపరేషన్ చేసిన ఎవిడెన్స్ అని బాధగా సుధాకర్ తో చెప్తుంది.
అయితే సుధాకర్ ఆ పెన్ డ్రైవ్ లో సాక్షాలు ఏమీ లేవని ఏదో సినిమా వస్తుందని చెప్పడంతో ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు. ఎక్కడో తేడా జరిగింది అనుకుంటారు.
ఆ తర్వాత ఇంటికి పోలీసులు వచ్చి సుధాకర్ మినిస్టర్ ని చంపేశాడు అందుకే అరెస్టు చేస్తున్నాం అని చెప్పడంతో ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు.
సుధాకర్: నేను మినిస్టర్ ఇంటికి వెళ్లిన మాట నిజమే కానీ అతనిని చంపలేదు అంటాడు.
పోలీస్: మినిస్టర్ ఒంటిమీద, ఆ కత్తి మీద మీ వేలిముద్రలు ఉన్నాయి. మేం ఆధారాలతోనే వచ్చాము అంటాడు.
కౌషికి, యువరాజ్ ఇద్దరు మేము తీసుకొని వస్తాము మీరు వెళ్ళండి అని పోలీసులకు చెప్తారు. కానీ పోలీసులు అలా కుదరదు అని చెప్తాడు. అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.