Jagadhatri Serial Today September 26th: జగద్ధాత్రి సీరియల్: కౌషికి భర్తని చెట్టుకి కట్టి కొట్టిన ఊరి పెద్దలు! అమ్మాయి జీవితం నాశనం చేశాడా!
Jagadhatri Serial Today Episode September 26th కౌషికి భర్త ఓ అమ్మాయి జీవితం నాశనం చేశాడని ఊరి పెద్దలు సురేశ్‌ని చెట్టుకి కట్టి కొట్టడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Jagadhatri Serial Today Episode కౌషికి ప్రశాంత్‌తో డీల్ చేసుకొని జగద్ధాత్రితో సాక్షి సంతకం పెట్టిస్తుంది. అడ్వాన్స్ డబ్బు కూడా ఇస్తారు. కౌషికి ఆ డబ్బుని జగద్ధాత్రికి ఇచ్చి దాచమని చెప్తుంది. నిషిక కౌషికితో వదిన మీరు చేసింది ఏం బాలేదు.. మీ తమ్ముడిని గదిలో పెట్టి బంధించారు. నేను ఇక్కడే ఉన్నా సంతకం పెట్టడానికి కూడా పనికిరానిదానిలా పక్కన పడేశారు.. నా భర్త తప్పు చేస్తే నన్ను తప్పుడు దానిలానే చూస్తున్నారు.. ఈ ఇంట్లో నేను ఓ వేస్ట్ పీస్ అనే కదా మీరు అనుకుంటున్నారు అని అడుగుతుంది.
కౌషికి స్టాపిట్ నిషిక అని అరుస్తుంది. సాక్షి సంతకాలు చేసే లక్షణాలు నీలో ఒక్కటి లేవు నీతో ఎలా సంతకం పెట్టించాలి అని కౌషికి అడుగుతుంది. నాకు అలాంటి లక్షణాలు లేవా ఏం లేవు అని నిషి అడుగుతుంది. స్నాక్స్ తీసుకురమ్మని చెప్తేనే కోపంగా చూశావ్.. నీకు మన అని లేదు.. నేను గమనించలేదు అని అనుకున్నావా.. ముఖ్యంగా డబ్బు మీద ఆశ లేని వారు అయి ఉండాలి.. ఆ లక్షణాలు అన్నీ జగద్ధాత్రికి ఉన్నాయి అని కౌషికి అంటుంది. ఎంత మాట అన్నావ్ వదినా అని నిషి అంటే ఇంకా వినాలని అనుకుంటున్నావా జీర్ణించుకోలేవు అంటే.. నాకు నేను కష్టపడి బిల్డ్ చేసుకున్న బిజినెస్ ముఖ్యం అని కౌషికి అంటుంది. నన్ను ఇంత హీనంగా మాట్లాడుతారా.. ఇక చాలా నాకు పౌరుషం ఉంది నాదేమీ గతిలేని బతుకు కాదు అని కోపంగా వెళ్లిపోతుంది. నువ్వేం పట్టించుకోకు అని వైజయంతి అంటే నేను పట్టించుకుంటే వాళ్లు ఈ ఇంట్లో ఉండరు అని కౌషికి అంటుంది.
నిషిక ఆవేశంగా వెళ్లి బట్టల బ్యాగ్ సర్దేస్తుంది. ఏమైందని యువరాజ్ అంటే ఘోరంగా అవమానించారని.. కేథార్‌ని తమ్ముడు అని జగద్ధాత్రిని మరదలు అని పరిచయం చేశారు. జగద్ధాత్రితో సాక్షి సంతకం పెట్టించిందని.. నేనేం గతిలేని దాన్ని కాదు కదా పోతా అని నిషిక అంటుంది. వైజయంతి వచ్చి తొందర పడొద్దని చెప్తుంది. టైం వచ్చేవరకు మనకు తప్పదమ్మా అని అంటుంది. యువరాజ్ కూడా నిషికతో నువ్వు వెళ్లిపోతే లేని పోని సమస్యలు వస్తాయి.. ఈ ఆస్తికి నేనే కాదు కేథార్ కూడా వారసుడు.. నువ్వే ఏమైనా తేడా చేస్తా ఆస్తి మొత్తం వాడికి వెళ్లిపోతుంది నువ్వు ఓపిక పడితే మొత్తం మన లాగేయొచ్చు అని తల్లీకొడుకులు నిషికతో చెప్తారు. నిషిక సరే అంటుంది.
జగద్ధాత్రి, కేథార్ కౌషికి దగ్గరకు వెళ్లి తమ్ముడు, మరదలు అని చెప్పినందుకు థ్యాంక్స్ అని చెప్తారు. మనసులో ఉన్నదే చెప్పానని కౌషికి అంటుంది. నిషికకు నేను అంటే చాలా కోపం పైగా ఇప్పుడు మీరు సంతకం పెట్టించారు.. నిషితో సంతకం పెట్టించుంటే బాగుండేది అని జగద్ధాత్రి అంటే.. సాక్షి సంతకం చాలా ముఖ్యం.. సంతకం చేసిన వారికి డబ్బు ఆశ ఉండి డబ్బుకి లొంగిపోతే కోట్లలో నష్టం వస్తుంది. నిషిక వాళ్లు డబ్బుకోసం ఎంత కైనా దిగజారిపోతారు అందుకే నీతో సంతకం పెట్టించాను అని అంటుంది. ఇంతలో కౌషికికి ప్రతాప్ కాల్ చేసి ఊరు చివరకు రమ్మని చెప్తాడు. ఏమైందని అడిగితే సురేశ్ సార్‌ని ఊరి చివరి బస్తీ వాళ్లు కట్టేసి కొడుతున్నారని చెప్తాడు.
కౌషికి, జగద్ధాత్రి, కేథార్‌లకు విషయం చెప్పి తీసుకెళ్తుంది. సురేశ్‌ని ఓ ఆడపిల్ల మీద అఘాయిత్యం చేశారని ఊరు పెద్దల సమక్షంలో కొడుతుంటారు. ఆ అమ్మాయి వాడి చేతులు కాళ్లు విరిచేయండి అని చెప్పి ఏడుస్తుంది. సురేశ్‌ని కొడుతుంటే కౌషికి కొరడా పట్టుకొని లాగి ఏమైందని అడుతుంది. నువ్వు ఏమవుతావ్ అని ఊరి పెద్ద అడిగితే అతను నా భర్త అని కౌషికి అంటుంది. అమ్మాయిని చూపించి పాడు చేయాలని చూశాడని చెప్తారు. ఇక్కడ నుంచి వీడిని ఎవరూ కాపాడలేరు అని ఊరి పెద్ద అంటే చట్టం మీ చేతుల్లోకి ఎలా తీసుకుంటారని జగద్ధాత్రి అడుగుతుంది. నేనేం చేయలేదు అని సురేశ్ అంటాడు. నా భర్త అలాంటి వాడు కాదు అని కౌషికి అంటే వాడు నీచుడు నాలాంటి ఎంతో మంది అమ్మాయిల జీవితం నాశనం చేశాడు పశువులా మీద పడిపోయాడని అంటుంది.
నా భర్త అలాంటి వాడు కాదని కౌషికి అంటుంది. ఆ అమ్మాయి ఊరి పెద్దతో సురేశ్‌ని కొట్టి చంపేయమని అంటుంది. సురేశ్‌ని కొట్టడానికి రెడీ అయితే కౌషికి కర్ర పట్టుకొని నా భర్త మీద ఇంకొక్క దెబ్బ పడినా నన్ను మనిషిలా చూడరు.. ఒక్కొక్కరి కాళ్లు విరిచేస్తా అని అని చెప్పి కేథార్‌కి కట్లు విప్పమని అంటుంది. కేథార్ కట్టు విప్పుతాడు. ఊరి పెద్ద తప్పు చేసిన వాళ్లు తప్పించుకుంటే ఊరుకుంటామా మన గౌరిని నాశనం చేసినవాడిని వదలొద్దు అందర్ని చంపేయండి అని అంటే అందరూ కొట్టడానికి వెళ్తారు. జగద్ధాత్రి ఓ వైపు కర్ర పట్టుకుంటే కేథార్ మరో వ్యక్తి కర్ర పట్టుకుంటాడు. జగద్ధాత్రి చీర నడుంకి బిగించి రఫ్ఫాడిస్తుంది. కేథార్ కూడా చితక్కొడతాడు. సురేశ్‌ని విడిపిస్తారు. ఊరిపెద్ద సురేశ్‌ని చెట్టుకి కట్టి కొట్టిన వీడియోలు.. గౌరీ ఏడుపు అన్నీ వీడియోలు సోషల్ మీడియాలో పెట్టమని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















