Nindu Manasulu Serial Today September 26th: నిండు మనసులు: ఆస్తి అమ్మాలనుకున్న గణకి మైండ్‌బ్లాంక్! ప్రేరణ గణకి సాయం చేస్తుందా!
Nindu Manasulu Serial Today Episode September 26th గణ ఆస్తి అమ్మడానికి ప్రేరణ సంతకం కూడా తీసుకోవాలని ప్రేరణని ఇంటికి పిలవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nindu Manasulu Serial Today Episode గణ 50 లక్షలు కోసం తన తండ్రి తన కోసం కొన్న ఆస్తి అమ్మేయాలని అనుకుంటాడు. అందుకు ఫ్యామిలీ లాయర్ దగ్గరకు సుధాకర్‌తో కలిసి వస్తాడు. డాక్యుమెంట్స్ లాయర్ దగ్గర ఉన్నాయి సుధా అందుకే ఆయనతో మాట్లాడి ప్రొపర్టీ అమ్మేసి కమిషనర్‌కి 50 లక్షలు ఇచ్చి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలి అని అంటాడు.
లాయర్ రావడంతో గణ తన తండ్రి కొన్న ఆస్తి అమ్మాలని అనుకున్నట్లు చెప్తాడు. దానికి లాయర్ ఆ ఆస్తి రాజశేఖరం గారు మీ పేరుతో పాటు ప్రేరణ పేరు మీద కూడా కొన్నట్లు రిజిస్టర్ చేయించారు. మీ ఇద్దరూ కలిసి సంతకాలు పెడితేనే అమ్మడానికి కుదురుతుందని చెప్తారు. గణ బిత్తరపోతాడు. సుధాకర్ మాత్రం తిక్క కుదిరింది వెదవకి అని మనసులో అనుకుంటాడు. ప్రేరణ ఎవరు ఆ పేరుకి మాకు ఏంటి సంబంధం అని గణ అంటే మీ నాన్న అలా చేశారు అది మీ నాన్నకి అడిగి తెలుసుకోండి అని అంటాడు. గణ డాక్యుమెంట్స్ పట్టుకొని ఆవేశంగా అక్కడి నుంచి వచ్చేస్తాడు. గణ వెనకాలే సుధాకర్ గెంతులేస్తాడు. సార్ దరిద్రం మీతో బ్రేక్ డాన్స్ చేస్తుంది సార్ అని సుధాకర్ అంటాడు. మంట ఎక్కించుకు సుధా అని గణ అరుస్తాడు. సుధా వెనకాలే నీకు ఇలాగే జరగాలిరా లేదంటే ఆడపిల్ల మీద నీ ప్రతాపమా అని అనుకుంటాడు.
గణ కోపంగా తండ్రి దగ్గరకు వెళ్లి బుద్ధి బుర్రా లేదు అని నోటి కొచ్చినట్లు తిడతాడు. నువ్వు నాన్నవి కాదు దొంగ నాన్నవి.. ఆఫీస్ పేరు చెప్పి అక్రమ సంబంధం పెట్టుకున్నావ్.. వారానికి రెండు రోజులు వెళ్లి ఆ దరిద్రం బిల్డ్ చేశావ్.. అక్కడితో ఆగాలి కదా.. వెనక ముందు ఆలోచించాలి కదా.. ఇక్కడ మా అమ్మ అంటూ ఒకర్తి ఏడ్చింది.. నేను అంటూ ఒకడ్ని చచ్చాను.. కళ్లు మూసుకుపోయి ఇద్దరు పిల్లల్ని కన్నావ్.. అంతటితో ఆగావా.. వాళ్లకి మా ఆస్తిలో వాటా ఇచ్చావ్.. అది ఇప్పటికే నువ్వు వాళ్ల నాన్న అంటూ నన్ను టార్చర్ చేస్తుంది. నేను దాన్ని ఎలా మా జీవితాల నుంచి తప్పించాలా అని నానా యాగీ చేస్తుంటే ఇప్పుడు వాళ్లు నేను సమానం అని చేశావ్ దిక్కుమాలినోడా.. నిన్ను నాన్న అని చెప్పుకోవాలి అంటే అసహ్యం వేస్తుంది అని అంటాడు.
ఇంతలో ఈశ్వరి వచ్చి మీనాన్నని ఎందుకు అలా తిడుతున్నావ్రా ఏమైంది అని అడిగితే శ్రీశ్రీశ్రీ పంతం రాజశేఖర్ గారు సిటీ అవుట్ కట్స్‌లో ఉన్నా ఆస్తిని నా పేరుతో పాటు ఆ ప్రేరణ పేరు రాశారు అని చెప్తాడు. ఈశ్వరి షాక్ అయిపోతుంది. అంత డబ్బుతో నీకు ఏంటి అవసరం.. ఆస్తి అమ్మడం ఏంటి అని ఈశ్వరి అడిగితే అది పాయింట్ కాదు కానీ సగం దాని పేరు మీద రాశారు అది ఆలోచించు అని అరుస్తాడు. కోపంగా బయటకు వెళ్లిపోతాడు. ఏం చేస్తారు సార్ ఇప్పుడు అని సుధాకర్ అడిగితే అదే ఆలోచిస్తున్నా అని ఓ ఐడియా వచ్చింది అని ప్రేరణకి కాల్ చేసి రేపు శనివారం కదా.. ఇంటికి వస్తున్నావా అని అడుగుతాడు. మా నాన్నని చూడటానికి రా అని పిలుస్తాడు. ప్రేరణ విసురుగా మాట్లాడుతుంది. నువ్వు చెప్పడం ఏంటి అక్కడుంది మా నాన్న నేను కచ్చితంగా వస్తాను అని అంటుంది.
సుధాకర్ ఇంటికి వెళ్లిపోతా అని అంటే గణ వద్దని నా పక్కనే ఉండు అంటాడు. బీపీ ట్యాబ్లెట్ వేసుకోకపోతే మీరు అవుతున్నట్లు నేను అవుతా అని అంటాడు. ఎంత కోపం వచ్చినా పర్లేదు ఇక్కడే ఉండు అని గణ అంటాడు. ఇక ఉదయం సిద్ధూ ప్రేరణని పిక్ చేసుకోవడానికి వస్తాడు. ఇద్దరూ మాట్లాడుకుంటారు. గణ నా మీద కంటే మీ మీదే ఎక్కువ కోపం పెంచుకున్నాడు. మీ మీద కోపంతోనే ఇదంతా చేశాడని అనిపిస్తుందని సిద్ధూ అంటాడు. గొప్ప విషయమే కనిపెట్టావులే అని ప్రేరణ టాపిక్ మార్చేస్తుంది. నన్ను ఓ చోట డ్రాప్ చేసి నువ్వు పది నిమిషాలు వెయిట్ చేయ్ అని ప్రేరణ అంటుంది. ఏంటి పని అని సిద్ధూ అడిగితే చెప్తే కానీ డ్రాప్ చేయవా అని అంటుంది. చేస్తా చేస్తా అని అంటాడు.
ప్రేరణ సిద్ధూతో నీకు విజయానంద్‌కి ఏంటి సంబంధం అని అంటుంది. అది అంత అవసరలేని టాపిక్‌లే అని సిద్ధూ చెప్పడు. సిద్ధూ గణ ఇంటి దగ్గర ప్రేరణని డ్రాప్ చేసి బయట వెయిట్ చేస్తాడు. గణ ప్రేరణ కోసం వెయిట్ చేస్తుంటాడు. సుధాకర్ రాజశేఖరాన్ని తీసుకొని బయటకు వస్తాడు. అది వస్తుందా సుధా అని గణ అడుగుతాడు. నాకు తెలీదు సార్ అని సుధాకర్ అంటే వస్తుంది సుధా అది మాట మీద నిలబడే మనిషి అని అంటాడు. కరెక్ట్‌గా చెప్పావ్ అని ప్రేరణ ఎంట్రీ ఇస్తుంది. ప్రేరణని చూసి గణ షాక్ అయి నిల్చొంటే అంత మర్యాద అవసరం లేదు అని ప్రేరణ అంటుంది. సుధాకర్ మనసులో దెబ్బ మీద దెబ్బ అని అనుకుంటాడు. గణ ప్రేరణని కూర్చొమని అంటాడు. ఇంత మర్యాద ఏంటో ముందు విషయం చెప్పు నేను మా నాన్నతో మాట్లాడాలి అని ప్రేరణ అంటుంది. గణ డాక్యుమెంట్స్ ప్రేరణకి ఇచ్చి సంతకం పెట్టమని అంటాడు. సంతకం ఎందుకు అని ప్రేరణ అడిగితే సంతకం పెడితే నీకు లాభమే ఉంటుందిలే. అక్కడ గుడ్లు తేలేసి చూస్తున్నాడే మా నాన్న రాజశేఖరం గారు ఓ పనికి మాలిని పని చేశాడు.. ప్రేరణ గారు నాకు డబ్బు అవసరం నా ఆస్తి అమ్మాలి అనుకుంటున్నా.. ఆది మా నాన్న నా పేరున కొన్నాడు. అందులో నాతో కలిపి నీ పేరు కూడా చేర్చాడు అని గణ చెప్తాడు. ప్రేరణ షాక్ అయిపోతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















