Chinni Serial Today September 26th: చిన్ని సీరియల్: మ్యాడీ ప్రేమలో విషాదం! నాగవల్లి కుట్రలు, లోహితకు ముప్పు, మధు ఏం చేయనుంది?
Chinni Serial Today Episode September 26th మ్యాడీ తన లవ్ గురించి మధుతో చెప్పి ఏడ్వటం మధు మహిని ఓదార్చడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode పెయింటర్ మ్యాడీ చెప్పినట్లు చిన్ని ఫొటో చూసి మధు బొమ్మ గీస్తాడు. ఇంతలో లోహిత మధు పెయింటింగ్ మ్యాడీ చూడకూడదు అని పెయింటింగ్ మీద రంగు నీరు చల్లించేస్తుంది. పెయింటింగ్ పోవడంతో మ్యాడీ పిచ్చెక్కిపోతాడు. అన్నీ విసిరి కొడతాడు.
ఆ ముఖం నేను చూడాలి.. ప్లీజ్ బ్రో మరోసారి గీయవా అని అంటే దానికి పెయింటర్ ఒకసారి గీసేస్తే మళ్లీ అలా రాదు బ్రో అని చెప్తాడు. మహి ఏడుస్తూ మీరు నాకు సాయం చేయాలి అని వచ్చారు బ్రో కానీ నేనే బ్యాడ్‌లక్‌ని నా లైఫ్ ఇంతే అని చిన్న పిల్లాడిలా ఏడుస్తాడు. పోయిన ఆ పెయింటింగ్ కవరు పట్టుకొని వెళ్లిపోతాడు. మ్యాడీ అంటూ మధు వెనకాలే వెళ్తుంది.
మరోవైపు సరళ ఇంటికి ఓ రౌడీ వచ్చి సరళ చూడకుండా మొత్తం వీడియో తీస్తాడు. తర్వాత నాగవల్లికి ఫోన్ చేసి వాళ్లని ఫాలో అవుతున్నా అని వాళ్లిద్దరితో పాటు ఓ అమ్మాయి కూడా ఉందని కాలేజ్‌కి వెళ్లిన లోహిత గురించి చెప్తుంది. నాగవల్లి మనసులో అమ్మాయి అంటే ఆ చిన్నీనేనా.. వీళ్లంతా ఒక్క చోట ఉన్నారా అని అనుకుంటుంది. వాళ్ల ఫొటోలు పంపమని అంటుంది. రౌడీ పంపుతాడు. ఫొటోలు క్లారిటీ లేవని నాగవల్లి తిట్టి ఈ సారి ఫొటోలు క్లారిటీ లేకపోతే నిన్ను చంపేస్తా అని అంటుంది. చిన్ని ఎక్కడో నీకు నూకలు ఉండిపోయావే నిన్ను నీ తండ్రిని బతకనివ్వనే అని అనుకుంటుంది.
లోహిత మనిషి పెయింటర్‌కి కాల్ చేసి నా దగ్గర నుంచి తప్పించుకున్నవాడివి నీకు ఎందుకురా హెల్పింగ్ నేచర్.. నీ చెల్లి వరంగల్‌లో చదువుతుంది కదా నీకు అది ప్రాణం కదా నువ్వు ఇలాంటివి సాయాలు చేస్తే నీ చెల్లిని చంపేస్తా.. ఇప్పుడే ఊరు వదిలి వెళ్లిపో లేదంటే నీ చెల్లిని చంపేస్తా అనడంతో పెయింటర్ వెళ్లిపోతా అని అంటాడు.
మినిస్టర్ కాల్ కోసం నాగవల్లి వెయిట్ చేస్తుంటుంది. ఇంతలో మినిస్టర్ కాల్ చేస్తాడు. నైట్ డిన్నర్‌కి వస్తామని మా అమ్మాయి వరుణ్‌ని చూడాలి అనుకుంటుందని చెప్తారు. దేవాతో కూడా మాట్లాడి ఈ సంతోషం ఇలా ఫోన్‌లో కాదు డైరెక్ట్‌గా మాట్లాడాలి వస్తున్నాఅని అంటాడు. వసంత దేవా, వల్లి మాటలు విని ఎమోషనల్ అయిపోతుంది. నాగవల్లిని హగ్ చేసుకొని ఆడపడుచులు అంటే మండి పడే ఈ రోజుల్లో నువ్వు మాత్రం నన్ను నాకుటుంబాన్ని చూసుకుంటున్నావ్.. ఏం లేని నా కూతుర్ని నీ ఇంటి కోడల్ని చేసుకోవాలి అనుకున్నావ్.. వరుణ్‌కి ఇంత గొప్ప సంబంధం తీసుకొచ్చావని అంటుంది. మ్యాడీలాగే శ్రేయ, వరుణ్ ఇద్దరూ నా పిల్లలే..వరుణ్ పెళ్లి ఈ రాజమండ్రిలో ఎవరూ చేయలేని అంత గ్రాండ్‌గా చేద్దాం అని అంటుంది.
మ్యాడీ ఏడుస్తూ పెయింటింగ్ పట్టుకొని ఏడుస్తాడు. మధు వాళ్లు మ్యాడీ వెనకాలే వెళ్లి ఏమైంది మ్యాడీ ఎందుకు అలా ఏడుస్తున్నావ్ అని అడుగుతుంది. ఏం చెప్పను మధు తన కోసం పదేళ్లుగా వెయిట్ చేస్తున్నా అని చెప్పనా.. ఎన్ని సార్లు ఏడ్చానో చెప్పనా.. ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించాను అని చెప్పనా అని ఏడుస్తాడు. మధు కూడా చాలా బాధ పడుతుంది. అవును మధు నేను ఒకమ్మాయిని ప్రేమిస్తున్నాను.. తన కోసం నా గుండెల్లో ఓ పెద్ద గుడే కట్టాను.. కానీ ఇప్పటికీ తను నాకు కనిపించలేదు.. ఈసారి తను కచ్చితంగా దొరుకుతుంది. నా హార్ట్ ఈ పెయిన్ తట్టుకోలేకపోతుంది మధు తను దొరకదు అని ఆ గుండె ఆగిపోతుందని అనిపిస్తుందని మధు.. తను నాకు కనిపిస్తుందో లేక నేను ఓ అన్‌లక్కీ ఫెలో అని ఫ్రూవ్ చేసి దూరం అయిపోతుందో అని భయంగా ఉందని ఏడుస్తాడు.
మధు మ్యాడీకి ధైర్యం చెప్తుంది. నువ్వు తనని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావ్ అని తెలుస్తుంది. నిజమైన ప్రేమని ఆ దేవుడు ఎప్పుడూ ఓడిపోనివ్వడు తను నీ కోసం కచ్చితంగా వస్తుంది, నీ ప్రేమని గెలిపిస్తుందని మ్యాడీ కన్నీరు తుడుస్తుంది. మ్యాడీకి నీరు తాగించి ఏంటి మ్యాడీ ఒకమ్మాయిని ఇంతలా ప్రేమిస్తున్నావా అని మనసులో అనుకుంటుంది. మ్యాడీకి పొలమారితే మధు మ్యాడీ తల నిమిరి మ్యాడీని నవ్విస్తుంది. నవ్వుతూ ఉండు మ్యాడీ నీ లైఫ్ కూడా బాగుంటుందని అంటుంది. మ్యాడీ వెళ్లిపోయిన తర్వాత మధు ఏడుస్తుంది. మ్యాడీకి నీ ప్రేమ చెప్పవే అంటే మ్యాడీ ప్రేమ గెలిస్తే నా ప్రేమ గెలిచినట్లే మ్యాడీ ఎక్కడున్నా ఎవరితో ఉన్నా హ్యాపీగా ఉంటే నాకు అది చాలు అని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















