అన్వేషించండి

Jagadhatri Serial Today May 22th:నిషికను అడ్డుపెట్టుకుని కౌషికి మీద గెలవాలని దివ్యాంక ప్లాన్‌...పోలీసులతో వచ్చిఅడ్డుకున్న జగధాత్రి

Jagadhatri Serial Today Episode May21th: ప్రాజెక్ట్‌ లీడ్‌గా యువరాజును నియమించడానికి కౌషికి ఒప్పుకోకపోవడంతో...వైజయంతి బయటకు వెళ్లిపోతుంది. వీరికి దివ్యాంక తోడవ్వడంతో ఈరోజు ఏపిసోడు ఆసక్తిగా మారింది.

Jagadhatri Serial Today Episode: బుల్లితెర ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటున్న జగధాత్రి సీరియల్‌ ఇవాళ మరింత ట్విస్ట్‌లతో అదిరిపోయింది. కౌషికిని దారిలోకి తెచ్చుకోవాలని కొడుకు,కోడలిని తీసుకుని ఇంట్లో నుంచి వెళ్లిపోయిన వైజయంతి దివ్యాంకతో చేతులు కలపగా....జగధాత్రి వాళ్ల ఎత్తులను చిత్తులు చేయడంతో ఈరోజు( మే 22‌) ఏపీసోడ్ ఎంతో ఆసక్తికరంగా మారుతుంది.

యువరాజును ప్రాజెక్ట్‌ లీడ్‌గా నియమించడం కుదరదన్న కౌషికి 

యువరాజును ప్రాజెక్ట్‌ లీడ్‌గా పెట్టడానికి కౌషికి చాలా ట్రై చేస్తుంది.కానీ ఒక్కసారి కూడా కంపెనీ ముఖం చూడని యువరాజును లీడ్‌గా పెట్టాలంటే బోర్డు డైరెక్టర్లు ఒప్పుకోరని సుధాకర్‌తో చర్చిస్తుంది.అయినా వాడి ఆవేశం,తెలివిలేనితనం చూస్తే ఎవ్వరూ ఇందుకు అంగీకరించరని అంటుంది.కానీ వీళ్లేమో ఇలా గొడవ చేస్తున్నారని బాధపడుతుంది. సుధాకర్‌  ఆమెకు సర్దిచెబుతాడు.వాళ్లు ఎప్పుడూ గొడవ చేస్తూనే ఉంటారని..నువ్వు మాత్రం కంపెనీకి ఏది మంచిది అయితే అదే నిర్ణయం తీసుకోమని చెబుతాడు.ఇంతలో కంపెనీలో పనిచేసే రావుగారి సలహా తీసుకోవడానికి ఆయనకు కౌషికి ఫోన్ చేస్తుంది.  అక్కడికి వచ్చిన వైజయంతి ఏం అంటున్నారని అడగ్గా....యువరాజును ప్రాజెక్ట్‌ లీడ్‌గా పెడితే చాలామంది డైరెక్టర్లు వ్యతిరేకించే అవకాశం ఉందని అంటున్నారని కాబట్టి యువరాజును లీడ్‌గా చేయడం కుదరదని చెబుతుంది.మన కంపెనీలో మన ఇంట్లో వాళ్లను నియమించాలంటే ఎవరిని అడగాలని వైజయంతి అంటుంది. మన ఇష్టం వచ్చినట్లు మనం చేస్తామంటే....కంపెనీలో పెట్టుబడులు పెట్టిన  వారంతా చూస్తూ ఊరుకోరని సుధాకర్‌ అంటాడు. మాకు అర్థమైందని మీరు ఎప్పుటికీ నా కొడుకుని కంపెనీకి సీఈవోని చేయరని వైజయంతి ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాళ్లను తీసుకుని వెళ్లిపోతుంది.

జగధాత్రి, కేదార్‌ను అసహ్యించుకున్న సుధాకర్‌

అప్పుడే బయట నుంచి ఇంట్లోకి వచ్చిన కేదార్‌,జగధాత్రి...హాలులో సుధాకర్‌ ఒక్కడే ఉండటం చూసి దగ్గరకు వెళ్తారు.అందరూ ఏమైపోయారని అడిగినా సుధాకర్‌ మాత్రం సమాధానం చెప్పడు. నాన్నకు అన్నం పెడతానంటూ కేదార్ ప్లేట్‌లో అన్నం తీసుుకుని రాగా....సుధాకర్ ప్లేట్‌ విసిరేస్తాడు.మీ నాటకాలన్నీ ఆపండని అంటాడు. ఆస్తి కోసం కడుపులో ఉన్న బిడ్డను కూడా చంపడానికి వెనకాడని మనుషులు మీరని అంటాడు. మర్యాదగా నా చుట్టుపక్కల నుంచి వెళ్లిపోండని హెచ్చరిస్తాడు.మీ ముఖాలు చూడాలంటేనే నాకు అసహ్యం వేస్తోందని అంటాడు.నా భార్య,కొడుకు,కోడలు చెప్పినా వినకుండా మిమ్మల్ని వెనకేసుకుని వచ్చినందుకు బాగా బుద్ధి చెప్పారని అంటాడు.జగధాత్రి సుధాకర్‌కు సర్దిచెప్పాలని చూసినా వినకపోవడంతో బాధపడుతూ లోపలికి వెళ్లిపోతుంది.

కౌషికిని ఇప్పుడు కాకపోతే ఇంకెప్పటికీ మనం దారిలోకి తెచ్చుకోలేమని...కాబట్టి నేను చెప్పినట్లు చేయమని యువరాజు, నిషికతో బట్టలు సర్దించుకుని వైజయంతి బయటకు వెళ్లిపోతుంది. వాళ్లకు నచ్చజెప్పడానికి వాళ్ల రూమ్‌కు వచ్చిన  కౌషికికి అక్కడి వైజయంతి రాసిన లెటర్ కనిపిస్తుంది. నా కొడుకుకి  అవమానం జరిగే చోట ఉండలేక  వెళ్లిపోతున్నామని రాసి ఉంటుంది.అది తీసుకుని కౌషికి పరుగులు పెట్టుకుంటూ కేదార్‌,జగధాత్రి వాళ్ల వద్దకు వెళ్తుంది. అత్తయ్య ఇలాంటి పనిచేస్తుందని ఊహించలేదని జగధాత్రి అంటుంది.ఈ విషయం మామయ్యకు తెలిస్తే  చాలా బాధపడతారని...మనమే వెళ్లి వాళ్లను తీసుకుని వద్దామని చెప్పి బయలుదేరతారు.

వైజయంతి వేసిన ప్లాన్‌ ఏంటి..?

రోడ్డుపైన నడుచుకుంటూ వెళ్తూ యువరాజు తల్లిపై చిరాకుపడతాడు.  ఇంట్లో నుంచి బయటకు తీసుకొచ్చి ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావని అడగ్గా...అప్పుడే దివ్యాంక వస్తుంది. మీ కంపెనీ మీ చేతికి రావాలంటే నేను చెప్పినట్లు చేయండని అంటుంది.నా ఛానెల్‌లో ప్రెస్‌మీట్‌ పెట్టి మీ అక్కను గట్టిగా తిట్టాలని..అప్పుడు బోర్డు డైరెక్టర్లు ఆమెపై ఒత్తిడి తెచ్చి సీఈవో పోస్టు నుంచి తొలగించి నిన్ను పెడతారని చెప్పడంతో నిజమేనని నమ్మిన  యువరాజు,నిషిక దీనికి ఒప్పుకుంటారు. ఇంతలో టీవీ వచ్చిన న్యూస్ చూసి సుధాకర్‌ కౌషికి ఫోన్‌ చేసి చెబుతాడు. కాసేపట్లో యువరాజు వాళ్లు ప్రెస్‌మీట్‌ పెడుతున్నారని చెప్పగా...జగధాత్రి రమ్యకు ఫోన్ చేసి నిషిక వాళ్లు ఎక్కడ ఉన్నారో తెలుసుకుని ఫోర్స్‌తో అక్కడికి రమ్మని చెబుతుంది.
 
దివ్యాంకకు ఝలక్‌ ఇచ్చిన జగధాత్రి

నిషిక,యువరాజు,వైజయంతి లైవ్‌లోకి రాగ...జగధాత్రి, కేదార్‌ వచ్చి అడ్డుకుంటారు.ఇది మా ఫ్యామిలీ విషయమని...మీరు ఇలా రచ్చచేయడం బాగోలేదని హెచ్చరిస్తారు.మర్యాదగా లైవ్‌ ఆపకుంటే బాగుండదని అంటారు.ఇంతలో రమ్య అక్కడికి వచ్చి రోడ్డుపై న్యూసెన్స్‌ చేయవద్దని మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని హెచ్చరిస్తుంది. మేం మీడియా అని మాకు ఎక్కడికైనా వెళ్లే హక్కు ఉందని దివ్యాంక చెబుతుంది. ఈ దారిలో సీఎంగారు వస్తున్నారని...ఇక్కడంతా క్లియర్‌ చేయమని ఆర్డర్సుఉన్నాయని రమ్య చెబుతుంది. మీరు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్లకపోతే అరెస్ట్ చేస్తామని బెదిరించడంతో దివ్యాంక చేసేదిలేక అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

Frequently Asked Questions

కౌషికి యువరాజును ప్రాజెక్ట్ లీడ్‌గా ఎందుకు నియమించకూడదని సుధాకర్‌తో చర్చిస్తోంది?

యువరాజు కంపెనీని ఎప్పుడూ చూడలేదు, అతని ఆవేశం మరియు తెలివితక్కువతనం కారణంగా డైరెక్టర్లు అంగీకరించరని సుధాకర్‌తో చర్చిస్తోంది.

సుధాకర్, కేదార్ మరియు జగధాత్రిలను ఎందుకు అసహ్యించుకుంటున్నాడు?

ఆస్తి కోసం కడుపులో ఉన్న బిడ్డను చంపడానికి కూడా వెనకాడని మనుషులు అని, తన కుటుంబ సభ్యులు చెప్పినా వినకుండా వారిని వెనకేసుకుని వచ్చినందుకు బుద్ధి చెప్పారు అని సుధాకర్ అసహ్యించుకుంటున్నాడు.

వైజయంతి, యువరాజు, నిషిక ఇంట్లో నుంచి ఎందుకు వెళ్లిపోయారు?

యువరాజుకి అవమానం జరిగే చోట ఉండలేక, కౌషికిని దారికి తెచ్చుకోవడానికి, మరియు తన కొడుకుని కంపెనీ సీఈఓని చేయలేరని ఆగ్రహంతో వైజయంతి వెళ్లిపోయింది.

దివ్యాంక ప్లాన్ ఏమిటి?

తన ఛానెల్‌లో ప్రెస్ మీట్ పెట్టి, యువరాజు తన అక్కను (కౌషికిని) గట్టిగా తిట్టాలని, అప్పుడు బోర్డు డైరెక్టర్లు ఆమెను సీఈఓ పదవి నుంచి తొలగించి యువరాజును నియమిస్తారని దివ్యాంక ప్లాన్.

జగధాత్రి, దివ్యాంక ప్లాన్‌ను ఎలా అడ్డుకుంది?

యువరాజు, నిషిక లైవ్ లోకి రాగానే జగధాత్రి, కేదార్ వచ్చి అడ్డుకున్నారు. రమ్య అక్కడికి వచ్చి, సీఎంగారు వస్తున్నారని, ఇక్కడంతా క్లియర్ చేయమని ఆర్డర్లు ఉన్నాయని, లేకపోతే అరెస్ట్ చేస్తామని బెదిరించడంతో దివ్యాంక అక్కడి నుంచి వెళ్లిపోయింది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 20th : ఆదిలక్ష్మీ చెంప పగులగొట్టిన వైజయంతి....కేదార్‌ను అన్నా అంటూ ఆప్యాయంగా పిలిచిన యువరాజు
ఆదిలక్ష్మీ చెంప పగులగొట్టిన వైజయంతి....కేదార్‌ను అన్నా అంటూ ఆప్యాయంగా పిలిచిన యువరాజు
Charishma Shreekhar : బుల్లితెర విలన్ కూతురు.. వెండితెరపై హీరోయిన్.. చరిష్మా శ్రీకర్ ఇంట్రెస్టింగ్ విషయాలు
బుల్లితెర విలన్ కూతురు.. వెండితెరపై హీరోయిన్.. చరిష్మా శ్రీకర్ ఇంట్రెస్టింగ్ విషయాలు
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 20th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఇప్పుడు నా గతేంటి? లక్ష్మీకి తెలిసిన షాకింగ్ విషయాలు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఇప్పుడు నా గతేంటి? లక్ష్మీకి తెలిసిన షాకింగ్ విషయాలు!
Godavari Serial Today August 20th: 'గోదావరి' సీరియల్: కిన్నెర సర్జరీకి 25 లక్షలు! సూర్యని గెంటేసిన మురళీ, జాను!
'గోదావరి' సీరియల్: కిన్నెర సర్జరీకి 25 లక్షలు! సూర్యని గెంటేసిన మురళీ, జాను!
Advertisement

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
PV Sindhu Says World Badminton Drama.!: సింధు నిష్క్రమణ.. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! 
పోరాడి ఓడిన సింధు .. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! వరల్డ్ చాంపియన్షిప్ టోర్నీ
Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Embed widget