అన్వేషించండి

Jagadhatri Serial Today May 21th:జగధాత్రిని ముఖం కూడా చూపించవద్దని సుధాకర్‌ ఎందుకు అన్నాడు..?కౌషికికి యువరాజు గన్‌ ఎందుకు గురిపెట్టాడు..?

Jagadhatri Serial Today Episode May21th:నిషిక కడుపులో బిడ్డను జగధాత్రి కావాలనే చంపిందన్న కోపంతో సుధాకర్‌ జగధాత్రిని అసహ్యించుకుంటాడు. తనను ప్రాజెక్ట్‌ హెడ్‌గా చేయమని యువరాజు కౌషికిని బెదిరిస్తాడు.

Jagadhatri Serial Today Episode: జగధాత్రి నెట్టడం వల్లే నిషిక కడుపుపోయిందని అబద్ధం చెప్పడంతో జగధాత్రికి కోపం వస్తుంది.మర్యాదగా నిజం చెప్పకపోతే...ఇప్పుడు నేను నోరు విప్పాల్సి వస్తుందని అంటుంది. దీంతో నిషిక జగధాత్రి దగ్గరకు వచ్చి చెంప పగులగొడుతుంది. నా కడుపు పోవడానికి కారణమైందే కాకుండా నేనే అబద్ధం చెబుతున్నానని అంటావా అని నిలదీస్తుంది. దీంతో జగధాత్రి కౌషికికి నిజం చెబుతుంది.అసలు నిషిక కడుపుతోనే లేదని ఆ నిజం బయటపడుతుందన్న ఉద్దేశంతోనే అబద్ధం ఆడుతోందని చెబుతుంది.ఇంతలో యువరాజు కల్పించుకుని నా బిడ్డ ఈ ఇంటి వారసుడు అవుతాడన్న కోపంతోనే మీరు ఇలా చేశారని అంటాడు.ఆ మాటలకు జగధాత్రి, కేదార్‌ షాక్‌తింటారు.అసలు మీ బిడ్డను చంపాల్సిన అవసరం మాకు  ఏముందని అంటారు.
                     నిషిక కల్పించుకుని ఇంత జరుగుతున్నా మీరు ఇంకా జగధాత్రి వైపు ఉన్నారా  అని కౌషికిని అడుగుతుంది. దీంతో కౌషికి నేను జగధాత్రి వాళ్లవైపు లేనని చెబుతుంది.ఇంతలో సుధాకర్ కల్పించుకుని జగధాత్రిపై కోప్పడతాడు. నిన్ను కన్న కూతురిలా చూసుకుంటే ఇంతపనిచేస్తావా అని అసహ్యించుకుంటాడు. ఇకపై నీ ముఖం నాకు చూపించవద్దని కోపంగా అంటాడు. ఆ మాటలకు ధాత్రి ఎంతో బాధపడుతుంది. మొదటిసారి మామయ్యగారి దగ్గర మాటపడాల్సి వచ్చిందని కేదార్‌తో అంటుంది.నిజం తెలియక వాళ్లు అలా మాట్లాడుతున్నారని.....అసలు నిజం తెలిసినరోజు నిన్ను అర్థం చేసుకుంటారని అంటాడు.
               పాటిల్‌ను హత్య చేయడానికి వచ్చిన గ్రూప్ ఎక్కడ ఉందో పోలీసులు కనుక్కుని జేడీ, కేడీకి చెబుతారు.దీంతో వాళ్లిద్దరూ వెంటనే అక్కడికి బయలుదేరతారు. ఓ  ఇంట్లో వాళ్లు ముగ్గురు ఉన్నారని తెలుసుకున్న జేడీ...ఎలక్ట్రికల్ డిపార్ట్‌మెంట్‌ నుంచి వచ్చామంటూ ఆ ఇంట్లోకి వెళ్తారు.వీళ్లను గుర్తుపట్టిన రౌడీలు....జేడీ,కేడీని లోపల బంధించి బయట తాళం వేస్తారు.ఇళ్లంతా పెట్రోలు పోసి నిప్పంటిస్తారు. ఆ ముగ్గురు యువతీ,యువకులను అక్కడి నుంచి తీసుకుని పారిపోతారు. అయితే మంటల్లో నుంచి బయటపడిన జేడీ,కేడీ రౌడీలకు ఎదురుగా వచ్చి నిలబడతారు. వాళ్లందరిని తుక్కుతుక్కుగా  కొట్టిపడేస్తారు.
                జేడీని చూసి యువతీ,యువకులు పారిపోవడానికి ట్రై చేయగా...ఆమె గన్‌తీసి బెదిరిస్తుంది.దీంతో వాళ్లు ముగ్గురు అక్కడికి వచ్చి చంపొద్దని ప్రాధేయపడతారు. అసలు పాటిల్‌ను ఎందుకు చంపాల్సి వచ్చిందని జేడీ నిలదీస్తుంది.అసలు మేం ఆయన్ను చంపాలని అనుకోలేదని...మాకు ఈ హత్యకు ఎలాంటి సంబంధం లేదని చెబుతారు.మేం రోడ్లపై ఫ్రాంక్‌ వీడియోలు చేస్తుంటామని...దీంతో ఒకతను మమ్మల్ని పిలిచి ఉద్యోగాలు ఇచ్చాడని చెబుతారు.మేం ఇలాగే ఫ్రాంక్ వీడియోలు చేయాలని చెప్పారని అంటారు. మేం ఎప్పటి మాదిరిగానే ఫ్రాంక్‌ వీడియోల కోసమే డమ్మీ గన్‌తో ఆయన్ను కాల్చామని....కానీ అనూహ్యంగా మా చేతుల్లోకి  నిజం గన్ ఎలా వచ్చిందో తెలియదని అంటారు. అంటే మిమ్మల్ని పావులుగా పెట్టుకుని ఎవరో ఈ నాటకం ఆడించారన్నమాట అని జేడీ అంటుంది. అంటే మిమ్మల్ని పనులో పెట్టుకున్న బాషకు మాత్రమే ఈ హత్య చేయించింది ఎవరో తెలుసు అన్నమాట అని జగధాత్రి అంటుంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 19th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఏళ్ల తర్వాత లక్ష్మీ భుజం మీద వాలిపోయిన విహారి! అంబిక ప్లాన్ మళ్లీ విఫలం!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఏళ్ల తర్వాత లక్ష్మీ భుజం మీద వాలిపోయిన విహారి! అంబిక ప్లాన్ మళ్లీ విఫలం!
Godavari Serial Today August 19th: 'గోదావరి' సీరియల్: ఫింగర్ బౌల్‌ని ఇలా కూడా వాడుతారా..! పరువు తీసేసిన కృష్ణుడు! కిన్నెరకు సీరియస్‌!
'గోదావరి' సీరియల్: ఫింగర్ బౌల్‌ని ఇలా కూడా వాడుతారా..! పరువు తీసేసిన కృష్ణుడు! కిన్నెరకు సీరియస్‌!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 19th:ఏకులా వచ్చి మేకులా మారిన సుందరి...రాధ,దమయంతికి పెద్ద షాక్‌ ఇచ్చిన దొంగ చిట్టి
నువ్వులేక నేను లేను: ఏకులా వచ్చి మేకులా మారిన సుందరి...రాధ,దమయంతికి పెద్ద షాక్‌ ఇచ్చిన దొంగ చిట్టి
Podarillu Serial Today August 19th:ఊరుచూడటానికి వెళ్లిన మహా,చక్రిని ఏడిపించిన ఆకతాయిలు...మేనల్లుడిని కాపాడిన దుర్గాప్రసాద్‌
పొదరిల్లు: ఊరుచూడటానికి వెళ్లిన మహా,చక్రిని ఏడిపించిన ఆకతాయిలు...మేనల్లుడిని కాపాడిన దుర్గాప్రసాద్‌
Advertisement

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Adilabad Spiny Gourd:ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Embed widget