అన్వేషించండి

Jagadhatri Serial Today May 20th: జగధాత్రి నిషికను నెట్టడంతో కిందపడి అబార్షన్‌..ఇప్పుడు ధాత్రి ఏం చేయబోతుంది..?

Jagadhatri Serial Today Episode May 20th: కడుపులేదని అందరిముందు ఒప్పుకోవాలని నిషికకు జగధాత్రి వార్నింగ్‌ ఇవ్వగా....ధాత్రి వల్లే కడుపుపోయిందని నమ్మించడానికి నిషిక వేసిన పథకం ఫలించిందా..?

Jagadhatri Serial Today Episode: కేదార్‌కు ఓ చెల్లి ఉందని తను కూడా ఇదే ఊరిలో ఉందని జగధాత్రి వీరశంకర్‌కు చెబుతుంది. తాము ఓరోజు  రోడ్డుపై వస్తుంటే...మీ అమ్మాయిగారి ఫొటోతో ఉన్న ఓ అమ్మాయి మాకు కనిపించిందని...మళ్లీ మేం వెళ్లి చూసేసరికి ఆమె లేదని చెబుతారు. వీరశంకర్‌ కూడా ఆనాటి రోజులు గుర్తుచేసుకుని నా బిడ్డ మరో అమ్మాయికి జన్మనిచ్చిందని తెలుసుకుని ఆనందపడిపోతాడు. దేవుడు అంతా మంచే చేస్తున్నాడని అందరినీ కలపడానికి ట్రై చేస్తున్నాడని చెబుతాడు.ఎప్పటికైనా నీ చెల్లి నీ దగ్గరకు  వస్తుందని  కేదార్‌తో అంటాడు.ఇదంతా విన్న నిషిక...వెళ్లి యువరాజుతో చెబుతుంది. ఇప్పుడు ఆ శ్రీవల్లి కేదార్‌ చెల్లి అని తెలిస్తే...మనం రోడ్డునపడటం ఖాయమని అంటుంది. అయితే వాళ్లిద్దరూ కలవకుండా ఉండటానికి ఏదైనా చేస్తానని యువరాజు అంటాడు.
                 

జగధాత్రి నిద్రలేవక ముందే కేదార్ సుధాకర్‌ను తీసుకుని చల్లగాలికి బయటకు వస్తాడు.ధాత్రి లేచి కేదార్‌ కోసం ఇళ్లంతా వెతుకుతుంది.ఎక్కడా కనిపించకపోయేసరికి కంగారుగా కౌషికిని తీసుకుని బయటకు వస్తుంది.అక్కడ తండ్రీకొడుకులిద్దరూ సరదాగా నవ్వుకుంటూ మాట్లాడుకోవడం చూసి  వాళ్లిద్దరూ అక్కడికి వస్తారు. అందరూ కలిసి నవ్వుకోవడం చూసి యువరాజు,నిషిక, వైజయంతికి కడుపు మండిపోతుంది. యువరాజు అక్కడికి వచ్చి మానాన్నను నిన్ను ఎవడు బయటకు తీసుకురమ్మాన్నాడని నిలదీస్తాడు. మానాన్నను చూసుకోవడానికి నీకు ఏం అధికారం ఉందని మండిపడతాడు. నోటికొచ్చినట్లు తిడటాడు. కేదార్‌పై చేయిచేసుకోవడానికి ప్రయత్నించగా....సుధాకర్‌ గట్టిగా అరిచి ఆపుతాడు. కేదార్ నా కొడుకని మీ అందరికీ తెలుసు...కానీ ఎవరూ దీన్ని అంగీకరించడానికి ఇష్టపడటం లేదని..మీరు బాధపడతారనే నేను కూడా ఇన్నాళ్లు మౌనంగా ఉన్నానని అంటాడు.మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్లిపోమని హెచ్చరిస్తాడు. దీంతో యువరాజు అక్కడి నుంచి వెళ్లిపోగా....కేదార్‌  తండ్రిని ఇంట్లోకి తీసుకెళ్తాడు.ఇప్పుడు నీకళ్లు చల్లబడ్డాయా అని నిషిక జగధాత్రితో అంటుంది. ఆ విషయం తర్వాత మాట్లాడుకుందాం కానీ.ముందు నాకు ఇచ్చిన మాట ఏం చేశావని ధాత్రి నిలదీస్తుంది. నీకు కడుపు లేదన్న సంగతి నువ్వు చెబుతావా..లేక నన్ను చెప్పమంటావా అని అంటుంది. నువ్వు చెబితే నిజం ఒప్పుకున్నట్లు అవుతుందని...నేను చెబితే మోసాన్ని బయట పెట్టినట్లు అవుతుందని అంటుంది. మధ్యాహ్నం వరకు సమయం ఇవ్వమని నిషిక అంటుంది.
                         

కొత్త ప్రాజెక్ట్‌కు లీడ్‌రోల్‌ కోసం కౌషికి ఆలోచిస్తుంటుంది. సుధాకర్‌ ఇప్పుడు నేను నడవలేనిస్థితిలో ఉన్నాను కాబట్టి  మీ పిన్నిని పెడదామని అంటాడు. మనం వెనక ఉండి చూసుకుందామని చెబుతాడు. ప్రాజెక్ట్‌ ప్రారంభం కాబోయే ముందే ఏం తెలియని పిన్నిని పెడితే మన ఇన్వెస్టర్లతోపాటు బోర్డుసభ్యులు ఒప్పుకోరని అంటుంది. ఇప్పుడు ఏం చేద్దామని అనగా....కౌషికి కేదార్‌ వైపు చూసి కేదార్‌ను పెడదామని అడుగుతుంది. నాకు ఏం తెలుసునని అంటాడు. జగధాత్రి కూడా ఒప్పుకోమని అంటుంది. నేను నాన్నతో నవ్వుతూ మాట్లాడితేనే యువరాజు ఎంత గొడవ చేశాడో చూశావు కదా అక్క...ఇప్పుడు వాడిని కాదని ఇంత పెద్ద రోల్‌ నాకు ఇస్తే ఖచ్చితంగా గొడవ చేస్తాడని అంటాడు.కాబట్టి ప్రాజెక్ట్‌ యువరాజుకు అప్పగించమని చెబుతాడు. వాడికి ఆవేశం తప్ప....ఆలోచన లేదని ఇంత పెద్ద ప్రాజెక్ట్‌ వాడిని నమ్మి వాడి చేతులో పెట్టలేమని చెబుతుంది.నేనే ఏదో ఒకటి ఆలోచిస్తానులే అని అంటుంది. మీ నాన్నకు దగ్గరయ్యేందుకు వచ్చిన అవకాశం ఎందుకు వదులుకున్నావని జగధాత్రి కేదార్‌ను అడగ్గా....వాడు నాన్నను ఏమైనా చేస్తాడేమోనన్న భయంతోనే వద్దని చెప్పానని అంటాడు.
                       

నిషిక కడుపు జగధాత్రి వల్లే పోయిందని అందరినీ  నమ్మించడానికి యువరాజు నాటకం ఆడతాడు. నిషిక ఫోన్ మాట్లాడుతూ వస్తుండగా....కరెంట్ వైర్ దారిలో వేస్తాడు. నిషిక అది తొక్కుతుందేమోనని భయపడి జగధాత్రి ఆమెను పక్కకు నెట్టివేస్తుంది.వెళ్లి కుర్చీలపై పడిపోయిన నిషిక...కడుపు నొప్పి అంటూ నాటకం ఆడుతుంది. డాక్టర్‌ను బెదిరించి ధాత్రి నెట్టడం వల్లే కడుపుపోయిందని చెప్పమని చెబుతారు. డాక్టర్‌ పరీక్షించి...నిషికకు అబార్షన్ అయ్యిందని అబద్ధం చెప్పడంతో కౌషికి, సుధాకర్‌ షాక్‌ తింటారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today August 17th: 'గోదావరి' సీరియల్: తమ్ముడిని రెచ్చగొట్టిన నిత్య! సూర్య కోసం అందంగా ముస్తాబైన జానుకి నిశ్చితార్థం గురించి తెలుస్తుందా!
'గోదావరి' సీరియల్: తమ్ముడిని రెచ్చగొట్టిన నిత్య! సూర్య కోసం అందంగా ముస్తాబైన జానుకి నిశ్చితార్థం గురించి తెలుస్తుందా!
Nindu Manasulu Serial Today August 17th: నిండు మనసులు: మంజు ఇంట్లో ఘనంగా వరలక్ష్మీ వ్రతం! కళ్లు తిరిగి పడిపోయిన ప్రేరణ.. కారణమేంటో తెలుసా!
నిండు మనసులు: మంజు ఇంట్లో ఘనంగా వరలక్ష్మీ వ్రతం! కళ్లు తిరిగి పడిపోయిన ప్రేరణ.. కారణమేంటో తెలుసా!
Nindu Noorella Saavasam Serial Today August 17th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆశ్రమంలోకి దూరిన ప్రచండ – ప్రచండకు వార్నింగ్‌ ఇచ్చిన మనోహరి
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆశ్రమంలోకి దూరిన ప్రచండ – ప్రచండకు వార్నింగ్‌ ఇచ్చిన మనోహరి
Jabardasth Pavithra : జబర్దస్త్ పవిత్ర బ్రేకప్ స్టోరీ - హీరోయిన్ అనుపమకు జరిగినట్లే జరిగిందా!... అసలేంటీ నార్సిస్టిక్ అబ్యూస్?
జబర్దస్త్ పవిత్ర బ్రేకప్ స్టోరీ - హీరోయిన్ అనుపమకు జరిగినట్లే జరిగిందా!... అసలేంటీ నార్సిస్టిక్ అబ్యూస్?
Advertisement

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Andhra Pradesh Assembly Sessions: ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
Embed widget