అన్వేషించండి

Jagadhatri Serial Today May 18th: కేదార్‌ను గాయపరచడానికి యువరాజు వేసిన ప్లాన్‌ ఏంటి..? సుధాకర్‌ను కిడ్నాప్ చేసిందెవరు..?

Jagadhatri Serial Today Episode May18th: కేదార్‌ను గాయపరచి ఫంక్షన్‌ జరగకుండా చేయడానికి యువరాజు వేసిన ప్లాన్‌ బెడిసికొట్టినా...సుధాకర్‌ కిడ్నాప్‌తో ఈరోజు జగద్ధాత్రి ఏపీసోడ్ ఆసక్తికరంగా మారింది.

Jagadhatri Serial Today Episode: సుధాకర్‌ ఈరోజు ఎలాగైనా కేదార్‌ను కొడుకుగా  ప్రకటించనుండటంతో జగధాత్రి,కేదార్ ఎంతో ఆనందంగా ఉంటారు.అయితే ఇంతలోనే ధాత్రికి సాధూసార్‌ నుంచి ఫోన్‌ కాల్‌ వస్తుంది. దిల్లీ నుంచి వీవీఐపీ వస్తున్నారని....అతనికే తెలియకుండా జాగ్రత్తగా ఫాలో అయ్యి సెక్యూరిటీ ఇవ్వాలని చెబుతారు. దీంతో జగధాత్రి, కేదార్ బయలుదేరతారు. ఇప్పుడు ఇంట్లో ఇంత ఇంపార్టెంట్ ఫంక్షన్ పెట్టుకుని మీరు ఎలా వెళ్తారని రాగిణి అత్తయ్య అడుగుతుంది. చాలా అర్జెంట్‌ పని ఉందని....ఫంక్షన్ మొదలయ్యే సరికి మేము వచ్చేస్తామని ధాత్రి చెబుతుంది. నిషిక వాళ్లు ఏదైనా ప్రాబ్లం చేస్తే....నాన్నకు చెప్పండని ఆయనే మేనేజ్‌ చేస్తారని చెప్పి వెళ్లిపోతారు.
                          సాధూసార్‌ చెప్పినట్లు ఎయిర్‌పోర్టు నుంచి వీవీఐపీని ఫాలో అవుతూ జేడీ,కేడీ వస్తుంటారు. సడెన్‌గా  ఆయన ప్రయాణిస్తున్న కారు దారిమళ్లుతుంది. ఓ ముగ్గురు యువతీ యువకులు రోడ్డుపై కొట్టుకున్నట్లు నటించి వీవీఐపీ పాటిల్‌ కారు ఆపుతారు. దీంతో ఆయన కిందకు దిగి గొడవ సర్దిచెబుతుండగానే ఆయన్ను తుపాకీతో కాలుస్తారు.అప్పుడే జేడీ,కేడీ అక్కడికి వచ్చి వాళ్లను పట్టుకోవడానికి ట్రై చేస్తారు.వాళ్లు పారిపోతుండగా...వాళ్లల్లో ఒకరిని భుజంపై జేడీ కాలుస్తుంది. అయినా అతను దొరక్కుండా పారిపోతాడు. వెంటనే రమ్యకు చెప్పి వాళ్లను ట్రేస్ చేయమని చెబుతుంది. అన్ని ఆస్పత్రులను అలెర్ట్ చేయమని చెబుతుంది. గాయపడిన పాటిల్‌ను ఆస్పత్రికి తరలించి జేడీ,కేడీ అక్కడి నుంచి వెళ్లిపోతారు.

Also Read : పెద్ది సారూ... ఆటే నా పొగరు - చరణ్ మాస్ ఎంట్రీ To డైలాగ్స్... ట్రైలర్ రివ్యూ

భార్య నిషిక చెప్పిన అబద్ధంతో యువరాజు రుసరుసలాడుతుంటాడు.తాను ఎందుకు ఆ అబద్ధం చెప్పాల్సి వచ్చిందో నిషిక చెబుతున్నా వినిపించుకోడు. ఇంతలో నిషిక తల్లి కలుగజేసుకుని మీరు ఇద్దరూ ఎప్పుడైనా కొట్టుకోవచ్చని....ఇప్పుడు ఆ కేదార్‌ను ఇంటి కొడుకుగా ప్రకటిస్తే మీరు జీవితాంతం బాధపడతారని, ముందు అది ఎలా ఆపాలో చూడండని చెబుతుంది. ఏం చేయాలని ఆమెనే అడగ్గా...ధాత్రి, కేదార్‌లో ఎవరో ఒకరు గాయపడితే ఈ ఫంక్షన్ ఉండదు, మీ నాన్నగారి ప్రకటన కూడా ఉండదని సలహా ఇస్తుంది. ఇంతలో జగధాత్రి,కేదార్ ఎక్కడికి వెళ్లారని అందరూ అడుగుతుండగా...ధాత్రి వాళ్ల నాన్న నేనే మందులు తీసుకుని రమ్మని ఇంటికి పంపించానని చెబుతాడు. ఇంతలో వాళ్లిద్దరూ అక్కడికి రావడంతో అంతా సర్దుమణుగుతుంది.


                   కేదార్‌పై అక్వైరియం వేయడానికి యువరాజు ప్రయత్నించగా...అతను ముందుకు వెళ్లిపోతాడు.దీంతో పై నుంచి జగధాత్రి తలపై అక్వైరియం వేస్తాడు.అయితే వెంటనే అదిచూసిన ధాత్రి వాళ్ల నాన్నను తీసుకుని పక్కకు పరుగెత్తడంతో ప్రమాదం తప్పిపోతుంది. అందరూ ఇలా జరిగిందేంటని అనుకుంటారు.ఏదీఏమైనా పెద్ద గండంతప్పిందని వెళ్లిపోతారు. అయితే పైనుంచి అదిపడేసింది యువరాజు అని తెలుసుకున్న జగధాత్రి, కేదార్‌ యువరాజుకు గట్టిగా వార్నింగ్ ఇస్తారు. ఇంతలో కీర్తి ఫంక్షన్ మొదలవుతుంది. అందరూ వచ్చి పాపను దీవిస్తారు.

Also Read : పెద్ది ట్రైలర్ వచ్చేసింది - రామ్ చరణ్ ఫైర్ ప్యాక్ట్ మాస్ ఎంటర్టైనర్

అక్కడికి వీరశంకర్‌ కూడా వస్తాడు. మీ నాన్న నిన్ను కొడుకుగా ప్రకటించాడా లేదా అని కేదార్‌ను అడుగుతాడు.ఇంకా ప్రకటించలేదని చెప్పగా...సుధాకర్‌ నువ్వు ప్రకటన చేస్తే నేను మహల్‌కు వెళ్తానని లేదంటే ఆధారాలతో మీడియా దగ్గరకు వెళ్తానని చెబుతాడు. దీంతో సుధాకర్‌ లేచి కేదార్‌ తన కొడుకని చెప్పబోతుండగా...ముగ్గురు దుండగులు ముసుగులు ధరించి వచ్చి సుధాకర్‌ను కిడ్నాప్‌ చేసి తీసుకెళ్తారు. తండ్రిని వెతుక్కుంటూ కేదార్‌, జగధాత్రి వెళ్తారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today August 10th: 'గోదావరి' సీరియల్: మురళీ అరెస్ట్! మురళీ కోసం నందు పోరాటం..! నిత్య ఈవిల్ యాక్షన్‌!
'గోదావరి' సీరియల్: మురళీ అరెస్ట్! మురళీ కోసం నందు పోరాటం..! నిత్య ఈవిల్ యాక్షన్‌!
Nindu Noorella Saavasam Serial Today August 10th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని అనుమానించిన వార్డెన్‌ - బుజ్జమ్మను బంధించేందుకు ప్రయత్నించిన కాబ్రా
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని అనుమానించిన వార్డెన్‌ - బుజ్జమ్మను బంధించేందుకు ప్రయత్నించిన కాబ్రా
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 10th:విక్కీ తన భర్తని చిట్టికి చెప్పేసిన రాధ...ఎందుకు చెప్పావంటూ భార్యను నిలదీసిన విక్రమ్
నువ్వులేక నేను లేను: విక్కీ తన భర్తని చిట్టికి చెప్పేసిన రాధ...ఎందుకు చెప్పావంటూ భార్యను నిలదీసిన విక్రమ్
Podarillu Serial Today August 10th: మాధవ్‌ జాతకం చూసి పండితులు ఏం చెప్పారు..? నారాయణ కుటుంబానికి ఉన్న శాపం ఏంటి..?
పొదరిల్లు: మాధవ్‌ జాతకం చూసి పండితులు ఏం చెప్పారు..? నారాయణ కుటుంబానికి ఉన్న శాపం ఏంటి..?
Advertisement

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
Hyderabad Road Accident: నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
Gen Z Protests India 2026: జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
Telangana BJP: తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
Vizag and Vijayawada Metro Rail:విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులో కదలిక!లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే?
విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులో కదలిక!లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే?
Gold- Silver Price Today 10 August 2026: ఆగస్టు 10న బంగారం ధర ఎంత? వెండి ధరలు కూడా మారాయా?  
ఆగస్టు 10న బంగారం ధర ఎంత? వెండి ధరలు కూడా మారాయా?  
Korean Kanakaraju Collections Day 3 : కొరియన్ కనకరాజు ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - వరుణ్ తేజ్ ఖాతాలో మరో హిట్
కొరియన్ కనకరాజు ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - వరుణ్ తేజ్ ఖాతాలో మరో హిట్
PM Modi CWG: గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
Embed widget