అన్వేషించండి

Peddi Trailer Review : పెద్ది సారూ... ఆటే నా పొగరు - చరణ్ మాస్ ఎంట్రీ To డైలాగ్స్... ట్రైలర్ రివ్యూ

Peddi Trailer Reaction : 3 నిమిషాల ట్రైలర్... సోషల్ మీడియానే షేక్ చేస్తోంది. మన పెద్ది గాడి మాస్ ఎంట్రీ అదిరిపోయింది. చరణ్ పెద్ది ట్రైలర్ ఎలా ఉందంటే...

Ram Charan's Peddi Trailer Telugu Review : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ది ట్రైలర్ వచ్చేసింది. 3 నిమిషాల వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. చరణ్ లుక్స్ దగ్గర నుంచీ డైలాగ్స్, డిఫరెంట్ రోల్స్‌లో ట్రాన్స్‌ఫర్మేషన్ స్టోరీపై అంచనాలు పదింతలు పెంచేసింది. 3 గంటల రన్ టైం మూవీని 3 నిమిషాల ట్రైలర్ కట్‍‌లో అద్భుతంగా చూపించారు డైరక్టర్ బుచ్చిబాబు. మరి ట్రైలర్ రివ్యూ ఏంటో ఓసారి చూస్తే...

పెద్దిగాడు ఎవరు?

పెద్ది ట్రైలర్ చూస్తున్నంత సేపు అసలు పెద్దిగాడు ఎవరు? క్రికెటరా... రన్నరా... రెజ్లరా... అనే సస్పెన్స్ క్రియేట్ అవుతోంది. కట్ చేస్తే... 'ఇక్కడ ఏ కుర్రోడిని అడిగినా ఫేవరెట్ ప్లే మారుతుంది కానీ ఫేవరెట్ ప్లేయర్ మారడం లేదు. పెద్ది ఈ ఏరియాలో ఏమైనా దేవుడి పేరా?' అనే డైలాగ్‌తో ప్రారంభమైన ట్రైలర్... మన పెద్ది గాడి ఎంట్రీతో వేరే లెవల్‌కు వెళ్లింది.

'నా ఫేవరెట్ క్రికెటర్ పెద్ది సార్, నా ఫేవరెట్ రన్నర్ పెద్ది సార్, నా ఫేవరెట్ వ్రెజ్లర్ పెద్ది సార్. ఈ కుర్రాళ్లకు పెద్ది గాడు గుడిలో దేవుడు కాదు సారు... గ్రౌండులో దేవుడు' ఎలివేషనల్ డైలాగ్స్‌తో చరణ్ ఎంట్రీ అదిరిపోయింది. ఉత్తరాంధ్ర యాసతో చెప్పే డైలాగ్స్, డిఫరెంట్ గేమ్స్‌లో చరణ్ లుక్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి.

పెద్ది స్టోరీ అదేనా?

పెద్ది ట్రైలర్ చూస్తే స్టోరీపై ఎవరికైనా ఓ క్లారిటీ వస్తుంది. అయితే, ఒకే ప్లేయర్ ఇన్ని గేమ్స్‌ ఎలా ఆడాడు? ఎలా ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్లాడు? అనేదే సస్పెన్స్. ఓ గ్రామీణ యువకుడు... క్రికెట్ దగ్గర నుంచీ కుస్తీ వరకూ అన్నీ గేమ్స్‌లో తన ప్రతిభ చూపిస్తాడు. ఊరిలో కూలీలను తక్కువగా చూసే మరో వర్గం. తమను అవమానించే వారికి తన ఆటతోనే సమాధానం చెప్పాలనుకునే ఓ ముఠా కూలీ... ఇంటర్నేషనల్ స్థాయి పోటీల్లో ఎలా విజయం సాధించాడు? అనేదే స్టోరీ అని తెలుస్తోంది. ట్రైలర్ కట్‌లో గేమ్స్‌తో పాటే కాస్త లవ్ అండ్ రొమాంటిక్ టచ్ చూపించారు. 

Also Read : రష్మిక నోట బూతు పదం.. వెంటనే సారీ - అన్ కంఫర్టబుల్ ఫీలైన నేషనల్ క్రష్... ఎందుకంటే?

ఈ డైలాగ్స్ వేరే లెవల్...

పెద్ది ట్రైలర్‌లో ఒక్కో డైలాగ్ వేరే లెవల్‌లో ఉంది. 'ఈ పెద్దిగాడు గ్రౌండ్‌లో దేవుడు', 'నాకు ఆట గెలవడం కాదు బతకడం కావాలి', 'వాడికి ఆట ఆడడమే తెలుసు. మనకు ఆట ఆడించడం కూడా తెలుసు', 'నేను పెద్ది సారు', 'గెలుపైనా ఓటమైనా కొండ కింద ఊరోడిదే అవ్వాలా', 'మీరందరూ నేనాడాను అనుకుంటున్నారు. నేను పోరాడాను సార్' అనే డైలాగ్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి.

క్లైమాక్స్ సిగ్నేచర్ షాట్

గ్లింప్స్‌లో క్లైమాక్స్ సిగ్నేచర్ షాట్ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ట్రైలర్‌లోనూ అంతే స్థాయిలో ఓ సిగ్నేచర్ షాట్ ఉంది. వ్రెజ్లర్‌ నుంచి క్రికెటర్‌గా మారి మళ్లీ కుస్తీతోనే ఓ మనిషిని ఎత్తి పడేయడం నిజంగా ట్రైలర్ కట్‌లో హైలైట్ అనే చెప్పాలి. మెగా ఫ్యాన్స్ ఏదైతే కోరుకున్నారో చరణ్ హై పవర్ ప్యాక్డ్ మాస్ ఎంటర్టైనర్ కన్ఫర్మ్ అని పెద్ది ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది. మరి మన పెద్ది గాడి విశ్వరూపం చూడాలంటే జూన్ 4 వరకూ ఆగాల్సిందే.

Also Read : పవన్ కల్యాణ్ గొప్ప లీడర్ - పవర్ స్టార్‌పై అడివి శేష్ ప్రశంసలు

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TG 20 Tournament Controversy:విజయ్‌ దేవరకొండ, వెంకటేష్‌కు లీగల్ నోటీసులు! టీజీ 20 టోర్నీ చుట్టూ ముదురుతున్న వివాదం!
విజయ్‌ దేవరకొండ, వెంకటేష్‌కు లీగల్ నోటీసులు! టీజీ 20 టోర్నీ చుట్టూ ముదురుతున్న వివాదం!
Samantha Meets CM Vijay: విజయ్‌ను కలిసిన సమంత... తమిళనాడు సీఎంను ఆకాశానికి ఎత్తేసిన హీరోయిన్
విజయ్‌ను కలిసిన సమంత... తమిళనాడు సీఎంను ఆకాశానికి ఎత్తేసిన హీరోయిన్
Neno Butterfly Song: విశ్వనాథ్ అండ్ సన్స్ ఫస్ట్ సింగిల్ ప్రోమో... సూర్యతో మమితా బైజు ప్రేమ పాట, ఆ డ్యాన్స్‌ చూశారా?
విశ్వనాథ్ అండ్ సన్స్ ఫస్ట్ సింగిల్ ప్రోమో... సూర్యతో మమితా బైజు ప్రేమ పాట, ఆ డ్యాన్స్‌ చూశారా?
Maa Inti Bangaram First Review - 'మా ఇంటి బంగారం' ఫస్ట్ రివ్యూ: సమంత బ్యాగ్రౌండ్ తెలిసింది... మరి సినిమా ఎలా ఉందంటే?
'మా ఇంటి బంగారం' ఫస్ట్ రివ్యూ: సమంత బ్యాగ్రౌండ్ తెలిసింది... మరి సినిమా ఎలా ఉందంటే?
Advertisement

వీడియోలు

Vaibhav Sooryavanshi Fight With Sri Lanka Players | శ్రీలంక ప్లేయర్లతో వైభవ్ గొడవ
Japan Fans Clean's Stadium FIFA 2026 | జపాన్, నెదర్లాండ్స్ మ్యాచ్ డ్రా
Ravi Shastri Explains Virat Dual Personality | విరాట్ అసలు నైజం బయటపెట్టిన రవిశాస్త్రి
Vaibhav Sooryavanshi Success Story | వైభవ్ సక్సెస్ వెనుక ఉన్న ఆరేళ్ల కఠిన శ్రమ
Vaibhav about Fight With Sri Lanka Players | లంక ప్లేయర్‌తో గొడవపై వైభవ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tesla Hyderabad:హైదరాబాద్‌లో టెస్లా! హైటెక్‌సిటీలో ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్ ప్రారంభం! 
హైదరాబాద్‌లో టెస్లా! హైటెక్‌సిటీలో ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్ ప్రారంభం! 
AP Beach Shacks Policy 2026: ఏపీలో గోవా కల్చర్ - వైజాగ్, సూర్యలంక బీచ్‌లలో బీచ్ షాక్స్ బార్ల ఏర్పాటుకు జీవో విడుదల - నిబంధనలు ఇవే!
ఏపీలో గోవా కల్చర్ - వైజాగ్, సూర్యలంక బీచ్‌లలో బీచ్ షాక్స్ బార్ల ఏర్పాటుకు జీవో విడుదల - నిబంధనలు ఇవే!
T20 World Cup - IND W VS NL W Result Update: టీమిండియా మ‌హిళ‌ల గ్రాండ్ విక్ట‌రీ.. నెదర్లాండ్స్ పై భారీ విజ‌యం.. స‌త్తా చాటిన స్మృతి, షెఫాలీ, శ్రీచ‌ర‌ణి,
టీమిండియా మ‌హిళ‌ల గ్రాండ్ విక్ట‌రీ.. నెదర్లాండ్స్ పై విజయంతో టాప్ ప్లేస్ కు.. స‌త్తా చాటిన స్మృతి, షెఫాలీ, శ్రీచ‌ర‌ణి,
IND Win ODI Series VS AFg: సిరీస్ టీమిండియాదే! గిల్ కెప్టెన్సీలో తొలి సిరీస్ వశం.. కెప్టెన్ ఇన్నింగ్స్ తో రాణించిన శుభ‌మాన్, ఇషాన్.. స‌త్తాచాటిన బ్రార్, అర్ష‌దీప్
సిరీస్ టీమిండియాదే! గిల్ కెప్టెన్సీలో తొలి సిరీస్ వశం.. కెప్టెన్ ఇన్నింగ్స్ తో రాణించిన శుభ‌మాన్, ఇషాన్.. స‌త్తాచాటిన బ్రార్, అర్ష‌దీప్
TG 20 Tournament Controversy:విజయ్‌ దేవరకొండ, వెంకటేష్‌కు లీగల్ నోటీసులు! టీజీ 20 టోర్నీ చుట్టూ ముదురుతున్న వివాదం!
విజయ్‌ దేవరకొండ, వెంకటేష్‌కు లీగల్ నోటీసులు! టీజీ 20 టోర్నీ చుట్టూ ముదురుతున్న వివాదం!
Sai Krishna Missing Case:
"కొడుకు శవాన్ని అయినా చూపించండి" సాయికృష్ణ తల్లి వేడుకోలు! తీవ్ర ఒత్తిడి రావడంతో ప్రభుత్వం కీలక చర్యలు!
Neno Butterfly Song: విశ్వనాథ్ అండ్ సన్స్ ఫస్ట్ సింగిల్ ప్రోమో... సూర్యతో మమితా బైజు ప్రేమ పాట, ఆ డ్యాన్స్‌ చూశారా?
విశ్వనాథ్ అండ్ సన్స్ ఫస్ట్ సింగిల్ ప్రోమో... సూర్యతో మమితా బైజు ప్రేమ పాట, ఆ డ్యాన్స్‌ చూశారా?
US Indo Pacific Command Name Change: ట్రంప్ సర్కార్ షాకింగ్ డెసిషన్ - ఇండో-పసిఫిక్ కమాండ్ పేరు మార్పు - మ్యాప్‌లో పీఓకే పాకిస్థాన్‌దా? భారత్ తీవ్ర ఆగ్రహం!
ట్రంప్ సర్కార్ షాకింగ్ డెసిషన్ - ఇండో-పసిఫిక్ కమాండ్ పేరు మార్పు - మ్యాప్‌లో పీఓకే పాకిస్థాన్‌దా? భారత్ తీవ్ర ఆగ్రహం!
Embed widget