Jagadhatri Serial Today January 16th: వైజయంతి మీనన్ కోసం పనిచేస్తోందని జేడీ,కేడీ ఇంట్లోవాళ్లకు చెప్పేశారా..? అప్పుడు వైజయంతి ఏం చేసింది..?
Jagadhatri Serial Today Episode January 16th: వైజయంతి మీనన్ కోసం పనిచేస్తోందని జేడీ,కేడీ ఇంట్లోవాళ్లకు చెప్పేశారా..? అప్పుడు వైజయంతి ఏం చేసింది..?

Jagadhatri Serial Today Episode: జేడీ ఏ నిమిషంలోనైనా ఇంటికి వచ్చేస్తుందని వైజయంతి కంగారుపడుతుంది. ఇంతలో కౌషితోపాటు అందరూ భోజనానికి కూర్చుని జగధాత్రి, కేదార్ ఎక్కడికి వెళ్లారని కౌషికి ఆరా తీస్తుంది. వాళ్లు మాకు ఏమైనా చెప్పి వెళ్తారా అంటూ నిషిక, యువరాజు అంటారు. అయినా బయటవాళ్ల గురించి మనం ఎందుకు ఎక్కువ ఆలోచించడం అని అంటారు. ఇంతలో వైజయంతి ఎక్కడ అని అడగ్గా....నిషిక వాళ్ల అత్తయ్యను పిలుస్తుంది. ఇంతలో జేడీ, కేడీ కూడా అక్కడికి వస్తారు. వాళ్లను నుంచి కౌషికి ఎందుకు వచ్చారు అడుగుతుంది. లోపలికి వెళ్లి మాట్లాడుకుందామా అంటే....అందరిలోనే మాట్లాడే విషయమని జేడీ చెబుతుంది. వాళ్లను చూడగానే వైజయంతికి గుండెలు అదిరిపోతాయి.ఈరోజుతో తన పని అయిపోయిందని అనుకుంటుంది.
ఇంతలో జేడీ వైజయంతిని చూస్తూ....మేం ఎందుకు వచ్చామో మీకు తెలియకపోయినా ఆవిడకు బాగా తెలుసని అంటుంది. నాకేం తెలుసని వైజయంతి సమాధానమిస్తుంది. అసలు ఏం జరిగిందని కౌషికి నిలదీస్తుంది. మీ ఇంట్లో నుంచి వచ్చిన స్వీట్ బాక్స్ ఇదేనా అని చూపిస్తుంది. అది చూసిన యువరాజు అది మా ఇంట్లో నుంచే వచ్చిందని మా అమ్మమ్మ వాళ్ల ఇంట్లో లడ్డూలు తయాలు చేయించి మా అమ్మవాళ్ల ప్రెండ్స్‌కు ఇచ్చామని చెబుతాడు.అదంతా అబద్ధమని....ఈ లడ్డూలు మీనన్ నుంచి వచ్చాయని జేడీ చెబుతుంది. మీనన్ మా ఇంటికి లడ్డూలు ఎందుకు పంపిస్తాడని కౌషికి అడగ్గా...అందులో ఏం ఉన్నాయో ఒకసారి చూడండని చెప్పగా....లడ్డూల్లో ఉన్న వజ్రాలు బయటపడతాయు. మీ పిన్ని మీనన్ కోసం పనిచేస్తోందని...దొంగచాటుగా వజ్రాలు స్మగ్లింగ్‌కు పాల్పడుతోందని అంటారు. అందులో ఎప్పుడూ లేనిది ఈమధ్య మీఇంట్లో పూజలు, కిట్టీపార్టీలు జరుగుతున్నాయని జేడీ, కేడీ చెబుతారు.
సుధాకర్ లోపలికి వెళ్లి కొరడా తీసుకొచ్చి వైజయంతిని పిచ్చికొట్టుడు కొడతాడు. నిజం చెప్పకపోతే ఇవాళ చంపేస్తానని అంటాడు. తనకు ఏం తెలియదని, ఆ లడ్డూల్లోకి వజ్రాలు ఎలా వచ్చాయో నిజంగా తెలియదని వైజయంతి అంటుంది. కౌషికి, యువరాజు అడ్డుపడినా....వాళ్లను పక్కకు నెట్టేసి మళ్లీ కొడతాడు. ఇంతలో జేడీ కూడా వచ్చి అడ్డుపడుతుంది. ఆవిడను మేం విచారణకు తీసుకెళ్లాలని...అప్పుడే నిజాలు తెలుస్తాయని అంటుంది.ఇప్పుటివరకు ఆవిడ అనుమానితురాలేనని చెబుతుంది. ఈ గండం నుంచి గట్టెక్కాలంటే ఒక్కటే మార్గమని ఆలోచించి వైజయంతి గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంటుంది. ఆత్మహత్య చేసుకుంటున్నట్లు నాటకం ఆడుతుంది. వెంటనే జేడీ తలుపులు పగులగొట్టి ఆవిడను కాపడతారు. దీంతో కౌషికి కూడా కోపం వస్తుంది. లడ్డూల బాక్స్ మా ఇంటి నుంచి వచ్చినంత మాత్రాన మా పిన్ని అందులో వజ్రాలు పెట్టిందని ఎలా అనుకుంటారని...తీసుకెళ్లిన వాళ్లు కూడా పెట్టి ఉండొచ్చు కదా అని నిలదీస్తుంది. దీంతో జేడీ, కేడీ వెనక్కి తగ్గుతారు. ఈసారి పక్కా ఆధారాలతో వచ్చి పట్టుకుంటామని తిరిగి వెళ్లిపోతుంటే...యువరాజు వాళ్లను ఆపి మా అమ్మను ఎందుకు ఈకేసులో ఇరికించాలని చూస్తున్నారని కేదార్‌ను నిలదీస్తాడు. మీ అమ్మకు మాతో ఎలాంటి ఆపదరాదురా....ఇప్పుడు మీ అమ్మకు ఉన్న ఆపద అంతా ఆ మీనన్‌తోనే అని అంటాడు....





















