అన్వేషించండి

Jagadhatri Serial Today Feb 27th: నిషిక,వైజయంతి వేసిన పథకం ధాత్రికి తెలిసిపోయిందా...? సురేశ్‌ను ఇంట్లోవాళ్లే దాచేశారని జగధాత్రి తెలుసుకుందా...?

Jagadhatri Serial Today Episode February 27th: నిషిక,వైజయంతి వేసిన పథకం ధాత్రికి తెలిసిపోయిందా...? సురేశ్‌ను ఇంట్లోవాళ్లే దాచేశారని జగధాత్రి తెలుసుకుందా...?

Jagadhatri Serial Today Episode : శ్రీవల్లి ఎంగేజ్‌మెంట్ వద్ద జగధాత్రి,కేదార్ ఉండకుండా చేయడం కోసం సురేష్‌ను కొట్టి యువరాజు దాచేస్తాడు. ఇంతలో నిషిక వెళ్లి జగధాత్రి, కేదార్‌ను బయటకు తీసుకొస్తుంది. ఏమైందని అడిగితే...సురేష్‌ను ఎవరో కిడ్నాప్ చేశారని ఇంటి ముందు నుంచి కారులో ఎక్కించుకుని వెళ్లిపోయారని చెబుతారు.మా కళ్లముందే తీసుకెళ్లారని యువరాజు కూడా మాట కలుపుతాడు. ఆ మాటలు విన్న జగధాత్రి, కేదార్ ఎంతో ఆందోళన చెందుతారు. మీనన్ మనుషులే ఈ పని చేసి ఉంటారని భావిస్తారు. అయితే  వెంటనే ఈ విషయం కౌషికి చెబుదామని కేదార్‌ అనగా...నిషిక వద్దని అంటుంది. ఇప్పటికే మీనన్ వచ్చి చంపుతానని బెదిరించాడని వదిన ఆందోళనపడుతోందని...ఇప్పుడు సురేష్‌ను కూడా కిడ్నాప్ చేశారని తెలిస్తే తట్టుకోలేదని అంటుంది. వాళ్లు మాట్లాడుకుంటుండగానే  కౌషికి  బయటకు వస్తుంది. ఎందుకు అందరూ అలా కంగారుగా ఉన్నారని అడుగుతుంది. ఏం లేదు భోజనాలు వద్ద ఏదో తక్కువ అయ్యాయని తెలిస్తే బయటకు వచ్చామని....నువ్వు లోపలకి వెళ్లి ఎంగేజ్‌మెంట్ పనులు చూడమని చెబుతుంది జగధాత్రి. కౌషికి నిజమేనని లోపలికి వెళ్లిపోతుంది.
               సురేష్‌ను ఎక్కడ కిడ్నాప్ చేశారో ఒకసారి చూపించమని జగధాత్రి అడగ్గా....ఇంటి ముందు బైక్‌ పడేసి అక్కడే సురేష్‌ చెప్పులు పడేసి సిద్ధంగా ఉంచుతారు నిషిక వాళ్లు. ఇక్కడే సురేష్‌ను కొట్టి తీసుకెళ్లారని చెబుతారు. వెంటనే అక్కడ ఉన్న సీసీ కెమెరాలు చూసి జగధాత్రి...ఆ ఫుటేజ్‌ చూస్తే మనకు ఎవరు కిడ్నాప్ చేశారో తెలిసిపోతుంది కదా అని అంటుంది. ఈమాటలు వినగానే వైజయంతి గుండెల్లో రాయిపడ్డట్లు అనిపిస్తుంది. మన గోతిని మనమే తవ్వుకున్నామని అంటుంది. సీసీకెమెరాలు పరిశీలించేందుకు జగధాత్రి,కేదార్‌ వెళ్తారు.అయితే అంతకు ముందే కెమెరాలు ఆఫ్‌ చేసి ఉన్నాయని తెలిసి షాక్‌కు గురవుతారు.నేనే సీసీ కెమెరాలు ఆపేశానని యువరాజు చెప్పడంతో నిషిక వాళ్లు సంతోషపడతారు. ఇప్పుడు ఏం చేద్దామని అనగా....మీరు వెళ్లి పోలీసులకు రిపోర్ట్ చేయండని వైజయంతి అంటుంది. మేము ఇక్కడ పనులన్నీ చూసుకుంటామని అంటుంది. దీంతో జగధాత్రి, కేదార్ హడావుడిగా పోలీసుస్టేషన్‌కు బయలుదేరతారు.
                         మార్గమధ్యలో జగధాత్రికి అనుమానం వస్తుంది. సురేష్‌ను కిడ్నాప్ చేశారంటే ఓకే గానీ...మనం అందరం ఇంట్లో ఉండగా సీసీకెమెరాలు ఆఫ్‌చేసి మరీ కిడ్నాప్ చేయగలరా అని అంటుంది. అంటే ఖచ్చితంగా  ఇది ఇంట్లోవాళ్ల పనేనని అంటుంది. పైగా ఉదయం సురేష్‌ వేసుకున్న చెప్పులు....అక్కడ బైక్‌ వద్ద కిందపడి  ఉన్న చెప్పులు ఒకటి కాదని అంటుంది. దీంతో కేదార్‌కు కూడా అనుమానం బలపడుతుంది. ఖచ్చితంగా ఇంట్లో వాళ్లే సురేశ్‌ను దాచేశారని అంటుంది.ఆ అవసరం ఎవరికి ఉంటుందని అనగా...మనల్ని ఇలా బయటకు పంపించి శ్రీవల్లి ఎంగేజ్‌మెంట్ చేయడం కోసమే నిషిక వాళ్లు ఈ పనిచేశారని అంటుంది. వెంటనే ఈ విషయం కౌషికి చెప్పేస్తానని అని ఫోన్ చేయగా....నిషిక చూసి ఆ ఫోన్ స్విచ్ఛాప్‌ చేస్తుంది. అటు ముహూర్తం  సమయం దగ్గరపడటంతో ఎంగేజ్‌మెంట్ చేసేందుకు అందరూ సిద్ధమవుతారు. ఎలాగైనా ఎంగేజ్‌మెంట్ ఆపాలని కేదార్‌, ధాత్రి ఇంటికి బయలుదేరతారు.

 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 8th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఊబిలో కూరుకుపోయిన క్రిష్! కోతి సాయం.. అండగా వీరాంజనేయుడు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఊబిలో కూరుకుపోయిన క్రిష్! కోతి సాయం.. అండగా వీరాంజనేయుడు!
Godavari Serial Today August 8th: 'గోదావరి' సీరియల్: కిచెన్‌లో 'నువ్వు నాకు నచ్చావ్' సీన్ రిపీట్! కల్యాణ్‌ సింహాద్రి, భువనతో అలా చెప్పాడేంటి?
'గోదావరి' సీరియల్: కిచెన్‌లో 'నువ్వు నాకు నచ్చావ్' సీన్ రిపీట్! కల్యాణ్‌ సింహాద్రి, భువనతో అలా చెప్పాడేంటి?
Nindu Manasulu Serial Today August 8th: నిండు మనసులు: సిద్ధూ ఇక బతకడా? హాస్పిటల్‌లో సిద్ధూని చూసి కుప్పకూలిపోయిన ప్రేరణ!
నిండు మనసులు: సిద్ధూ ఇక బతకడా? హాస్పిటల్‌లో సిద్ధూని చూసి కుప్పకూలిపోయిన ప్రేరణ!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 8th:చిట్టి డీఎన్‌ఏ రిపోర్ట్ మార్చేసిన దమయంతి...సుందరి అసలు చిట్టి అని నమ్మిన రామచంద్రం
నువ్వులేక నేను లేను: చిట్టి డీఎన్‌ఏ రిపోర్ట్ మార్చేసిన దమయంతి...సుందరి అసలు చిట్టి అని నమ్మిన రామచంద్రం

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Rukmini Vasanth : అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
ఈ నెలలో Kia కారు కొంటే రూ.లక్షల్లో ఆదా.. ఏ కారుపై ఎంత డిస్కౌంట్‌ ఉందంటే?
కియా కారు కొనేవాళ్లకు సర్‌ప్రైజ్‌ - రూ.లక్షన్నర మిగిలినట్లే!, ఈ డబ్బుతో మంచి బైక్‌ కొనొచ్చు
Mouneesha Chowdary: బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. జోరుగా ప్రచారం.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు!
Embed widget