Jagadhatri Serial Today May 10th: ‘జగధాత్రి’ సీరియల్: సురేష్‌కు కాఫీ ఇస్తానన్న కౌషికి – రామ్మూర్తి కిడ్నాప్ డ్రామాను కనిపెట్టిన ధాత్రి
Jagadhatri Today Episode: కౌషికి, సురేష్ కు కాపీ ఇస్తాననడంతో వాళ్లిద్దర్ని ఎలాగౌనా విడగొట్టాలని వైజయంతి, నిషిక ఆలోచించడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ ఎంతో ఆసక్తికరంగా జరిగింది.
Jagadhatri Serial Today Episode: రామ్మూర్తిని కొంతమంది రౌడీలు కిడ్నాప్ చేస్తుంటే.. ధాత్రి, కేదార్ చూసి వాళ్లను ఫాలో అవుతారు. ఇంతలో వాళ్లు ధాత్రి వాళ్లకు దొరక్కుండా ఎస్కేప్ అవుతారు. ధాత్రి కంట్రోల్ రూం కు ఫోన్ చేసి కారు నెంబర్ చెప్పి ఆ కార్‌ను సీసీటీవీ పుటేజీ ఆధారంగా ట్రేస్ చేయమని చెప్తుంది. తర్వాత రామ్మూర్తి ఇంటికి వెళ్తారు కేదార్, ధాత్రి. రామ్మూర్తి భార్యను ఏం జరిగిందని అడుతారు. ఎవరో కొంతమంది వచ్చి రామ్మూర్తిని డబ్బు ఇవ్వమని అడిగారని ఆయన లేవని చెప్పడంతో ఆయన్ను ఎత్తుకెళ్లిపోయారని రామ్మూర్తి భార్య చెప్తుంది. ఆమె నుంచి వివరాలు తీసుకుని ధాత్రి, కేదార్ వెళ్ళిపోతారు. కంట్రోల్ రూంకు వెళ్లిన కేదార్, దాత్రి కారు ఎటువెళ్లిందో సీసీటీవీ పుటేజీని పరిశీలిస్తారు. కారులో రామ్మూర్తి కూర్చున్న విధానం సీసీటీవీ లో చూసి షాక్ అవుతారు ధాత్రి, కేదార్‌లు. తర్వాత కౌషికి, కీర్తిని వెతుకుతుంది.
ధాత్రి: ఏం వెతుకుతున్నారు వదిన..?
కౌషికి: కీర్తి కోసం చూస్తున్నాను జగధాత్రి. రూంలో ఉండింది. ఇప్పుడు కనిపించడం లేదు.
కేదార్: ఇందాకా బావతో కలిసి బయటకు వెళ్లడం చూశాను అక్క..
ధాత్రి: బయట ఏమైనా ఉందేమో చూద్దాం పద వదిన..
ముగ్గురూ కలిసి బయటకు వెళ్లి చూడగానే సురేష్, కీర్తి వాటర్‌తో ఆడుకుంటుంటారు.
ధాత్రి: కీర్తి ఇంత మనఃస్ఫూర్తిగా నవ్వడం నేను ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు వదిన. ఒక్కరోజులో కీర్తి ప్రపంచం ఎంత అందంగా మారిపోయిందో చూశారా?
కౌషికి: ఈ అందమైన ప్రపంచంలో ఆ మనిషికి స్థానం లేదు జగధాత్రి. పోగొట్టుకున్నది ఆయనే
ధాత్రి: ఎంత పెద్ద తప్పు అయినా ఇలా జీవిత కాలం శిక్ష వేయడం కరెక్టేనా వదిన.
కౌషికి: తప్పేదో ఒప్పేదో నాకు తెలియదు జగధాత్రి. ఆ మనిషి మా జీవితంలో ఉంటే మేము ప్రశాంతంగా ఉండలేము. అయినా కీర్తికి తండ్రి ప్రేమ అవసరం లేకుండా ఎలా పెంచాలో నాకు తెలుసు.
కేదార్: తల్లిగా తండ్రి ప్రేమను కూడా పంచగలవు కానీ తండ్రి ఇచ్చే నమ్మకాన్ని, భరోసాని, ధైర్యాన్ని మాత్రం ఎవ్వరూ ఇవ్వలేరు అక్కా. ఆ విషయం నీకు నాకు మాత్రమే బాగా తెలుసు. తండ్రి లేక నువ్వు.. తండ్రి ఎక్కడున్నాడో తెలియక నేను పడిన బాధలు చాలు అక్క.
అంటూ కేదార్, ధాత్రి కౌషికిని కన్వీన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. కీర్తి కోసమైనా మీరిద్దరూ కలిసి ఉండాలని చెప్తారు. దూరం నుంచి కౌషికి వాళ్లను చూసిన సురేష్, కీర్తిని తీసుకుని దగ్గరకు వస్తాడు. ధాత్రిని కాఫీ అడగ్గానే కౌషికి సురేష్‌కు తానే స్వయంగా కాఫీ తీసుకొస్తానని చెప్పి లోపలికి వెళ్తుంది. కౌషికి, సురేష్‌కు కాపీ ఇస్తానని చెప్పడాన్ని విన్న వైజయంతి, నిషిక కుళ్లుకుంటారు.
వైజయంతి: విషయం కాపీ దాకా వచ్చిందమ్మీ.. వెంటనే ఏదో ఒకటి చేసి వీళ్లిద్దరి మధ్య గోడ కట్టేయాలి.
నిషిక: ప్లాన్ రెడీగా ఉంది అత్తయ్యా.. దానికి ముందు మనకు ఒక ఈగ కావాలి. మనకు ఎక్కువ టైం లేదు. వదిన కాఫీ తెచ్చేలోపే మనం ఈ పని చేయాలి.
మరోవైపు కౌషికి కాఫీ తీసుకొచ్చి సురేష్‌కు ఇచ్చి వెళ్లిపోతుంది. సురేష్ కాఫీ తాగేలోపే ఫోన్ వస్తుంది. కాఫీ పక్కన పెట్టి ఫోన్ మాట్లాడటానికి వెళ్తాడు సురేష్. ఇదే అదనుగా నిషిక ఈగను తీసుకుని వచ్చి కాఫీలో వేసి వెళ్లిపోతుంది. సురేష్ వచ్చి కాఫీ తాగబోతూ ఈగను చూసి ఆగిపోతే నిషిక వచ్చి కౌషికి కావాలనే ఈగను వేసి తీసుకొచ్చిందని చెప్తుంది. దీంతో కౌషికి గురించి నాకు బాగా తెలుసు తాను అలాంటిది కాదని సురేష్ కాఫీ తీసుకెళ్లి సింకులో పారబోస్తాడు. సురేష్ కాపీ పారబోయడాన్ని కౌషికి చూస్తుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: పద్మ విభూషణ్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి - వీడియో వైరల్