అన్వేషించండి

Jagadhatri Serial Today March 29th: ‘జగధాత్రి’ సీరియల్‌: ధాత్రి, కేదార్‌ లకు మరో నెల గడువు ఇచ్చిన కౌషికి – కోపంతో రగిలిపోయిన నిషిక

Jagadhatri Today Episode: ధాత్రి, కేదార్ లకు మరో నెల గడువు ఇవ్వడంతో నిషిక ఇరిటేటింగ్ ఫీలవుతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఇంట్రస్టింగ్ గా జరిగింది.

Jagadhatri  Serial Today Episode: ధాత్రి చూపించిన ఫోటో ఫేక్‌ అని సుధాకర్‌ అనడంతో మరి నిజం ఏంటని ధాత్రి సుధాకర్‌ను అడుగుతుంది. దీంతో సుధాకర్‌ తాము ఇలాంటి ఫోటో దిగలేదు అనబోయి ఆగిపోతాడు. దీంతో ధాత్రి పూర్తి చేయండి మామయ్యా. కేదార్‌ మీ కొడుకే అన్న విషయం మీ మనసుకు తెలుసు కానీ ఎందుకు ఒప్పుకోవడం లేదని అడుగుతుంది. దీంతో కౌషికి కూడా బలవంతంగా ఒప్పించడం కరెక్టు కాదని ఇక మీరు ఇంట్లోంచి వెళ్లండి అని చెప్తుంది. దీంతో ధాత్రి అయితే మేము మీడియాలోకి వెళ్తాము అని చెప్పగానే భయపెడుతున్నావా? ధాత్రి మేం భయపడేరకం కాదు అని కౌషికి అనగానే.. మీరు భయపడుతూనే పైకి గాంభీర్యం నటిస్తున్నారు వదిన అంటుంది. ఇంతలో లోపలి నుంచి బయటికి వచ్చిన నిషిక దూరం నుంచి వీళ్లనే గమనిస్తుంది. ఏం మాట్లాడుకుంటున్నారని ఆలోచిస్తుంది.

కౌషికి: ఏం చేద్దాం బాబాయ్‌. ఈ ఒక్కసారి భయపడితే ఇంకా మనల్ని భయపెడుతూనే ఉంటారు.

సుధాకర్‌: అలా అని ఈ ఫోటో పట్టుకుని మీడియా మెట్లు ఎక్కితే మన కోట కూలిపోతుంది కౌషికి.

కౌషికి: ఇంత పచ్చి అబద్దాన్ని ఎవరైనా ఎందుకు నమ్ముతారు బాబాయ్‌.

సుధాకర్‌: నమ్మకుంటే వచ్చిన నష్టం ఏం లేదు కానీ నమ్మితే నష్టపోయేది మనమే కౌషికి

అనగానే కౌషికి మీరు ఇంట్లో ఉండటానికి ఒప్పుకుంటున్నాను అని చెప్పడంతో ధాత్రి, కేదార్‌ హ్యాపీగా ఫీలవుతారు. త్వరలోనే ఆ సాక్ష్యాలు తీసుకొస్తామని చెప్తుంది ధాత్రి. ఇంతలో లోపలికి వచ్చిన నిషిక వాళ్లు ఏవో మాట్లాడుకుంటున్నారు. చూస్తే ఇంకొన్ని రోజలు ఇక్కడే తిష్టవేసేటట్టే ఉన్నారు అంటుంది. దీంతో వాళ్లు ఇక్కడే ఉంటే వాళ్లను చంపేసి నేను జైలుకు పోతాను అని యువరాజ్‌ అంటాడు. ఇంతలో కేదార్‌, ధాత్రి, కౌషికి, సుధాకర్‌ లోపలికి వస్తారు. ధాత్రిని బయటకు వెళ్లమని నిషిక వెళ్లగొడుతుంటే కౌషికి అడ్డుపడుతుంది. 

నిషిక: వీళ్లకు మీకు ఈ ఇంటికి ఉన్న సంబంధం ఎంటి? మీరెందుకు వాళ్లు చెప్పినట్లు వింటున్నారు. ఇందాక మీరు మాట్లాడం నేను చూశాను.  మీరు చేసిన తప్పులకు సాక్ష్యాల వీళ్ల దగ్గర ఉన్నాయి వాటిని అడ్డు పెట్టుకుని మిమ్మల్ని బెదిరిస్తున్నారు.

కౌషికి: మేం తప్పు చేయడం ఏంటి? నన్ను వాళ్లు బెదిరించడం ఏంటి నిషిక

నిషిక: దాని చేతిలో ఉన్న పేపర్‌ చూపించగానే మీరు మామయ్యగారు కంగారుపడ్డారు. భయపడ్డారు. దీని చేతిలో ఏముందో చూస్తే అసలు విషయం బయటపడుతుంది.

 అంటూ ధాత్రి చేతిలోని ఫోటో నిషిక లాక్కుంటుంటే కౌషికి అడ్డుపడుతుంది. దీంతో నిషిక, కౌషికిని తిడుతుంది. సుధాకర్‌ నిషికను తిడతాడు. వాళ్లను ఇంట్లో ఉండమని చెప్పింది నేను మీకేమైనా సమస్య ఉంటే నాతో మాట్లాడండి. అనగానే వైజయంతి, యువరాజ్‌, నిషిక షాక్‌ అవుతారు. వీళ్లు ఒక్క క్షణమైనా ఈ ఇంట్లో ఉండటానికి నేను ఒప్పుకోను వీళ్లను ఎందుకు ఉండనిచ్చారో చెప్పండి అనగానే నిషిక తెగేదాకా లాగుతుందేమోనని వైజయంతి మనసులో అనుకుని నిషికకు సర్ధిచెప్పి లోపలికి తీసుకెళ్తుంది.  తర్వాత ధాత్రి, కేదార్‌ కిచెన్‌లో వెజిటేబుల్స్‌ కట్‌ చేస్తుంటే నిషిక, వైజయంతి చూసి తిట్టుకుంటారు.  

కౌషికి: ఎవరి సంతోషం చూసి నిషి అంతలా తట్టుకోలేక పోతున్నావు.

నిషిక: అంత వెటకారం ఎందకులేండి వదిన.

కౌషికి: మమకారం చూపించినా వద్దంటావు. వెటకారం చూపించినా వద్దంటావు. ఇలా అయితే ఎలా నిషి.

నిషిక: ఉత్తి మాటలు, ఉత్తి ప్రేమలు మాకొద్దులే వదిన. నీ మనసులో ఎవరి మీద ప్రేమ ఉందో మేము చూశాము కదా..

అనగానే వైజయంతి కల్పించుకుని ధాత్రి, కేదార్‌లను తిడుతుంది. కౌషికి ధాత్రి, కేదార్‌ లను పిలిచి ఇంట్లో మీరు ఏ పని చేయోద్దని అన్ని పనులు ఇకనుంచి నిషికనే చూసుకుంటుందని చెప్పి కౌషికి వెళ్లిపోతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.

ALSO READ: పంజాబీ డ్రెస్సులో రంగమ్మత్త- ముసిముసి నవ్వులతో గిలిగింత

 

టాప్ హెడ్ లైన్స్

Nindu Manasulu Serial Today October 16th: నిండు మనసులు: కారులో పడుకున్న సిద్ధూ! కనికరించని ప్రేరణ! ప్లాన్ ఫెయిల్!
నిండు మనసులు: కారులో పడుకున్న సిద్ధూ! కనికరించని ప్రేరణ! ప్లాన్ ఫెయిల్!
Godavari Serial Today October 16th: 'గోదావరి' సీరియల్: ఒప్పందంతో ఒకే బెడ్ ఎక్కేసిన జాను, సంజు! నందు కొత్త అవతారం!
'గోదావరి' సీరియల్: ఒప్పందంతో ఒకే బెడ్ ఎక్కేసిన జాను, సంజు! నందు కొత్త అవతారం!
Nuvvu leka Neanu Lenu Serial Today Oct 16: ఉద్యోగం పోవడంతో హోటల్‌లో టీమాస్టార్‌గా చేరిన విక్కీ..రాధమ్మ హోటల్‌లోనే టిఫిన్‌ ప్లేట్లు కడుగుతూ జీవనం
నువ్వులేక నేను లేను: ఉద్యోగం పోవడంతో హోటల్‌లో టీమాస్టార్‌గా చేరిన విక్కీ..రాధమ్మ హోటల్‌లోనే టిఫిన్‌ ప్లేట్లు కడుగుతూ జీవనం
Gundeninda Gudigantalu Oct 16: గుణకోసం బాలు కారుతాళం కొట్టేసిన రోహిణి...దొంగ అనుకుని చితక్కొట్టిన ఇంట్లో వాళ్లు
గుండెనిండా గుడిగంటలు: గుణకోసం బాలు కారుతాళం కొట్టేసిన రోహిణి...దొంగ అనుకుని చితక్కొట్టిన ఇంట్లో వాళ్లు

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan YSRCP Local Body Elections: స్థానిక ఎన్నికల్లో జగన్ సంచలన వ్యూహం - ఇన్‌చార్జ్‌లకు స్వేచ్ఛ.. వైసీపీ కార్యకర్తలకు బిగ్ టెస్ట్!
స్థానిక ఎన్నికల్లో జగన్ సంచలన వ్యూహం - ఇన్‌చార్జ్‌లకు స్వేచ్ఛ.. వైసీపీ కార్యకర్తలకు బిగ్ టెస్ట్!
Vijaya Dairy Milk Price: విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
CM Revanth Reddy: ముఖానికి నాట్లు వేసుకొని తిరుగుతున్నాడు.. KTRపై సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు
ముఖానికి నాట్లు వేసుకొని తిరుగుతున్నాడు.. KTRపై సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు
Anupama Parameswaran : పెళ్లికి ముందే బిడ్డ కావాలని ఉండేది - సినిమాలకు స్వస్తి చెప్పాలనుకున్నా... అనుపమ పరమేశ్వరన్ రియాక్షన్
పెళ్లికి ముందే బిడ్డ కావాలని ఉండేది - సినిమాలకు స్వస్తి చెప్పాలనుకున్నా... అనుపమ పరమేశ్వరన్ రియాక్షన్
Starc Availability Uncertainty: నెక్స్ట్ సీజన్ కు స్టార్క్ దూరం కానున్నాడా..! ఆ కార‌ణంతో ఫ్రాంచైజీలకు టెన్షన్
నెక్స్ట్ సీజన్ కు స్టార్క్ దూరం కానున్నాడా..! ఆ కార‌ణంతో ఫ్రాంచైజీలకు టెన్షన్
YS Jagan Cockroach Janata Party Support: CJP నేతలకు జగన్ సంపూర్ణ మద్దతు - బీజేపీతో వైఎస్సార్‌సీపీ దోస్తీకి శాశ్వత ముగింపేనా?
CJP నేతలకు జగన్ సంపూర్ణ మద్దతు - బీజేపీతో వైఎస్సార్‌సీపీ దోస్తీకి శాశ్వత ముగింపేనా?
Tesla Roadster: రాకెట్‌లా గాల్లోకి దూసుకెళ్లే కారు.. రోడ్డుపై 0.81 సెకన్లలో 100 కి.మీ వేగం! టెస్లా కొత్త రోడ్‌స్టర్‌లో ఇన్ని వింతలా?
గాల్లో ఎగిరిన టెస్లా కారు.. ఒక్క సెకనులో 100km స్పీడ్‌.. ప్రపంచాన్ని షేక్‌ చేస్తున్న 'ఫ్లైయింగ్‌ కార్‌' వీడియో
El Nino Food Price Rise: ఎల్‌నినో పేరిట దోపిడీ - దేశంలో ధాన్యానికి కొరత లేకపోయినా ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?
ఎల్‌నినో పేరిట దోపిడీ - దేశంలో ధాన్యానికి కొరత లేకపోయినా ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?
Embed widget