Jagadhatri Serial Today June 7th: ‘జగధాత్రి’ సీరియల్: జేడీకి వార్నింగ్ ఇచ్చిన కౌషికి – కమలాకర్ ను అరెస్ట్ చేస్తామన్న జేడీ
Jagadhatri Today Episode: సాధు ఆఫీసుకు వెళ్లిన కౌషికి, ధాత్రి, కేదార్ లకు వార్నింగ్ ఇస్తుంది. దీంతో కమలాకర్ ను అరెస్ట్ చేస్తామని కేదార్ చెప్పడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా జరిగింది.
Jagadhatri Serial Today Episode: యువరాజ్‌ను కలవడానికి కౌషికి, వైజయంతి, కమలాకర్ ముగ్గురు కలిసి సాధు అఫీసుకు వస్తారు. వాళ్లను చూసిన ధాత్రి, కేదార్ షాక్ అవుతారు. ఇంతలో వాళ్లు సాధు గారు ఎక్కడున్నారు అని ధాత్రిని అడగ్గానే ధాత్రి మాస్క్ పెట్టుకుని అక్కడుంటారు అని చెప్తుంది. అందరూ కలసి సాధు దగ్గరకు వెళ్తుంటే చెక్ చేసి లోపలికి పంపిస్తారు. ఇంతలో వైజయంతి కోపంగా ధాత్రిని తిడుతుంది.
వైజయంతి: ఏందమ్మీ నువ్వేనా నా కొడుకును ఈడికి తీసుకొచ్చింది. నా కొడుకు ఆ సూరిని చంపాడు అనడానికి ఏం సాక్ష్యాలు ఉన్నాయని అరెస్ట్ చేశారు.
ధాత్రి: పోలీసులు అరెస్ట్ చేసేముందు ఎవిడెన్స్ గురించి చెప్పే ఉంటారు. మీకిచ్చిన ఎఫ్‌ఐఆర్‌లో కూడా ఈ విషయం ఉండే ఉంటుంది చూసుకోండి.
కౌషికి: నా తమ్ముడు ఈ హత్య చేయలేదని నీక్కూడా తెలుసు. నీ వెనక ఉండి ఇదంతా ఎవరు నడిపిస్తున్నారు. ఆ దివ్యాంకనా?
కమలాకర్: అది ఎవరైనా కానీ మాకు అనవసరం వాళ్లు ఎంత ఇస్తామన్నారో చెప్పు దానికి రెట్టింపు మేము ఇస్తాం.
అనగానే దాత్రి కోపంగా కమలాకర్ తిడుతుంది. మీరు ఇలాగే మాట్లాడితే మిమ్మల్ని కూడా అరెస్ట్ చేయాల్సి వస్తుందని చెప్తుంది. దీంతో కమలాకర్ కోపంగా ఫైల్స్ అన్ని కింద పడేస్తాడు. నన్ను అరెస్ట్ చేస్తారా? అంటూ నన్ను టచ్ కూడా చేయలేరు. అనగానే కౌషికి కూడా నా తమ్ముణ్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అని అడుగుతుంది. లోపల నుంచి కౌషికి వాయిస్ విన్న యువరాజ్ తనను తాను గాయపరుచుకుంటాడు. గట్టిగా అరుస్తుంటాడు. అది విన్న వైజయంతి పరుగెత్తుకుంటూ లోపలికి వెళ్తుంది. దీంతో ధాత్రి వైజయంతిని లాగిపడేస్తుంది. దీంతో కౌషికి, ధాత్రికి వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది. తర్వాత ఇంట్లో అందరూ ఆలోచిస్తూ కూర్చుని ఉంటారు. ఇంతలో ధాత్రి, కేదార్ అక్కడికి వస్తారు.
నిషిక: కంగ్రాచ్యులేషన్స్ జగధాత్రి నువ్వు అనుకున్నది సాధించేశావు. నువ్వు కోరుకున్నది జరిగిపోయింది.
ధాత్రి: నేను అనుకున్నది జరగడమేంటి నిషి.
నిషి: ఇంకా ఎందుకే నటిస్తున్నావు. నా కాపురం నాశనం చేయాలనే కదా నువ్వు ఇక్కడ అడుగుపెట్టావు.
కేదార్: యువరాజ్ సూరి మామను హత్య చేశాడు. పోలీసులు యువరాజ్‌ను అరెస్ట్ చేశారు. దానికి ధాత్రికి సంబంధం ఏంటి?
అనగానే కమలాకర్ కేదార్‌ను తిడతాడు. అందరూ కలిసి జేడీని తిట్టుకుంటారు. దీంతో ఒక పోలీస్ ఆఫీసర్ లా ఆమె ఏం చేయాలో అదే చేసిందని కేదార్ చెప్తాడు. ఆ జేడీ పక్కన ఉన్నవాడు కూడా చాలా ఓవర్ చేశాడు వాడికి మన వజ్రపాటి పవర్ ఏంటో తెలిసేలా చేయాలని కమలాకర్ చెప్తాడు. దీంతో కేదార్, ధాత్రి పోలీసులను వెనకేసుకొస్తారు.
కౌషికి: ఇందాకటి నుంచి చూస్తున్నాను మీరు ఇద్దరు ఏంటి వాళ్లను సపోర్టు చేస్తున్నారు.
నిషి: అయినా వాళ్లిద్దర్ని అంటుంటే అదేదో మిమ్మల్ని అన్నట్లు తెగ బాధపడిపోతున్నారు.
ధాత్రి: సపోర్టు ఏం లేదు నిషి పోలీస్ అంటే మాకున్న రెస్పెక్ట్ తో అలా మాట్లాడాము అంతే వాళ్లు తప్పును ఆపడం తప్పా తప్పు చేయడం తెలియని వాళ్లని నమ్మకంతో అలా మాట్లాడాము అంతే
కేదార్: అయినా యువరాజ్ ఏ తప్పు చేయకుంటే ఎవరు ఇరికించాలని చూసినా యువరాజ్ నిర్ధోషిగా బయటకు వస్తాడు. అదే తప్పు చేస్తే శిక్ష పడకుండా ఎవరు అడ్డుపడినా ఎవ్వరూ కాపాడలేరు.
అని చెప్పగానే ఆ జేడీకి నా తమ్ముడు ఏ తప్పు చేయలేదని నిరూపిస్తాను. వాళ్లకు ఈ వజ్రపాటి కౌషికితో పెట్టుకుంటే ఏం జరుగుతుందో చూపిస్తాను. అంటూ కౌషికి వెళ్లిపోతుంది. తర్వాత ధాత్రికి సాధు ఫోన్ చేసి శివయ్య లొకేషన్ ట్రేస్ చేశామని మీరు వెళ్లి శివయ్యను తీసుకురమ్మని చెప్తాడు. దీంతో ధాత్రి శివయ్యతో పాటు ఆ మీనన్ ను కూడా తీసుకొస్తామని చెప్తుంది. మరోవైపు శివయ్యను మీనన్ మనుషులు టార్చర్ చేస్తుంటారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: దేశంలో అత్యంత ధనిక ఎంపీలు తెలుగువాళ్లే, వీరికి వేల కోట్ల ఆస్తి ఎలా?