Jagadhatri Serial Today February 21st: ‘జగధాత్రి’ సీరియల్: ధాత్రి, కేదార్‌లను ఫాలో అయిన యువరాజ్ - ప్రియను పట్టుకున్న ధాత్రి, కేదార్
Jagadhatri Today Episode: ధాత్రి, కేదార్ చేజ్ చేస్తూ ప్రియను పట్టుకోవడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ ఆసక్తి కరంగా జరిగింది.
Jagadhatri Serial Today Episode: ధాత్రి, కేదార్ కారులో దిగుతారు. వారిని చూసిన యువరాజ్ వీళ్లెవరో ఢిల్లీ నుంచి వచ్చిన ఆఫీసర్ల లాగా ఉన్నారు. అని దగ్గరకు వెళ్లి వాళ్లను పిలుస్తాడు యువరాజ్. యువరాజ్‌ను చూసిన ధాత్రి, కేదార్ షాక్ అవుతారు. అయితే కేదార్, జగధాత్రికి మాస్కులు ఉండటంతో ఎవరు మీరు అని అడుగుతాడు యువరాజ్. అయితే తాము మాట్లాడితే గుర్తు పడతాడని కేదార్ అనుకుంటాడు. అయితే మిమ్మల్ని ఎక్కడో చూసినట్లు ఉంది ఎవరు మీరు అని యువరాజ్ అడగడంతో ధాత్రి హిందీలో వెళ్దాం పద అని ఇద్దరు కలిసి వెళ్లిపోతారు. యువరాజ్ వారిని బైక్ మీద ఫాలో అవుతాడు.
ధాత్రి: యువరాజ్ ఏంటి ఇక్కడ ఉన్నాడు. మాస్క్ లేకుండా ఉంటే ఈరోజు దొరికిపోయేవాళ్లం.
కేదార్: అవును కచ్చితంగా అనుమానం వచ్చే ఉంటుంది. ఇంటికి వెళ్లగానే కచ్చితంగా అడుగుతాడు.
అని ఇద్దరూ కలిసి వెళ్తుంటే మరోవైపు ప్రియ ఇంట్లో టెన్షన్ పడుతుంది. ఎవరైనా వచ్చి ఏమైనా అడిగినా చెప్పొద్దని గెస్ట్ హౌస్ సెక్యూరిటీకి ఫోన్ చేస్తుంది. ఇంతలో ధాత్రి, కేదార్ గెస్ట్ హౌస్‌కు వెళ్లి సెక్యూరిటీ గార్డును ఎంక్వైరీ చేస్తారు. ప్రియ ఫోటో చూపించి ఈమె ఎవరో తెలుసా అని అడగ్గానే సెక్యూరిటీ గార్డు భార్య ప్రియమ్మ అని చెప్తుంది. తాను మినిస్టర్ గారు ఎప్పుడూ గెస్ట్ హౌస్‌కు వచ్చేవారని వాళ్లు వచ్చినప్పుడు ఎవ్వరినీ లోపలికి రానిచ్చేవారు కాదని సెక్యూరిటీ చెప్పడంతో.. ఇప్పుడు స్టోరీ మొత్తం నాకు అర్థం అవుతుంది కేదార్ అంటుంది ధాత్రి. ఇంతలో ప్రియ ఫోన్ చేయడంతో సెక్యూరిటీ ప్రియ ఫోన్ చేస్తుందని ధాత్రికి చెప్తాడు. అయితే స్పీకర్ పెట్టి మాట్లాడమని ధాత్రి చెప్తుంది.
ప్రియ: నేను చెప్పేది జాగ్రత్తగా విను. నాకోసం ఎవరైనా వచ్చి ఏమైనా అడుగుతే తెలియదని చెప్పు. అసలు నేను అక్కడికి ఎప్పుడూ రాలేదని చెప్పు.
ధాత్రి: హలో ఎలా ఉన్నావు ప్రియ.
ప్రియ: ఎవరు?
ధాత్రి: ఎంటి ప్రియ మొన్న ఇంటికి వచ్చి అంతసేపు మాట్లాడాను. అప్పుడే నా గొంతు మర్చిపోయావా?
అనగానే ప్రియ ఫోన్ కట్ చేస్తుంది. వీళ్లు పారిపోయే చాన్స్ ఉంది వెళ్దాం పద కేదార్ అని కారు దగ్గరకు రాగానే యువరాజ్ బైక్ మీద వచ్చి కేదార్ వెనక ఒక స్టిక్కర్ అటించి వెళ్తాడు. నువ్వు ఇదే స్టిక్కర్‌తో ఇంటికి వస్తే మీరేనని కన్‌ఫం అవుతుంది. అనుకుంటాడు యువరాజ్. మరోవైపు ప్రియ పారిపోతుంది. ధాత్రి, కేదార్ కారులో వెళ్తుంటారు.
ధాత్రి: మనం తన కోసం ఇంటికి వెళ్తామని తెలిసిన ప్రియ ఇంకా ఇంట్లో ఎందుకు ఉంటుంది.
కేదార్: ఏమైంది జేడీ. ఇప్పుడెలా జేడీ ఆ ప్రియా కోసం ఎక్కడని వెతుకుదాం.
ధాత్రి: ఇలాంటి టైంలో కచ్చితంగా బయటకు వెళ్లిపోవాలని చూస్తుంది. కానీ ఎక్కడకి ఎలా వెళ్తుంది. మనం ఎక్కడో ఏదో మిస్ చేస్తున్నాం కేదార్. కళ్ల ముందే ఉన్నా మనం పట్టించుకోలేదు.
అని ఆలోచిస్తుండగానే ప్రియాకు బాయ్ ఫ్రెండ్ ఉన్న విషయం గుర్తుకు వచ్చి వాళ్ల పాస్‌పోర్ట్ చూసిన విషయం గుర్తు చేసుకుని ధాత్రి, కేదార్‌లో కలిసి ప్రియ కారుకు ఎదురువెళ్తారు. ప్రియను ప్రియ బాయ్‌ప్రెండ్‌ను పట్టుకుంటారు. ఇంతలో ప్రియ బాయ్‌ఫ్రెండ్ అరెంజ్ చేసిన రౌడీలు ధాత్రి, కేదార్‌ల మీదకు వస్తారు. వాళ్లను చితక్కొట్టి ప్రియని నిజం చెప్పమని అడగ్గానే మినిస్టర్ మర్డర్ జరిగిన రోజు ఏం జరిగిందో మొత్తం వివరిస్తుంది ప్రియ. తనకు ప్రెగ్నెసీ వచ్చిందని చెబితే అబార్షన్ చేయించుకోమని కొట్టబోయాడని ఇంతలో తన బాయ్ ఫ్రెండ్ వచ్చి గొడవ చేయడంతో ఆ గొడవలో మినిస్టర్ చనిపోయాడని ప్రియ చెప్తుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
Also Read: తల్లికాబోతున్న దీపికా పదుకొనె? - బేబీ బంప్ ఫొటో వైరల్!