Jagadhatri Serial Today December 21st: ‘జగధాత్రి’ సీరియల్: నిజం తెలుసుకున్న ధాత్రి – వైజయంతికి కొత్త ట్రీట్‌మెంట్ ఇచ్చిన జగధాత్రి
Jagadhatri Today Episode: వైజయంతికి పక్షవాతం రాలేదన్న విషయం జగధాత్రి తెలుసుకోవడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఫన్నీగా జరిగింది.
Jagadhatri Serial Today Episode: వైజయంతికి పక్షవాతం నిజంగా వచ్చిందా..? లేదా యాక్టింగ్ చేస్తుందా..? అని ధాత్రి అనుమానిస్తుంది. ధాత్రికి అనుమానం వచ్చిందేమోనని భయపడుతూనే ఏందమ్మీ అట్టా చూస్తున్నావు వెళ్లి తినడానికి ఏమైనా తీసుకురాపో అని చెప్తుంది. దీంతో సరే తీసుకొస్తాను అని చెప్తూనే వైజయంతిని మిర్రర్ వైపు కూర్చోబెట్టి నగల గురించి చెప్తుంటే వైజయంతి మామూలుగా మారిపోయి దాత్రిని తిడుతుంది. వైజయంతిని మిర్రర్‌లో చూస్తుంది. అమ్మా అత్తయ్య ఇదంతా నాటకమా..? ఆస్థిలో కేదార్‌కు ఎక్కడ ఎక్కువ రాస్తారో అని నాటకం ఆడుతున్నావా..? అనుకుని మీ నోటితోనే నిజం చెప్పించకపోతే నా పేరు జగధాత్రి కాదు అని వెళ్లిపోతుంది. ధాత్రి, కేదార్ బయటకు వెళ్తుంటే కౌషికి పిలుస్తుంది.
కౌషికి: జగధాత్రి, కేదార్ మీరు కూడా రండి బ్రేక్ పాస్ట్ చేద్దురు కానీ..
ధాత్రి: వదిన నేను ఇప్పుడు బ్రేక్ పాస్ట్ చేయను అత్తయ్యకు బాగయ్యే వరకు ఉపవాసం ఉంటున్నాను
సుధాకర్: చాలా సంతోసంగా ఉందమ్మా జగధాత్రి.
నిషిక: అంత ప్రేమ, బాధ్యత ఉన్నవాళ్లు అత్తయ్యను వదిలేసి స్కూల్‌కు ఎలా వెళ్తారు.
కాచి: పెద్దమ్మ కంటే నీకు స్కూలే ఎక్కువా జగధాత్రి.
కేదార్: కాచి స్కూల్ లో ధాత్రి మాత్రమే చేయాల్సిన పని ఉంది. కానీ ఇక్కడ పిన్నిని మీరు కూడా చూసుకోవచ్చు
యువరాజ్: మా అమ్మకు పక్షవాతం రావడానికి మీరే కారణం కాబట్టి మీరు మా అమ్మను చూసుకోవాలి.
అని యువరాజ్ చెప్పగానే సుధాకర్ కోప్పడతాడు. ఎవరూ చూసుకోకపోయినా నేను చూసుకుంటాను అని సుధాకర్ చెప్పగానే ఒక్కోక్కరు ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకుంటారు. తర్వాత ధాత్రి నేనే చూసుకుంటాను అని లోపలికి వెళ్తుంది. అదేంటి ధాత్రి మనం ఈరోజు హీరోయిన్ ఇంటికి వెళ్లాలి అనుకున్నాం కదా అనగానే ఏదో ఒకటి చేసి వెళ్దాం అని ధాత్రి చెప్తుంది. మరోవైపు వైజయంతి ఏదో ఒకటి చేసి ఆ జగధాత్రి, కేదార్ ఇంట్లోంచి పారిపోయేలా చేయాలని అనుకుంటుంది.
ధాత్రి: అత్తయ్యగారు మీరు భోజనం చేశాక నేను బయటకు వెళ్లాలి. మీకు టాబ్లెట్స్ తీసుకురావాలి.
వైజయంతి: ఇదేంటి ఇది నిజంగా పక్షవాతం మందులు తీసుకొస్తుందా ఏంటి….? ఇదేంది అన్నంలోకి ఇంత ఉప్పు వేస్తుంది. (అని మనసులో అనుకుంటుంది)
ధాత్రి అన్నంలోకి ఉప్పు, కారం కలుపుతుంటే ఎంటని వైజయంతి సైగ ద్వారా అడుగుతుంది.
ధాత్రి: ఏం కాదు అత్తయ్యగారు ఇలాంటి ఫుడ్డు మీరు రెండు రోజులు తింటే చాలు నడవడం కాదు. లేచి పరుగెడతారు.
వైజయంతి: కొంపదీసి దీనికి అనుమానం వచ్చిందా ఏంటి..?
ధాత్రి: చూడండి అత్తయ్య గారు ఈ ట్రీట్‌మెంట్‌లో ముందు ఒక ముద్ద మింగగానే ఒంట్లో ఉన్న నరాల్నీ యాక్టివ్ అవుతాయట. రెండో ముద్దకు కపాలంలో ఉన్న నాడులన్నీ పరుగెడతాయట.
అంటూ గొడ్డు కారం, ఉప్పు వేసి కలిపిన అన్నం తినిపిస్తుంది. కారం ఎక్కువ అయి వైజయంతి కారంతో గిలగిలా కొట్టుకుంటుంది. బలవంతంగా ధాత్రి కారం కలిపిన అన్నం తినిపిస్తుంది. ఇంతలో అందరూ వస్తారు. ఏమైందని అడుగుతారు. ఏం లేదు మామయ్యగారు అత్తయ్య వేసుకునే టాబ్లెట్ ఒకటి మిస్ అయింది అది వేసుకోకపోతే ఇలాగే మంటలు వస్తాయి. అని ధాత్రి చెప్పగానే ఒక్కోక్కరు ఒక్కో ముద్ద అన్నం తినిపిస్తారు. తర్వాత ధాత్రి, కేదార్ ఇద్దరూ హీరోయిన్ ఇంటికి వెళ్తారు. ఇంతటితో ఇవాల్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!