Jagadhatri Serial Today August 22nd: ‘జగధాత్రి’ సీరియల్: రక్తపుమడుగులో గిలగిల కొట్టుకున్న పరంధామయ్య – ఇంట్లోంచి వెళ్లిపోతామన్న సురేష్
Jagadhatri Today Episode: కౌషికిని ఇంట్లోంచి గెంటివేసిన పరంధామయ్య రాత్రికి రక్తపుమడుగులో గిలగిలా కొట్టుకోవడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.
Jagadhatri Serial Today Episode:
వైజయంతి, నిషికల మాటల విన్న పరంధామయ్యా ఫుల్లుగా తాగి వచ్చి కౌషికిని ఇంట్లోంచి వెళ్లిపోమ్మని తిడతాడు. దీంతో ధాత్రి ఎంత చెప్పినా వినడు. ఇంతలో సురేష్ వచ్చి నా భార్యను ఎందుకు ఇంట్లోంచి వెళ్లగొడుతున్నారు అని అడుగుతాడు. దీంతో నా పరువు నా కళ్ల ముందే తీస్తుంటే నేను తట్టుకోలేని అంటాడు. దీంతో నేను మీ పరువు ఎందుకు తీస్తున్నానో చెప్పండి అని అడుగుతుంది కౌషికి. దీంతో ఆదిలక్ష్మీ ఈ అమ్మాయిని ఇంట్లోంచి వెళ్లిపోమ్మని చెప్పు నేను మాట అంటే తట్టుకోలేదు. అందుకే ఇక్కణ్నుంచి వెళ్లిపోమ్మంటున్నాను అని కౌషికిని మెడ పట్టి తోస్తాడు. ధాత్రి వచ్చి అడ్డు పడుతుంది.
ధాత్రి: వదిన ఇప్పుడు ఈయన తాగి ఉన్నారు. మనం ఏం మాట్లాడినా పెద్ద గొడవే అవుతుంది. ఇప్పుడు వెళ్లిపోయి. రేపు పొద్దునే వచ్చి మాట్లాడుకుందాం.
నిషిక: అత్తయ్యా ఇప్పుడే తెగదెంపులు చేసుకుని వెళ్లిపోదామనుకుంటే ఇదేంటి అత్తయ్యా పొద్దునే మాట్లాడుకుందాం అంటుంది.
వైజయంతి: నేను అందుకుంటా చూడమ్మి… ఏంది మల్లా వచ్చేది వచ్చినందుకు జరిగిన మర్యాద చాలు. పదమ్మి పోదాము.
కౌషికి: రాను పిన్ని.. ఆరేళ్ల ముందు ఒక రాత్రి ఇలానే నన్ను ఇంట్లోంచి పంపిచేస్తే.. ఆయనలానే అర్థం లేని ఆవేశాలకు పోయి ప్రశ్నించకుండానే ఇంట్లోంచి వెళ్లిపోయాను. దాని వల్ల ఇన్నేళ్లు ఈ ఇంట్లో ఎవ్వరూ ఆనందంగా లేరు. ఇప్పుడు ఇంతమంది ఆనందాన్ని ఈయన కోపానికి బలి ఇవ్వలేను. నేనేం తప్పు చేశాను మామయ్యా చెప్పండి.
పరంధామయ్య: ఎవ్వడితోనో తిరిగి కడుపు తెచ్చుకుని అది నా కొడుకు వల్లే వచ్చిందని చెప్తున్నావు. నిన్ను చీ అనడానికి కానీ చీదరించుకోవడానికి కానీ ఇంతకంటే పెద్ద కారణం కావాలా? బరి తెగించి తిరిగి ప్రెగ్నెన్సీ తెచ్చుకుని అది నా కొడుకుదే అని చెప్పగానే నేను నమ్మడానికి పిచ్చోణ్ని అనుకున్నావా? కౌషికి.
యువరాజ్: ఏంటి బాబాయ్ వీడు మరీ ఓవర్ గా మాట్లాడుతున్నాడు. అక్క తప్పు చేయడం ఏంటి?
కమలాకర్: యువరాజ్ ఆవేశపడకు వాడి మాటలకు కౌషికి బాధపడినా మనకు మంచే జరుగుతుంది. ఆ సురేష్ గాడి పీడ విరగడి అవుతుంది.
అంటూ కమలాకర్ వెళ్లి పరంధామయ్యతో మాట్లాడతాడు. పరంధామయ్య, కమలాకర్‌ను తిడతాడు. ఇంతలో ధాత్రి, కేదార్ కూడా పరంధామయ్యను తిడతారు. దీంతో ఎవడికో పుడుతున్న బిడ్డకు నా కొడుకుని తండ్రిని చేస్తానంటే నేను చూస్తూ ఊరుకోను. అనగానే కౌషికి కోపంతో పరంధామయ్యను కొట్టడానికి వెళ్లి ఆగిపోతుంది. సురేష్ కూడా తండ్రికి వార్నింగ్ ఇస్తాడు. ఈ ఇంట్లో ఒక్కనిమిషం కూడా ఉండాల్సిన అవసరం మనకు లేదని కౌషికిని తీసుకుని వెళ్లిపోతాడు సురేష్.
ఆదిలక్ష్మీ: ఒక్కసారి నేను చెప్పేది వినరా? అమ్మా కౌషికి మన ఊరి ఆచారం ప్రకారం పొద్దు పొడిచాక కడుపుతో ఉన్నోళ్లు ఊరి పొలిమేర దాటకూడదు. ఈ ఒక్కరాత్రి ఉండి పొద్దున్ను పోండి అమ్మా..
వైజయంతి: బాగుంది వదిన సంబరం. నువ్వు కన్నీళ్లు పెట్టుకుని ఉండమంటావు. నీ మొగుడేమో కళ్లెర్రజేసి పొమ్మంటాడు. అయినా మా అమ్మాయి మీద అన్ని నిందలు వేశాక మేము ఇక్కడెందుకు ఉంటాము.
నిషిక: నువ్వు చెప్పింది కరెక్టే అన్నయ్యా.. మనం ఇక్కడ ఉండటం కరెక్టు కాదు అందరం ఇప్పుడే వెళ్లిపోదాం పదండి.
భాగ్యలక్ష్మీ: అమ్మ చెప్పింది నిజం వదిన. ఈ ఒక్కరాత్రికి ఇక్కడే ఉండండి.
అని చెప్పగానే ధాత్రి కూడా ఈ ఒక్కరాత్రికి ఇక్కడే ఉండి ఉదయమే వెళ్లిపోదాం అంటుంది. దీంతో కౌషికి ఓకే అని ఒప్పుకుంటుంది. దీంతో వైజయంతి, నిషిక బాధపడతారు. అందరూ రాత్రికి అక్కడే ఉంటారు. అందరూ పడుకున్నాక యువరాజ్ విగ్రహం కోసం వెతుకుతుంటాడు. తెల్లవారుజాము 4 గంటలకు కౌషికికి మెలుకువ వస్తుంది. వాటర్ కోసం రూంలోంచి బయటకు వచ్చిన కౌషికి, విగ్రహాన్ని వెతుకుతున్న యువరాజ్ కనిపిస్తాడు. కౌషికిని చూసిన యువరాజ్ షాక్ అవుతాడు. కౌషికి షాక్ అవుతుంది. తర్వాత ఫోన్ చార్జర్ కోసం వెతుకుతున్నానని చెప్తాడు. తర్వాత ఎవరి రూముల్లోకి వాళ్లు వెళ్లిపోతారు. ఇంతలో పరంధామయ్య అరుపు విని వెళ్తుంది కౌషికి. అక్కడ ఆయనను ఎవరో పొడిచేసి ఉంటారు. రక్తపుమడుగులో గిలాగిలా కొట్టుకుంటుంటాడు పరంధామయ్యా దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: త్రిశూలంతో చిరంజీవుడు... మెగాస్టార్ బర్త్ డే గిఫ్ట్ 'విశ్వంభర' ఫస్ట్ లుక్ వచ్చేసిందోచ్