అన్వేషించండి

Vishwambhara First Look: త్రిశూలంతో చిరంజీవుడు... మెగాస్టార్ బర్త్ డే గిఫ్ట్ 'విశ్వంభర' ఫస్ట్ లుక్ వచ్చేసిందోచ్

Chiranjeevi Birthday: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న సోషియో ఫాంటసీ సినిమా 'విశ్వంభర' ఫస్ట్ లుక్ విడుదలైంది. ఆయన బర్త్ డే కానుకగా వచ్చిన ఈ లుక్ ఎలా ఉందో చూడండి.

పద్మ విభూషణ్ పురస్కార గ్రహీత, మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు అంటే మెగా అభిమానులకు పండుగ రోజు. ఆగస్టు 22కు ముందు నుంచి సంబరాలు మొదలు అవుతాయి. ఈ ఏడాది కూడా బర్త్ డే వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. తమ అభిమాన హీరో పుట్టిన రోజును వేడుకగా చేస్తున్నారు. ఈ సంబరాలను, ఫ్యాన్స్ సంతోషాన్ని రెట్టింపు చేస్తూ 'విశ్వంభర' ఫస్ట్ లుక్ విడుదల చేసింది యువి క్రియేషన్స్ సంస్థ.

మెగాస్టార్ పుట్టినరోజు కానుకగా ఫస్ట్ లుక్ రిలీజ్!
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా ప్రముఖ నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భారీ సోషియో ఫాంటసీ ఫిల్మ్ 'విశ్వంభర'. 'బింబిసార' విజయం తర్వాత వశిష్ఠ మల్లిడి దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. విక్రమ్, వంశీధర్ రెడ్డి, ఉప్పలపాటి ప్రమోద్‌ నిర్మాతలు. ఈ రోజు చిరంజీవి బర్త్ డే సందర్భంగా, అభిమానులకు కానుకగా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. అది ఎలా ఉందో చూడండి...

Also Read: మీరు ఏమైనా అనుకోండి... నాకు ఇష్టమైతే, నా మనసుకు నచ్చితే వెళ్తా... వైసీపీ క్యాండిడేట్‌కు సపోర్ట్ - నంద్యాల ఎపిసోడ్‌ మీద పవన్, నాగబాబుకు బన్నీ కౌంటర్?

హనుమంతునికి చిరంజీవి అపర భక్తుడు. ఆ సంగతి ప్రేక్షకులకు, అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 'విశ్వంభర'లో ఆ హనుమంతుడు సైతం కీలక పాత్రధారి కానున్నారని సమాచారం. హనుమంతుని ముందు గద పట్టుకున్న చిరంజీవి లుక్ రిలీజ్ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ, వేరే లుక్ విడుదల చేశారు. త్రిశూలం పట్టుకున్న చిరంజీవి ఫోటోను ఫస్ట్ లుక్ కింద విడుదల చేసింది 'విశ్వంభర' చిత్ర బృందం. ఇది అభిమానులకు ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ లుక్ విడుదలైన కొన్ని క్షణాల్లో సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. ఫ్యాన్స్, ఆడియన్స్ నుంచి అద్భుతమైన స్పందన అందుకుంటోంది.

Also Readఓటీటీలోకి వచ్చేసిన ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ' - ఏ లాంగ్వేజ్ వెర్షన్ ఎందులో స్ట్రీమింగ్ అవుతోందంటే?

సంక్రాంతికి థియేటర్లలో 'విశ్వంభర' సందడి
సంక్రాంతికి 'విశ్వంభర' సినిమాతో చిరంజీవి థియేటర్లలో సందడి చేయనున్నారు. విడుదల తేదీని కొన్ని రోజుల క్రితం వెల్లడించారు. వచ్చే ఏడాది జనవరి 10న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నట్లు చెప్పారు.


'విశ్వంభర'లో సౌత్ క్వీన్ త్రిష కృష్ణన్ కథానాయిక. 'స్టాలిన్' తర్వాత చిరంజీవి సరసన ఆవిడ నటిస్తున్న చిత్రమిది. సుమారు 18 ఏళ్ల తర్వాత వాళ్లిద్దరి పెయిర్ రిపీట్ అవుతోంది. ఇంకా ఈ సినిమాలో ఆషికా రంగనాథ్, సురభి, రమ్య పసుపులేటి, ఇషా చావ్లా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. బాలీవుడ్ నటుడు కునాల్ కపూర్ పవర్ ఫుల్ విలన్ రోల్ చేస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతంలో చంద్రబోస్ పాటలు రాస్తున్నారు. ఆస్కార్ పురస్కార గ్రహీతలు ఇద్దరూ ఈ చిత్రానికి పని చేస్తుండటం విశేషం. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ఛోటా కె నాయుడు, ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్.

టాప్ హెడ్ లైన్స్

ZEE5 OTT Movies : 7 భాషల్లో అప్‌కమింగ్ కంటెంట్ లైనప్ - టాలీవుడ్ స్టార్స్ మూవీస్ To ఎక్స్‌క్లూజివ్ వెబ్ సిరీస్... జీ5 స్పెషల్ ప్రాజెక్ట్
7 భాషల్లో అప్‌కమింగ్ కంటెంట్ లైనప్ - టాలీవుడ్ స్టార్స్ మూవీస్ To ఎక్స్‌క్లూజివ్ వెబ్ సిరీస్... జీ5 స్పెషల్ ప్రాజెక్ట్
Chitti Chitti Cheema Song Lyrics: చిట్టి చిట్టి చీమ లిరిక్స్... దుల్కర్ సల్మాన్ 'ఆకాశంలో ఒక తార' కోసం శ్రీమణి ఏం రాశారంటే?
చిట్టి చిట్టి చీమ లిరిక్స్... దుల్కర్ సల్మాన్ 'ఆకాశంలో ఒక తార' కోసం శ్రీమణి ఏం రాశారంటే?
Horror Thriller OTT : రాక్షస చేపతో ఐదుగురి ఫ్రెండ్స్ పోరాటం - డైరెక్ట్‌గా ఓటీటీలోనే సర్వైవల్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
రాక్షస చేపతో ఐదుగురి ఫ్రెండ్స్ పోరాటం - డైరెక్ట్‌గా ఓటీటీలోనే సర్వైవల్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
Pavala Shyamala: మహాప్రస్థానంలో ముగిసిన పావలా శ్యామల అంత్యక్రియలు... హాజరైన కరాటే కల్యాణీ, హేమ, రఘుబాబు
మహాప్రస్థానంలో ముగిసిన పావలా శ్యామల అంత్యక్రియలు... హాజరైన కరాటే కల్యాణీ, హేమ, రఘుబాబు

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Inter Student Commits Suicide: నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
GHMC Indiramma Housing Scheme: KCR డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
AP Legislative Council MLC Elections: కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
Jubilee Hills CI Suspension: ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
స్పీడ్ లవర్స్‌కు గుడ్ న్యూస్‌.. కొత్త 2027 కవాసాకి నింజా 300 వచ్చేసింది, అప్పుడే డెలివరీలు కూడా ప్రారంభం
2027 కవాసాకి నింజా 300 ఎంట్రీ.. యూత్‌ కోసం స్మూత్‌ థ్రిల్లింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌, పవర్‌లో తగ్గేదేలే!
Fridge Water : వర్షాకాలంలో ఫ్రిజ్‌లో నీరు ఎక్కువ రావడానికి కారణాలు ఇవే.. ఈ సెట్టింగ్ మార్చి చెక్ పెట్టేయండి
వర్షాకాలంలో ఫ్రిజ్‌లో నీరు ఎక్కువ రావడానికి కారణాలు ఇవే.. ఈ సెట్టింగ్ మార్చి చెక్ పెట్టేయండి
Rains In AP And Telangana: భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
Embed widget