Jagadhatri Serial Today April 24th: తన ఫ్రెండ్ ముందు జగధాత్రిని నిషిక ఏమని అవమానించింది..? నిషిక చెంప కౌషికి పగులగొట్టడానికి కారణమేంటి..?
Jagadhatri Serial Today Episode April 24th: తన ఫ్రెండ్ ముందు జగధాత్రిని నిషిక ఏమని అవమానించింది..? నిషిక చెంప కౌషికి పగులగొట్టడానికి కారణమేంటి..?

Jagadhatri Serial Today Episode: డ్రాగన్ తన ఆస్తి మొత్తం అనాథ శరణాలయానికి ఎక్కడ రాసి ఇస్తుందోనని భయపడిని మీనన్ ఏం ఆలోచించకుండా పిచ్చిపట్టినవాడిలా అందరి ముందుకు వచ్చి నకిలీ పత్రాలు లాక్కెళ్లుందుకు ప్రయత్నిస్తాడు. అప్పుడు జగధాత్రి తెలివిగా ఇతను మీనన్ కాదని...అతని పోలికలతో ఉన్న వేరే అతనని చెబుతుంది. దీంతో ఉక్రోశం వచ్చిన మీనన్ తానే మీననని అందరి ముందు చెబుతాడు. మీనన్ చనిపోవడం మేమంతా చూశామని మీడియా వాళ్లు చెప్పగా....ఆరోజు చనిపోయింది తన డూప్ అని అసలు మీనన్ తానేనని అంటాడు. ఈ పోలీసులను మభ్యపెట్టడానికే అలా నాటకం ఆడానని చెబుతాడు. జేడీ,కేడీ ముందుకు వచ్చి అసలు మీనన్ నువ్వేనని మా అందరికీ తెలుసని...చీకటిలో బతుకుతున్న నిన్ను వెలుగులోకి తీసుకురావడానికి ఇదంతా చేశామని చెబుతారు. అవి ఆస్తిపేపర్లు కాదని..నకిలీ పత్రాలను చెబుతారు. ఇప్పుడు నిన్ను అరెస్ట్ చేస్తామని అంటారు. దీంతో మీనన్ తన మనుషులను రప్పించి అక్కడి నుంచి పారిపోతాడు. మీనన్‌ను గుట్టు బయటపెట్టేందుకు సాయం చేసిన డ్రాగన్‌కు జేడీ,కేడీ ఇద్దరూ థ్యాంక్స్ చెబుతారు. తాను బయట ఉండలేనని జైలుకు పంపించేయమని డ్రాగన్ కోరడంతో ఆమెను తిరిగి మళ్లీ జైలుు పంపుతారు.
Also Read: చిన్ని సీరియల్: చిన్నిని మెడ పట్టుకొని గెంటేసిన సరళ! లోహిత, సరళకు చుక్కలు చూపించిన దెయ్యం!
మీనన్ బతికే ఉన్న విషయం టీవీలోచూసిన కౌషికి...నేను చెబితే ఎవరూ వినలేదని, నన్ను పిచ్చిదానిలా చూశారని అంటుంది.ఇప్పుడు చూశారా మీనన్ బతికే ఉన్నాడని..తనను చంపడానికి ప్రయత్నించాడని అంటుంది. అందరి కళ్లముందు చనిపోయిన మీనన్ బతికే ఉన్నాడంటే మేము మాత్రం ఎలా నమ్మగలమని నిషిక అంటుంది. అందరిలాగే మేంకూడా అతను చనిపోయాడనే అనుకున్నామని అంటుంది. జేడీ వాడి గుట్టుబయటపెట్టిందని కేదార్ అంటాడు.ఇప్పుడు వాడు మనపై పగబట్టాడుకాబట్టి ఖచ్చితంగా ఎటాక్ చేస్తాడని అంటే...జేడీ దెబ్బకు ఇప్పుడే సగం చచ్చిపోయి ఉంటాడని..ఇక జీవితంలో అక్క జోలికి రాడని కేదార్ అంటాడు. దీంతో అందరూ డిన్నర్ చేయడానికి వెళ్లిపోతారు. తెల్లారిన తర్వాత ఇంటిపనులన్నీ చేయలేక నిషిక, వైజయంతి అల్లాడిపోతుంటారు. యువరాజు కూడా తోటమాలి మాదిరిగా చెట్లకు నీళ్లు పోస్తుంటాడు.
Also Read: నిండు మనసులు: మంజుల ఇంట్లో రచ్చ చేసిన పేపర్ యాడ్! ఇదంతా గణ పనేనా?
అమెరికా నుంచి వచ్చిన నిషిక స్నేహితురాలు హేమ...ఆమెన చూడటానికి వస్తుంది.ఇంటిముందు పనులు చేస్తున్న నిషికను చూసి ఆమె గుర్తుపట్టలేకపోతుంది. పనివాళ్లేమో అనుకుంటుంది.దీంతో నిషిక వెళ్లి పలకరించినా హేమ వారిని కనుక్కోదు. ఈ అవతారాలేంటని అడగ్గా....అదో పెద్ద కథలే తర్వాత చెబుతానంటూ ఇంట్లోకి తీసుకెళ్తుంది. హేమను చూసిన జగధాత్రి ఆమెను తీసుకుని వెళ్లి కౌషికి పరిచయం చేస్తుంది.ఇప్పుడు 5వ నెల కడుపుతో ఉన్నట్లు చెబుతుంది. కుశల ప్రశ్నలు వేసిన తర్వాత హేమవాళ్లు తిరిగి వెళ్లబోతుండగా...కౌషికి ఆమెకు చీరపెట్టి తాంబూళం ఇస్తుంది. కౌషికి,సుధాకర్ వద్ద ఆశీర్వాదం తీసుకున్న హేమ...జగధాత్రి వద్ద కూడా ఆశీర్వాదం తీసుకోబుతుండగా నిషిక వచ్చి ఆగమని చెబుతుంది.అసలే కడుపుతో ఉన్నావని...ఇలా పిళ్లాజెల్లా లేని వాళ్ల దగ్గర ఆశీర్వాదం తీసుకోకూడదని చెబుతుంది.
Also Read: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ సీమంతంలో విహారి! సహస్ర ప్రెగ్నెంట్ కాదని యమునకు తెలిసిపోయిందా!
పెళ్లయి ఇన్నేళ్లయినా వీళ్లకు పిల్లలులేరని....ముందుముందు పుడతారోలేదో కూడా తెలియదని అంటుంది. ఆ మాటలకు జగధాత్రితోపాటు కేదార్ కూడా చాలా బాధపడతారు. ఇలాంటి వాళ్ల ఆశీర్వాదం తీసుకోకూడదని చెప్పి బయటకు తీసుకెళ్తుంది.వాళ్లు వెళ్లిపోయిన తర్వాత వైజయంతి కోడలను మెచ్చుకుంటుంది. ఆ జగధాత్రికి మంచి డోస్ ఇచ్చావని అంటుంది. బయట నుంచి ఇంట్లోకి రాగానే కౌషికి నిషిక చెంప పగులగొడుతుంది. నీ స్నేహితురాలి ముందు నీ పరువు పోగొట్టడం ఇష్టంలేక ధాత్రి ఈ పనిచేయలేకపోయిందని అంటుంది.అయినా ఇప్పుడు నేను అంత అనకూడని మాటలు ఏం అన్నానని నిలదీస్తుంది. వైజయంతి కూడా కోడలికి సపోర్ట్‌గా మాట్లాడుతుంది. నువ్వు ఏం మాట్లాడావో కూడా తెలియదా అని కౌషికి అనగా....వాళ్లకు పిల్లలు లేరు కాబట్టి ఉన్న మాటే అన్నానని అంటుంది. అయితే వాళ్లకన్నా రెండురోజులు ముందే నీ పెళ్లి కూడా అయ్యింది కదా...మరి నీకు ఎందుకు పిల్లలు పుట్టలేదని కౌషికి నిలదీస్తుంది. అంటే నీలో కూడా ప్రాబ్లం ఉందా అని అడగడంతో నిషిక ఖంగుతింటుంది.
ట్రెండింగ్ వార్తలు





















