అన్వేషించండి

Illu Illalu Pillalu Serial Today April 24th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: వల్లీని ఇంటికి తీసుకొచ్చిన వేదవతి! ధీరజ్, నర్మదలు ఏం చేశారంటే!

Illu Illalu Pillalu Serial Today Episode April 24th వేదవతికి నర్మద కాల్ చేసి వల్లీ ప్రెగ్నెంట్ అని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Illu Illalu Pillalu Serial Today Episode వల్లీ గర్భవతి అని అందరూ చాలా సంతోషపడతారు. నర్మద, ప్రేమలు కంగ్రాట్స్ చెప్తారు. వల్లీ థ్యాంక్స్ చెప్పి చందు వైపు చూస్తుంది. చందు ఏం మాట్లాడకుండా ఉండటంతో బా.. రా అని పిలుస్తుంది. బా నేను తల్లిని కాబోతున్నాను.. మనం అమ్మానాన్నలు కాబోతున్నాం అని చెప్పి చందు చేయి పట్టుకొని పొట్ట మీద పెట్టి నా కడుపులో మన బుజ్జి బేబీ ఉందని అంటుంది. 

చందు హ్యపీగా ఫీలై ఒక్కసారి డల్ అయిపోయి వల్లీ చేయి వదిలేస్తాడు. ఏం మాట్లాడాలో ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావడం లేదు.. ఒక వైపు నేను తండ్రిని కాబోతున్నా అనే ఆనందం.. మరోవైపు మీ మోసాలు అని అంటాడు. బా ఇంకా నన్ను దూరం పెడతావా అని అడుగుతుంది. భాగ్యం చందుతో అల్లుడు గారు మేం చేసిన తప్పునకు నా కూతురిని శిక్షించకండి మీ కాళ్లు పట్టుకుంటాం క్షమించండి అని వేడుకుంటుంది. ఇక ధీరజ్ చందుతో అరే పెద్దోడా జరిగింది ఏదో జరిగిపోయింది.. ఇది మన కుటుంబానికి పెద్ద పండగ అన్నీ వదిలేయ్‌రా అని అంటాడు. నర్మద చందుతో బావ వల్లీ అక్కకి బుద్ధి రావాలి అని తను ఇంకోసారి ఇలాంటి తప్పు చేయకూడదు అని ఇలా చేశాం అంతే కానీ మీ ఇద్దరినీ దూరం చేయాలి అని కాదు.. వల్లీ అక్కతో పాటు మన కుటుంబం మొత్తం సంతోషంగా ఉండాల్సిన టైం ఇది అందుకే అక్కని ఇంటికి తీసుకెళ్లిపోదాం బావ అని నర్మద, ప్రేమ చెప్తారు. 

చందు మనసు మాత్రం మారదు.. వీళ్లు ఎంత ఏడ్చినా నా మనసు కరగడం లేదు.. వెంటనే వీళ్ల మోసాలు గురించి నాన్నకి చెప్తా అంటాడు. నర్మద, ప్రేమ, ధీరజ్ ఎంత ఒప్పించాలని చూసి చందు మాత్రం ఒప్పుకోడు.. ఈ విషయంలో నాన్న నిర్ణయమే నా నిర్ణయం అని వెళ్లిపోతాడు. వల్లీ చాలా ఏడుస్తుంది. చందు ఇంటికి వెళ్లి నాన్న మీకు ఓ ముఖ్యమైన విషయం చెప్పాలి అని అంటాడు. ఇంతలో రామరాజు తిరుపతిని పిలిచి ఇళ్లు మొత్తం డెకరేషన్ చేయ్.. పండగ వాతావరణం ఉండాలి అని సందడి చేస్తాడు. నేను వల్లీ కోసం మీకు చెప్పాలి అని చందు అంటే నువ్వేం చెప్పాలి అనుకుంటున్నావో నాకు తెలుసురా.. వల్లీ తల్లి కాబోతుంది.. నన్ను తాతని చేశావురా.. నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటాడు. చందు మాత్రం నిజం చెప్పాలనే చూస్తాడు. వల్లీని ఇంటికి తీసుకురాకుండా మీరు అంతా ఎందుకు వచ్చారు.. నా పెద్ద కోడలు గర్భవతి అని చెప్పగానే నాకు చాలా సంతోషంగా ఉంది.. అని అంటాడు. 

చందు రామరాజుతో వల్లీ గురించి నీకు చెప్పాలి నాన్న అని అంటూ ఉంటే నేను చెప్తా  అని వేదవతి ఎంట్రీ ఇస్తుంది. వల్లీని తీసుకొని వేదవతి రావడంతో అందరూ షాక్ అయిపోతారు. కడుపుతో ఉన్న వల్లీని మీరు ఇంటికి తీసుకురమ్మని చెప్తే పెద్దోడు ఎందుకు వద్దు అంటున్నాడో నేను చెప్తా.. నెల తప్పిన కోడలు పుట్టింటిలో ఉంటే పసుపు కుంకుమలు ఇచ్చి అత్తగారు తీసుకురావాలి అందుకే మీకు వద్దని పెద్దోడు అంటున్నాడు అని వేదవతి అంటుంది. అవునారా అని రామరాజు అంటే కాదండీ వల్లీ తన తల్లిదండ్రులతో కలిసి మన కుటుంబానికి ఎసరు పెట్టాలని చూసింది అందుకే వాడు వల్లీని తీసుకురావడానికి ఒప్పుకోలేదు అని నిజం చెప్తుంది. బుజ్జమ్మా అని రామరాజు షాక్ అయితే కాకపోతే మరేంటి అండీ అని అంటుంది. కడుపుతో ఉన్న ఆడపిల్లని ఎక్కువ సేపు నిలబెట్టకూడదు అని అంటుంది. 

నర్మదకి హారతి తీసుకురమ్మని అంటుంది. నర్మద, ప్రేమ కలిసి వల్లీకి దిష్టి తీస్తారు. తర్వాత వేదవతి వల్లీని తీసుకొని ఇంట్లోకి వెళ్తుంది. నర్మద, ప్రేమలు దిష్టినీళ్లు చల్లడానికి వెళ్తే భాగ్యం అక్కడికి వెళ్లి నా కూతురు ఇంట్లో అడుగు పెట్టకుండా అడ్డుకుంటామని పొట్టి మిరపకాయ్, చీమాటపాకాయ్ ఎన్నో అన్నారు.. కానీ చివరకు వాళ్లే హారతి ఇచ్చి నా కూతురికి ఇంట్లోకి పిలిచారు అంటుంది. చివరాకరికి నేను చెప్పొచ్చేది ఏంటి అంటే కళ్లు ఉన్నాయి కదా అని ఉరిమి చూస్తే.. చేతులు ఉన్నాయి కదా అని మీద చేయి వేస్తే ఏమీ పని చేయకుండా చేసేస్తానన్న మాట అని అంటుంది.

ఇంతలో ధీరజ్‌ వచ్చి దౌర్భాగ్యం అత్తోయ్ ఎక్కువ తిప్పేయ్‌కు కట్ చేసేస్తా జడ అని అంటాడు. ఇంత జరిగినా ఆవిడ పొగరు తగ్గలేదు.. చూడు అక్కా అని ప్రేమ అంటుంది. ఆవిడతో గొడవ పడటం మామయ్య చూస్తే అన్నీ చెప్పాల్సి వస్తుంది వదిలేయ్ అంటుంది. ప్రేమ నర్మదతో అక్క వల్లీ అక్క ప్రెగ్నెంట్ అని అత్తకి ఎలా తెలిసింది.. టైంకి ఎలా వచ్చింది అంతా ఆశ్చర్యంగా ఉందని అంటే నర్మద, ధీరజ్ ఒకరిని చూసి ఒకరు నవ్వుతారు. 

ప్రేమ ఇద్దరినీ చూసి మీ ఇద్దరూ నవ్వుకుంటున్నారు ఏంటి అని అంటే అమ్మ ఈ రోజు వస్తుందని నాకు ముందే తెలుసు.. కానీ అమ్మ వల్లీ వదినను తీసుకురావడం వెనక క్రెడిట్ అంతా వదినదే అని ధీరజ్ చెప్తాడు. హాస్పిటల్‌లో ఉన్న నర్మద వేదవతికి కాల్ చేసి మాట్లాడుతుంది. మీరు మన ఇంటికి కాదు మీ పెద్ద కోడలు పుట్టింటికి వెళ్లాలి అని వల్లీ ప్రెగ్నెంట్ అని చెప్తుంది. జరిగింది అంతా నర్మద వేదవతికి చెప్తుంది. ఇంత చేశారా వాళ్ల సంగతి నేను చూసుకుంటా అని వేదవతి చెప్పి వల్లీని తీసుకొస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

 

టాప్ హెడ్ లైన్స్

Podarillu Serial Today August 16th: పొదరిల్లు సీరియల్: మహాకి మాధవ్‌ సూటి ప్రశ్న! శైలుకి సీక్రెట్‌గా పెళ్లి చేసేస్తారా?
పొదరిల్లు సీరియల్: మహాకి మాధవ్‌ సూటి ప్రశ్న! శైలుకి సీక్రెట్‌గా పెళ్లి చేసేస్తారా?
Illu Illalu Pillalu Serial Today August 16th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఫుల్ రొమాన్స్..! మరిదిని ఆట పట్టించిన నర్మద! వేదవతి ఎమోషనల్!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఫుల్ రొమాన్స్..! మరిదిని ఆట పట్టించిన నర్మద! వేదవతి ఎమోషనల్!
Godavari Serial Today August 16th:'గోదావరి' సీరియల్: జానుకి గుడ్‌న్యూస్‌ చెప్పిన సూర్య! శారదకు సింహాద్రి హెచ్చరిక! నందులో మార్పు!
'గోదావరి' సీరియల్: జానుకి గుడ్‌న్యూస్‌ చెప్పిన సూర్య! శారదకు సింహాద్రి హెచ్చరిక! నందులో మార్పు!
Karthika Deepam 2 Serial Today August 16th: కార్తీకదీపం 2 సీరియల్: పారూకి ఫుల్ కోటింగ్ ఇచ్చేసిన జ్యోత్స్న! జ్యోత్స్న ముందే సూరజ్‌కి పెళ్లి సంబంధాలు!
కార్తీకదీపం 2 సీరియల్: పారూకి ఫుల్ కోటింగ్ ఇచ్చేసిన జ్యోత్స్న! జ్యోత్స్న ముందే సూరజ్‌కి పెళ్లి సంబంధాలు!

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
Soaked Raisins : రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
Embed widget