Brahmamudi Serial Today April 24th: ‘బ్రహ్మముడి’ సీరియల్: రేఖకు చక్రి వార్నింగ్ - ఇందును చూసి వెంకట్ షాక్
Brahmamudi serial today episode April 24th: డబ్బుల కోసం చక్రి దగ్గరకు వెళ్లిన రేఖకు వార్నింగ్ ఇస్తాడు చక్రి. దీంతో ఇవాల్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Brahmamudi Serial Today Episode: రాజు కోక్ టిన్‌లో బీరు కలిపి తాగించడంతో ఆ మత్తుకు ఇందు ఎగిరి గంతులేస్తుంది. బెలూన్స్ తీసుకెళ్లి ఎగురవేస్తుంది. ఆకాశం వైపు చూస్తూ కవితలు చెప్తుంది. భూమితో మాట్లాడుతూ కవితలు చెప్తుంది.
రాజు: నీకో దండం తల్లి ఆ డ్రింక్ తాగగానే మత్తు వచ్చి ఇంటికి వెళ్దాం అంటావు అనుకున్నాను.. కానీ ఇలా చేస్తావు అనుకోలేదు
ఇందు: అంత చేశానా..?
రాజు: అంతా ఇంతా కాదు నువ్వు చేసింది. కాసేపు భూమి కంపించినట్టు, ప్రపంచం ఊగిపోయినట్టు, విశ్వం కుదిపేసినట్టు అనిపించింది
ఇందు: నువ్వు మరీ ఎక్కువ చేసి చెప్తున్నావు కదా...? మరీ అంత డిస్టర్బ్ చేశానా...?
రాజు: దాన్ని డిస్టర్బ్ చేయటం అనరమ్మా విస్పోటనం
ఇందు: నాకేం తెలుసు…? నువ్వే కదా ఎనర్జీ డ్రింక్ తాగితే ఎనర్జీ వస్తుంది అన్నావు. నాకు తెలియకుండానే నాలో ఉన్న టాలెంట్స్ అన్ని బయటకు వస్తాయి అన్నావు కదా
రాజు: బుద్ది తక్కువయి అన్నానమ్మా..? బుద్ది తక్కువయి ఆ డ్రింక్ ఇచ్చాను.. మామూలు ఎనర్జీ కాదు. నిన్ను కంట్రోల్ చేయడానకి మరే ఎనర్జీ సరిపోదు
ఇందు: థాంక్స్.. నన్ను కిడ్నాప్ చేసి తప్పు చేశాను అనిపిస్తుందా నీకు. ఇంతకీ నువ్వు కిడ్నాపులు కాకుండా ఏం చేస్తుంటావు.. చెప్పు ఇక్కడ కూర్చోని మాట్లాడుకుందాం.. చెప్పు ఇంతకీ నువ్వు కిడ్నాపులు కాకుండా ఏం చేస్తుంటావు
రాజు: ఏం చేయాలో ఆలోచిస్తుంటాను
ఇందు: అంటే ఏ పని పాటా లేకుండా తిరిగే పోకిరీవా నువ్వు
రాజు: కొంచెం అటు ఇటుగా అలాంటిదే
ఇందు: ఎందుకు అలా ఏదో ఒక పని చేసుకోవచ్చు కదా
రాజు: పని చేసుకోవాలి అంటే పని దొరికాలి కదా
ఇందు: ఎందుకు అలా నువ్వు చదువుకోలేదా..? చిన్నప్పుడు స్కూల్‌కు వెళ్లలేదా..?
రాజు: చిన్నప్పుడు స్కూల్‌కు వెళ్లాను. పెద్దయ్యాక కాలేజీకి వెళ్లాను. చదువుకున్నంత మాత్రాన ఉద్యోగాలు దొరుకుతున్నాయా ఏంటి..?
ఇందు: నువ్వైనా కాలేజీ దాకా వెళ్లావు నేను అసలు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండి చదువుకున్నాను
అంటూ ఇద్దరూ కూర్చుని మాట్లాడుకుంటుంటారు. ఇంతలో ఇందు తన కోసం ఒక పాట పాడమని రాజుకు చెప్తుంది. రాజు తనకు పాటలు రావని చెప్తాడు. అయితే నేను ఇంటి ఓనరుతో తేల్చుకుంటాను అంటుంది. దీంతో రాజు అంత దూరం ఎందుకులే అంటూ పాట పాడుతుంటాడు. పాట వింటూ ఇందు రాజు ఒడిలో నిద్రపోతుంది. తర్వాత రేఖ, భూషణ్ డబ్బుల కోసం చక్రి దగ్గరకు వెళ్తారు.
రేఖ: చక్రి నువ్వు ఇస్తానన్న కోటి రూపాయలు ఇవ్వవని మాకు తెలిసిపోయింది. కనీసం యాభై లక్షలు ఇస్తావని వచ్చాము
చక్రి: ఏంటి యాభై లక్షలా..? పది సంవత్సరాలుగా నాతో చాలా డబ్బు తీసుకున్నారు.. నేను అప్పు ఇచ్చినందుకు నా డబ్బు నాకు తిరిగి ఇవ్వడానికి నన్ను ఎన్నిసార్లు మీ చుట్టు తిప్పుకున్నారు. అసలు నేను డబ్బుల ఇస్తానంటే మీరెలా నమ్మారు..?
రేఖ, భూషణ్ షాక్ అవుతారు. చక్రి ఒక్క రూపాయి కూడా ఇవ్వనని వార్నింగ్ ఇచ్చి వాళ్లను అక్కడి నుంచి వెళ్లగొడతాడు. మరోవైపు రాజు వాళ్ల అమ్మనాన్న పెళ్లి రోజు సెలబ్రేట్ చేయడానికి ఇందు వాళ్ల ఇంటికి వెళ్తుంది. ఇందును చూసిన రాజు వాళ్ల అమ్మ, నాన్న, తమ్ముడు షాక్ అవుతారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!
ట్రెండింగ్ వార్తలు





















