అన్వేషించండి

chinni serial today April 24th: చిన్ని సీరియల్: చిన్నిని మెడ పట్టుకొని గెంటేసిన సరళ! లోహిత, సరళకు చుక్కలు చూపించిన దెయ్యం!

chinni serial today episode April 24th చిన్నిని ఇంట్లోకి రానివ్వొద్దని సరళ చిన్ని జుట్టు పట్టుకొని గెంటేయడం.. కావేరి ఆత్మ ఎంట్రీ ఇవ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode చిన్నిని మ్యాడీ చందు దగ్గరకు తీసుకొచ్చి తనే చిన్ని అని చెప్తాడు. సరళ చందుతో దీని తల్లి వల్లే మన పరిస్థితి ఇలా అయిపోయింది.. ఇద్దరు చిన్న పిల్లల్ని తీసుకొని వచ్చి కూలీనాలీ చేసుకొని పెంచానని ఏడుస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ దరిద్రం మళ్లీ మన ఇంట్లో అడుగు పెడతా అని అంటే ఊరుకుంటానా అని అంటుంది. ఏంటే ఇంకా చూస్తున్నావ్.. వెళ్లు.. నీ నీడ కూడా ఈ ఇంట్లో పడటానికి వీల్లేదు అని సరళ అంటుంది. 

చిన్ని ఏడుస్తుంది. మ్యాడీ, చందు చాలా బాధ పడతారు. ఈ ఇంట్లో నువ్వు అడుగు పెట్టడానికి వీల్లేదు అని చిన్ని జుట్టు పట్టుకొని గెంటేస్తుంది. చిన్ని చాలా ఏడుస్తుంది. మహి చిన్నిని ఓదార్చుతాడు. చిన్ని సారీ చిన్ని అమ్మ తరుపున నేను చెప్తున్నా అని అంటాడు. మ్యాడీ నువ్వు మా అమ్మ మాటలు పట్టించుకోవద్దు.. మానాన్నని బాలరాజు మామయ్య చంపలేదు.. ఎవరో చంపేసి ఆ నేరం మా మామయ్య మీద వేశారు.. మా దురదృష్టం ఏంటో తెలీదు కానీ చేయని నేరానికి మా కావేరి అత్తయ్య, మామయ్య ఇద్దరూ శిక్ష అనుభవించారు. మామయ్య జైలు నుంచి విడుదల అయ్యారని తెలిసి నీకు తెలుసా ఎక్కడున్నారో అని చందు అడిగితే మ్యాడీ ముందు చెప్పకూడదు అని చిన్ని తెలీదు అనేస్తుంది. మీ చెల్లి లోహిత ఎక్కడుంది అని మ్యాడీ అడుగుతాడు. దూరం నుంచి చూస్తున్న లోహిత షాక్ అయిపోతుంది. చిన్నప్పుడు తను పెద్ద విలన్‌లా ఫోజులు కొడుతుంది కదా ఇప్పుడు అలా ఉందా అని మ్యాడీ అడిగితే వీళ్లకి ఇబ్బంది పెట్టడం ఎందుకు అని చందు హైదరాబాద్‌లో జాబ్ చేస్తుందని చందు చెప్తాడు.

చందు లోహితకు కాల్ చేస్తే లోహిత చాటుగా మాట్లాడుతుంది. మ్యాడీ లోహితతో మాట్లాడుతాడు. మహి చిన్ని మా అత్త కూతురు అని చెప్పడం లేదు.. ఒక ఫ్రెండ్‌గా చెప్తున్నా.. చిన్నిని పెళ్లి చేసుకోవడం నీకు అదృష్టం అని అంటాడు. చిన్నిని ఇంటికి రానివ్వకూడదు అని అమ్మకి చెప్పాలి అని లోహిత ఇంటికి వెళ్తుంది. సరళ లోహితతో నువ్వు అసలు ఎక్కడ ఉంటున్నావ్.. ఏం చేస్తున్నావ్ కాలేజ్‌కి వెళ్లడం లేదు..  అని అంటుంది. అమ్మ నేను ఇప్పుడు పార్ట్‌ టైం జాబ్ చేస్తున్నా వేలకు వేలు చేస్తున్నా.. నీకు బట్టలు నగలు కావాలి అంటే చెప్పు అని లోహిత అంటుంది. దాంతో సరళ సైలెంట్ అయిపోతుంది. ఇక లోహిత సరళతో ఆ చిన్ని ఇంటికి వచ్చింది కదా,, ఈసారి వస్తే దాన్ని గొయ్యి తీసి కప్పేయ్ అని అంటుంది. దాంతో కావేరి ఆత్మ సరళ ఇంటికి ఎంట్రీ ఇస్తుంది. ఎఫెక్టులు మొదలవుతాయి. ఇళ్లు మొత్తం పొగలు వచ్చి ఇద్దరికీ కొడుతుంది. ఈ పొగలు ఏంటే అని సరళ అంటే దెయ్యం అమ్మ ఇంట్లో దెయ్యం దూరింది అందుకే ఇలా జరుగుతుందని లోహిత అంటుంది. సరళ చాలా భయపడుతుంది.

ఇద్దరి ముఖాల మీద పిండి పడిపోతుంది. ఒకరిని ఒకరు చూసి భయపడతారు. నా కూతురి చంపాలని చూస్తే మిమల్నే చంపేస్తా అని కావేరి ఆత్మ మాటలు లోహితకు వినపడతాయి. వద్దు అత్త నేనేం చేయను అత్త అని లోహిత అంటుంది. ఎవరితో మాట్లాడుతున్నావే అని సరళ అంటే దెయ్యం అత్తతో అని లోహిత అంటుంది. దెయ్యాన్ని అత్త అత్త అంటావేంటి అదేదో నీ మేనత్త అయినట్లు అని సరళ అంటే అవును నేను లోహిత మేనత్తనే కావేరినే అని కావేరి మాటలు సరళకు వినిపిస్తాయి. కావేరి అత్త తను అందుకే కదా నేను అత్త అత్త అంటున్నాను అని లోహిత అంటుంది.

మీ ఇంట్లోనే కాదు మా ఇంట్లో కూడా ఇలాగే చేస్తుందని లోహిత అంటుంది. అత్త ఈ పూటకి వదిలేయ్ అత్త ఇక నా వల్ల కావడం లేదు అని లోహిత అనడంతో కావేరి ఆత్మ వెళ్లిపోతుంది. మూడు నిమిషాల్లో మూడు చెరువుల నీళ్లు తాగించిందే మీ అత్త అని సరళ అంటుంది. ఈ విషయం అన్నయ్యకి చెప్పకు అని లోహిత అంటే చెప్పకుండా ఎలానే ఇక్కడ కూడా మార్నింగ్ షో, మ్యాటినీ షో, నైట్ షో మొదలు పెడితే నా పరిస్థితి ఏంటే అని అంటుంది. ఇక దేవాకి ఎఫెక్టులు మొదలై నీ చావు ముహూర్తం దగ్గరకు వచ్చింది అని పేపర్ మీద కనిపిస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

 

టాప్ హెడ్ లైన్స్

Nuvvu leka Neanu Lenu Serial Today Aug 22th:ఆస్తి మొత్తం చిట్టి పేర రాస్తానన్న రామచంద్రం...దీనికి సుందరి వేసిన ఎత్తు ఏంటి..?
నువ్వులేక నేను లేను: ఆస్తి మొత్తం చిట్టి పేర రాస్తానన్న రామచంద్రం...దీనికి సుందరి వేసిన ఎత్తు ఏంటి..?
Nindu Manasulu Serial Today August 22nd: నిండు మనసులు: గణ చెంప పగలగొట్టిన ప్రేరణ! వదినతో సాహితి గొడవ!
నిండు మనసులు: గణ చెంప పగలగొట్టిన ప్రేరణ! వదినతో సాహితి గొడవ!
Illu Illalu Pillalu Serial Today August 22nd: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ధీరజ్ కోసం ప్రేమ పడిగాపులు! అర్ధరాత్రి వరకు అక్కడే!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ధీరజ్ కోసం ప్రేమ పడిగాపులు! అర్ధరాత్రి వరకు అక్కడే!
Brahmamudi Serial Today August 22nd: ‘బ్రహ్మముడి’ సీరియల్: రాజుకు వార్నింగ్‌ ఇచ్చిన రేఖ – అపర్ణను తిట్టిన ఐషు  
‘బ్రహ్మముడి’ సీరియల్: రాజుకు వార్నింగ్‌ ఇచ్చిన రేఖ – అపర్ణను తిట్టిన ఐషు  

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
iPhone Crimes India: ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
VVIP Road Accident Cases : అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
Embed widget