News
News
X

Sowmya Rao on Raghava: రాకెట్ రాఘవ చాలా రసికుడు - ‘జబర్దస్త్’ యాంకర్ సౌమ్య రావు

జబర్దస్త్ యాంకర్ సౌమ్య రావు ఓ యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభించింది. తన గ్లామర్ ను ఇలా కూడా వాడుకుంటోంది. ఇటీవలే ఆమె తన ఛానల్ లో ఓ కొత్త వీడియోను అప్లోడ్ చేసింది. అదేంటంటే..

FOLLOW US: 
Share:

‘జబర్దస్త్’ కొత్త యాంకర్ సౌమ్య రావు కొత్తగా యూట్యూబ్ చానెల్ పెట్టింది. ఓ వైపు ‘‘జబర్దస్త్’’ చేస్తూనే మరోవైపు సొంతంగా తన యూట్యూబ్ ఛానల్ ను నడిపిస్తోంది. అందులో ఇంట్రస్టింగ్ గా వీడియోలు అప్లోడ్ చేసి ఫాలోవర్స్ ను సంపాదిస్తోంది. ‘జబర్దస్త్’ యాంకర్ గా గుర్తింపు రావడంతో ఆ గ్లామర్ ను ఇలా కూడా వాడుకుంటోంది సౌమ్య. ఇటీవలే ఆమె తన ఛానల్ లో ఓ కొత్త వీడియోను అప్లోడ్ చేసింది. అదేంటంటే.. ‘జబర్దస్త్’ సెట్ లో లోపల ఎలా ఉంటుంది. ఎవరెవరు ఏం చేస్తారు వంటి వాటిని వీడియో రూపంలో విడుదల చేసింది. ఈ వీడియో కామెడీగా ఉండటంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

‘జబర్దస్త్’లో యాంకర్ గా ఎంట్రీ ఇచ్చి అందర్నీ షాక్ గురయ్యేలా చేసింది సౌమ్య రావు. ‘జబర్దస్త్’ ప్రోగ్రాం కు యాంకర్ గా ఉన్న అనసూయ వెళ్లిపోవడంతో తర్వాత ఎవరు యాంకర్ గా వస్తారా అంటూ ఎదురుచూశారు ఫ్యాన్స్. ఎవరూ ఊహించని విధంగా యాంకర్ గా ఎంట్రీ ఇచ్చింది సౌమ్య. అంతక ముందు ఓ టీవీ ప్రోగ్రాంలో పాల్గొన్న ఆమెకు మంచి హైప్ వచ్చింది. దీంతో ఆమెనే ‘జబర్దస్త్’ కొత్త యాంకర్ గా ఎంపిక చేశారు నిర్వాహకులు. ప్రస్తుతం యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చకుంది. ఇటీవలే సొంతంగా యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభించింది సౌమ్య.   ఛానల్ ప్రారంభించి రెండు నెలలు కూడా కాకముందే, ఒకటి రెండు వీడియోలకే 25 వేలకు పైగా ఫాలోవర్స్ ను సంపాదించింది. ఇటీవలే ‘జబర్దస్త్’ సెట్ లోపల ఎలా ఉంటుంది? ఏం జరుగుతుంది అంటూ ఓ వీడియో చేసి అప్లోడ్ చేసింది. ఆ వీడియోకు మంచి స్పందన రావడంతో ఈసారి అన్ని టీమ్ లను కలసి ఎలా రెడీ అవుతారు? స్కిట్ లు ఎలా ప్రాక్టీస్ చేస్తారు వంటి విషయాలను తెలియజేస్తూ మరో వీడియోను అప్లోడ్ చేసింది. 

Also Read : ఇండియా వచ్చేసిన ఎన్టీఆర్ - హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఫ్యాన్స్ గ్రాండ్ వెల్కమ్

ఈ వీడియో చాలా ఫన్నీ గా ఉంది. వీడియోలో.. స్కిట్ కు ముందు యాంకర్ ఇంట్రోను ప్రాక్టీస్ చేస్తూ సౌమ్య కనిపించింది. తెలుగు భాషపై ఇప్పుడిప్పుడే అవగాహన పెంచుకుంటున్న సౌమ్య తన డైలాగ్ లు చెప్పడానికి చాలానే కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. తర్వాత ఆ రోజు టీమ్స్ అన్నిటికీ శారీ కోడ్ ఇవ్వడంతో టీమ్ సభ్యులంతా చీరలు కట్టుకొని కనిపించారు. ఇక సౌమ్య ముందుగా రాకెట్ రాఘవ టీమ్ తో మాట్లాడింది. ఈ సందర్భంగా ఆమె టీమ్ లీడర్ రాకెట్ రాఘవ గురించి చెప్తూ ‘‘రాఘవ బయట మామూలుగానే కనిపిస్తాడు కానీ రసికుడు’’ అని డైలాగ్ వేసింది. దీంతో అక్కడ ఉన్న వారంతా ముందు షాక్ అయ్యారు. తర్వాత నవ్వుకున్నారు. తర్వాత అందరి టీమ్ సభ్యుల దగ్గరకు వెళ్లి వాళ్ల శారీ గెటప్ లు వేసినపుడు ఎంత కష్టపడతారు, స్కిట్ ఎలా ప్రాక్టీస్ చేస్తారు వంటి విషయాలను అడిగి తెలుసుకుంది సౌమ్య. చివరిగా జడ్జి ఇంద్రజ వద్దకు వెళ్లింది. ఇంద్రజ తనకు ఎంతో సపోర్ట్ గా ఉంటారని చెప్పింది. తనకు మొదట్లో ఈ యాంకరింగ్ గందరగోళంగా అనిపించేదని, ఆ సమయంలో ఇంద్రజ ఓ అక్కలాగా సపోర్ట్ చేసిందని చెప్పింది. ఆమె వర్క్ విషయంలో చాలా డిడికేటెడ్ గా ఉంటుందని చెప్పుకొచ్చింది సౌమ్య. 

Published at : 15 Mar 2023 02:05 PM (IST) Tags: Jabardasth Anchor Sowmya rao Sowmya Rao

సంబంధిత కథనాలు

Janaki Kalaganaledu March 21st: రామని దారుణంగా అవమానించిన అఖిల్- భార్యగా బాధ్యతలు నిర్వర్తించమని జానకికి సలహా ఇచ్చిన జ్ఞానంబ

Janaki Kalaganaledu March 21st: రామని దారుణంగా అవమానించిన అఖిల్- భార్యగా బాధ్యతలు నిర్వర్తించమని జానకికి సలహా ఇచ్చిన జ్ఞానంబ

Gruhalakshmi March 21st: తులసమ్మ సేవలో నందు- విక్రమ్ ని ఇష్టపడుతున్న దివ్య, చూసేసిన భాగ్య

Gruhalakshmi March 21st: తులసమ్మ సేవలో నందు- విక్రమ్ ని ఇష్టపడుతున్న దివ్య, చూసేసిన భాగ్య

Brahmamudi March 21st: భార్యాభర్తలుగా కావ్య, రాజ్- రిసెప్షన్ కి మారువేషాలు వేసుకొచ్చిన కనకం, మీనాక్షి

Brahmamudi March 21st: భార్యాభర్తలుగా కావ్య, రాజ్- రిసెప్షన్ కి మారువేషాలు వేసుకొచ్చిన కనకం, మీనాక్షి

Guppedanta Manasu March 21st: ఇద్దరి మధ్యా దూరం లేదు భారం మాత్రమే అన్న రిషి, దేవయాని ఫస్ట్ నైట్ ప్లాన్ కి రిషిధార ఇచ్చే సమాధానం!

Guppedanta Manasu March 21st: ఇద్దరి మధ్యా దూరం లేదు భారం మాత్రమే అన్న రిషి, దేవయాని ఫస్ట్ నైట్ ప్లాన్ కి రిషిధార ఇచ్చే సమాధానం!

Ennenno Janmalabandham March 21st: తులాభారం ఆపేందుకు విన్నీ స్కెచ్- వేద తన ప్రేమతో భర్తని దక్కించుకుంటుందా?

Ennenno Janmalabandham March 21st: తులాభారం ఆపేందుకు విన్నీ స్కెచ్- వేద తన ప్రేమతో భర్తని దక్కించుకుంటుందా?

టాప్ స్టోరీస్

AP News: మహిళా ఉద్యోగులకు ఏపీ సర్కార్ శుభవార్త - చైల్డ్ కేర్ లీవ్ ఎప్పుడైనా వాడుకోవచ్చని వెల్లడి

AP News: మహిళా ఉద్యోగులకు ఏపీ సర్కార్ శుభవార్త - చైల్డ్ కేర్ లీవ్ ఎప్పుడైనా వాడుకోవచ్చని వెల్లడి

వడగళ్ల వానతో నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటించనున్న సీఎం కేసీఆర్

వడగళ్ల వానతో నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటించనున్న సీఎం కేసీఆర్

CM Jagan : ఓ స్కిల్డ్ క్రిమినల్ చేసిన స్కామ్ స్కిల్ డెవలప్మెంట్, దేశంలోనే అతి పెద్ద కుంభకోణం - సీఎం జగన్

CM Jagan : ఓ స్కిల్డ్ క్రిమినల్ చేసిన స్కామ్ స్కిల్ డెవలప్మెంట్, దేశంలోనే అతి పెద్ద కుంభకోణం - సీఎం జగన్

Kota Srinivasa Rao : డబ్బు కోసం మనిషి ప్రాణాలతో ఆడుకోవద్దు - మరణ వార్తపై కోట శ్రీనివాస రావు సీరియస్

Kota Srinivasa Rao : డబ్బు కోసం మనిషి ప్రాణాలతో ఆడుకోవద్దు - మరణ వార్తపై కోట శ్రీనివాస రావు సీరియస్