Rashmi Gautham: యాంకర్ రష్మీ గౌతమ్ తాగుతుందా? తర్వాత కంట్రోల్ తప్పుతుందా? 'జబర్దస్త్'లో ఆ నటుడు అంత మాట అనేశాడేంటి?
'జబర్దస్త్ ' కమెడియన్ ఇమ్మాన్యుయేల్ తాజాగా యాంకర్ రష్మీ గౌతమ్ పై ఇంట్రెస్టింగ్ పంచులు వేశారు. దీనికి సంబంధించిన 'జబర్దస్త్ ' ప్రోమో తాజాగా రిలీజ్ అయింది.
బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్న పాపులర్ బుల్లితెర కామెడీ షో 'జబర్దస్త్'. ఇప్పటిదాకా ఈ షోలో ఎంతోమంది జడ్జిలు, అలాగే టీమ్ లీడర్స్, కంటెస్టెంట్స్ కూడా మారుతూ వచ్చారు. ఒక్క యాంకర్ రష్మి(Anchor Rashmi Gautam) తప్ప. నిజానికి యాంకర్లు కూడా మారారు. కానీ చివరికి మళ్ళీ ఆ యాంకర్ పొజిషన్ రష్మి చేతికే చిక్కింది. అయితే తాజాగా 'రష్మి గౌతమ్ తాగుతుంది' అంటూ ఇమ్మాన్యూయేల్ పంచ్ వేయడం ఆసక్తికరంగా మారింది.
'జబర్దస్త్' లేటెస్ట్ ప్రోమోలో ఇదే హైలెట్
'జబర్దస్త్' షోకు సంబంధించిన తాజా ప్రోమోని రిలీజ్ చేశారు. అందులో భాగంగా ఎప్పటిలాగే రానున్న ఎపిసోడ్స్ కు సంబంధించిన హైలెట్స్ ని ముందుగానే ప్రోమో ద్వారా చూపించారు. అయితే షోలో భాగంగా ఫస్ట్ ఇమ్మాన్యూయేల్ టీం పర్ఫార్మ్ చేసింది. స్కిట్లో భాగంగా ఇమ్మాన్యూయేల్ అమ్మాయి గెటప్ లో కనిపించాడు. ముందుగా తన పేరు ఖుష్మీ అంటూ పరిచయం చేసుకున్నాడు. అంటే ఖుష్బూ పేరులోని మొదటి అక్షరం, రష్మి పేరులోని సెకండ్ అక్షరం తీసుకుని ఆ పేరు పెట్టారని రష్మీ క్లారిటీ ఇచ్చింది. అనంతరం అతను రష్మీ గౌతమ్ పై వేసిన పంచ్ హిలేరియస్ గా ఉంది. "అత్తమ్మ పబ్బుకి వెళ్తున్నాను" అంటూ అతని టీంలోని మరో కంటెస్టెంట్ వచ్చి చెప్పగా, "ఎవరితో వెళ్తున్నావ్ ?" అని ప్రశ్నించాడు ఇమ్మాన్యూయేల్. వెంటనే ఆమె "నా ఫ్రెండ్ రష్మితో అని చెప్పగా... "దాంతో కొంచెం జాగ్రత్తమ్మ. తాగాక అది ఎలా పడితే అలా చేస్తుందట" అంటూ పంచ్ వేశాడు. ఆ పంచ్ కి రష్మి నవ్వుతూ అతని వైపు చూడడం ప్రోమోలో కనిపించింది.
ఇక ఎప్పట్లాగే ఈ ప్రోమో కూడా ఆసక్తికరంగా సాగింది. ఈ లేటెస్ట్ ప్రోమోలో ఆటో రాంప్రసాద్ వింటర్ పై వేసిన స్కిట్, నూకరాజు - తాగుబోతు రమేష్ కలిసి చేసిన మునక్కాయ స్కిట్, బుల్లెట్ భాస్కర్ చేసిన డ్రైవర్ - ఓనర్ స్కిట్, చలాకి చంటి, యాదమ్మ రాజులు వేసిన స్కిట్లు, వాటితో పాటు చివర్లో జడ్జిలు శివాజీ, ఖుష్బూ ఇచ్చిన రియాక్షన్ ప్రోమోలో హైలెట్ అని చెప్పొచ్చు. తాజా ప్రోమోలో డిసెంబర్ 13, 14 తేదీలకు సంబంధించిన ఎపిసోడ్ల హైలెట్స్ ని చూపించారు. ఖుష్బూ, శివాజీ జడ్జిలుగా వ్యవహరిస్తున్న జబర్దస్త్ షో ప్రతి శుక్రవారం, శనివారం రాత్రి 9:30 గంటలకు ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే.
ఇమాన్యుయల్ బట్టతలపై రష్మీ పంచ్
అయితే దీనికంటే ముందే రిలీజ్ అయిన 'శ్రీదేవి డ్రామా కంపెనీ' లేటెస్ట్ ప్రోమోలో రష్మి గౌతమ్... ఇమ్మాన్యూయేల్ బట్టతలపై పంచ్ వేస్తూ కనిపించింది. బిస్కెట్ టాస్క్ లో "దీన్ని ముఖంపై పెట్టమన్నారు. మీ ముఖం ఎక్కడ ఉంది?" అంటూ ఇమ్మాన్యూయేల్ బట్టతలపై బిస్కెట్ పెట్టి అందరిని నవ్వించింది. ఈ నేపథ్యంలోనే తాజాగా 'జబర్దస్త్' ప్రోమోలో ఇమ్మాన్యూయేల్ రష్మి గౌతమ్ పై పంచ్ వేయడంతో స్వీట్ రివేంజ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది మాత్రం 'ఏంటి రష్మి తాగుతుందా ? అదేంటి అంత మాట అనేసాడు' అంటూ ఆశ్చర్యపోతున్నారు.
Also Read: ఎవరీ వినయ్ మహేశ్వరి? మోహన్ బాబు వర్సెస్ మనోజ్ గొడవలో కీలకంగా మారిన బయట వ్యక్తి ఎవరు?